Bản dịch ý nghĩa nội dung Qur'an - Bản dịch tiếng Telugu về diễn giải ngắn gọn Kinh Qur'an

external-link copy
11 : 9

فَاِنْ تَابُوْا وَاَقَامُوا الصَّلٰوةَ وَاٰتَوُا الزَّكٰوةَ فَاِخْوَانُكُمْ فِی الدِّیْنِ ؕ— وَنُفَصِّلُ الْاٰیٰتِ لِقَوْمٍ یَّعْلَمُوْنَ ۟

అయితే ఒక వేళ వారు తమ అవిశ్వాసము నుండి అల్లాహ్ యందు పశ్చాత్తాప్పడి (తౌబా చేసి),రెండు సాక్షములను (షహాదతైన్ లను) పలికి,నమాజులను నెలకొల్పి,తమ సంపదల నుండి జకాతును చెల్లిస్తే వారు ముస్లిములైపోయారు.మరియు వారు ధర్మం ప్రకారం మీ సోదరులు.మీ కొరకు ఏవి ఉన్నవో వారి కొరకు అవే ఉన్నవి,మీపై (బాధ్యతగా) ఏవి ఉన్నవో వారిపై అవే ఉన్నవి.వారితో యుద్ధం చేయటం మీ కొరకు ధర్మసమ్మతం కాదు.అయితే వారి ఇస్లాం స్వీకరించటం వారి రక్తములను,వారి సంపదలను,వారి మానమర్యాదలను పరిరక్షిస్తుంది.మరియు మేము ఆయతులను విడమరచి చెబుతున్నాము, తెలుసుకునే జనుల కొరకు వాటిని స్పష్టపరుస్తున్నాము.వారే వాటి ద్వారా ప్రయోజనం చెందుతారు.మరియు వాటి ద్వారా ఇతరులకు ప్రయోజనం చేకురుస్తారు. info
التفاسير:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• دلَّت الآيات على أن قتال المشركين الناكثين العهد كان لأسباب كثيرة، أهمها: نقضهم العهد.
వాగ్దానాలను భంగ పరిచే ముష్రికులతో యుద్ధం చేయటమునకు చాలా కారణములు ఉన్నవి,వాటిలో వారు ఒప్పందాలను భంగపరచటం ప్రాధాన్యమైనది అన్న విషయంపై ఆయతులు సూచిస్తున్నవి. info

• في الآيات دليل على أن من امتنع من أداء الصلاة أو الزكاة فإنه يُقاتَل حتى يؤديهما، كما فعل أبو بكر رضي الله عنه.
నమాజు పాటించటం నుండి,జకాతు చెల్లించటం నుండి ఆగిపోయేవాడు ఆ రెండింటిని పాటించేవరకు పోరాడబడుతాడు అన్న దానిపై ఆయతుల్లో ఆధారమున్నది.ఏ విధంగానైతే అబూబకర్ రజిఅల్లాహు అన్హు చేశారో. info

• استدل بعض العلماء بقوله تعالى:﴿وَطَعَنُوا فِي دِينِكُمْ﴾ على وجوب قتل كل من طعن في الدّين عامدًا مستهزئًا به.
అల్లాహ్ యొక్క ఈ వాక్కు "వ తఅనూ ఫీ దీనికుమ్" (وَطَعَنُوا فِي دِينِكُمْ) ద్వారా కొందరు ధార్మిక విధ్వాంసులు ధర్మ విషయంలో కావాలని,హేళన చేస్తూ లోపాలను చూపే ప్రతి వ్యక్తిని హతమార్చటం అనివార్యము అని ఆధారం చూపారు. info

• في الآيات دلالة على أن المؤمن الذي يخشى الله وحده يجب أن يكون أشجع الناس وأجرأهم على القتال.
ఒకే అల్లాహ్ తో భయపడే విశ్వాసపరుడు యుద్ధంలో ప్రజల్లోకెల్ల ధైర్యవంతుడు,వారిలోకెల్ల సాహసవంతుడై ఉండటం తప్పనిసరి అనటానికి ఆయతుల్లో ఆధారమున్నది. info