Bản dịch ý nghĩa nội dung Qur'an - 简易古兰经经注泰卢固语版

Số trang:close

external-link copy
40 : 44

اِنَّ یَوْمَ الْفَصْلِ مِیْقَاتُهُمْ اَجْمَعِیْنَ ۟ۙ

అల్లాహ్ దాసుల మధ్య తీర్పునిచ్చేదైన ప్రళయదినము సృష్టితాలన్నింటి కొరకు నిర్ణీత సమయము. అల్లాహ్ వారిని అందులో సమీకరిస్తాడు. info
التفاسير:

external-link copy
41 : 44

یَوْمَ لَا یُغْنِیْ مَوْلًی عَنْ مَّوْلًی شَیْـًٔا وَّلَا هُمْ یُنْصَرُوْنَ ۟ۙ

ఆ రోజు ఏ సన్నిహితుడు తన సన్నిహితుడినికి గాని ఏ స్నేహితుడు తన ఏ స్నేహితునికి ప్రయోజనం కలిగించడు. మరియు వారు అల్లాహ్ శిక్షను ఆపలేరు. ఎందుకంటే ఆ రోజు అధికారం అల్లాహ్ కే చెందుతుంది. ఎవరు దానిగురించి వాదించలేడు. info
التفاسير:

external-link copy
42 : 44

اِلَّا مَنْ رَّحِمَ اللّٰهُ ؕ— اِنَّهٗ هُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۟۠

కాని అల్లాహ్ ప్రజల్లోంచి ఎవరిపై కరుణిస్తే అతడు తాను ముందు చేసి పంపించుకున్న సత్కర్మతో ప్రయోజనం చెందుతాడు. నిశ్చయంగా అల్లాహ్ ఎవరూ ఓడించని సర్వాధిక్యుడు,తన దాసుల్లోంచి తౌబా చేసిన వారిపై కరుణించేవాడు. info
التفاسير:

external-link copy
43 : 44

اِنَّ شَجَرَتَ الزَّقُّوْمِ ۟ۙ

నిశ్ఛయంగా జఖ్ఖుమ్ వృక్షము దాన్ని అల్లాహ్ నరకము మధ్యలో మొలకెత్తిస్తాడు. info
التفاسير:

external-link copy
44 : 44

طَعَامُ الْاَثِیْمِ ۟

మహా పాపి అయిన అవిశ్వాసపరుని ఆహారము,దాని హానికరమైన ఫలమును అతడు తింటాడు. info
التفاسير:

external-link copy
45 : 44

كَالْمُهْلِ ۛۚ— یَغْلِیْ فِی الْبُطُوْنِ ۟ۙ

ఈ ఫలము నల్లటి నూనే వలె ఉంటుంది. అది తన వేడి తీవ్రత వలన వారి కడుపులలో మరుగుతుంది. info
التفاسير:

external-link copy
46 : 44

كَغَلْیِ الْحَمِیْمِ ۟

తీవ్ర వేడి నీరు మరుగటంలాగా. info
التفاسير:

external-link copy
47 : 44

خُذُوْهُ فَاعْتِلُوْهُ اِلٰی سَوَآءِ الْجَحِیْمِ ۟ۙ

నరక భటులతో ఇలా ఆదేశించబడును : మీరు అతడిని పట్టుకుని నరకం మధ్యం వైపునకు కఠినంగా,బలంగా ఈడ్చండి. info
التفاسير:

external-link copy
48 : 44

ثُمَّ صُبُّوْا فَوْقَ رَاْسِهٖ مِنْ عَذَابِ الْحَمِیْمِ ۟ؕ

ఆ తరువాత మీరు శిక్షంపబడే ఈ వ్యక్తి తల పైనుండి వేడి నీళ్లను గుమ్మరించండి. అయితే శిక్ష అతని నుండి వేరవదు. info
التفاسير:

external-link copy
49 : 44

ذُقْ ۖۚ— اِنَّكَ اَنْتَ الْعَزِیْزُ الْكَرِیْمُ ۟

మరియు అతనితో వ్యంగ్యముగా ఇలా పలకబడుతుంది : ఈ భాధాకరమైన శిక్ష రుచిని చూడు. నిశ్ఛయంగా నీవే నీ జాతిలో నీ ఉన్నతమైన గౌరవమును కించబరచకుండా ఉండిన ఆధిక్యుడివి. info
التفاسير:

external-link copy
50 : 44

اِنَّ هٰذَا مَا كُنْتُمْ بِهٖ تَمْتَرُوْنَ ۟

నిశ్ఛయంగా ప్రళయదినమున వాటిల్లే విషయంలో మీరు సందేహపడిన శిక్ష ఇదే. దాన్ని మీరు ప్రత్యక్షంగా చూడటంతో మీ నుండి సందేహం తొలగిపోయినది. info
التفاسير:

external-link copy
51 : 44

اِنَّ الْمُتَّقِیْنَ فِیْ مَقَامٍ اَمِیْنٍ ۟ۙ

నిశ్ఛయంగా తమ ప్రభువుపట్ల ఆయన ఆదేశములను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భీతి కలిగిన వారు తమకు కలిగే ప్రతీ బాధ నుండి సురక్షిత ప్రదేశంలో ఉంటారు. info
التفاسير:

external-link copy
52 : 44

فِیْ جَنّٰتٍ وَّعُیُوْنٍ ۟ۚۙ

తోటలలో,ప్రవహించే చెలమలలో, info
التفاسير:

external-link copy
53 : 44

یَّلْبَسُوْنَ مِنْ سُنْدُسٍ وَّاِسْتَبْرَقٍ مُّتَقٰبِلِیْنَ ۟ۚۙ

వారు స్వర్గంలో పలుచని మరియు మందమైన పట్టు వస్త్రములను తొడుగుతారు. వారు ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చుని ఉంటారు. మరియు వారిలోని ఒకరు ఇంకొకరి తల వెనుక భాగమును చూడరు. info
التفاسير:

external-link copy
54 : 44

كَذٰلِكَ ۫— وَزَوَّجْنٰهُمْ بِحُوْرٍ عِیْنٍ ۟ؕ

ఈ ప్రస్తావించిన వాటితో మేము వారిని గౌరవించినట్లే మేము స్వర్గంలో తమ తెల్లదనం,తమ నలుపుదనం ఉండి కూడా పెద్దపెద్ద కళ్ళు కలిగిన అందమైన స్త్రీలతో వారి వివాహం చేస్తాము. info
التفاسير:

external-link copy
55 : 44

یَدْعُوْنَ فِیْهَا بِكُلِّ فَاكِهَةٍ اٰمِنِیْنَ ۟ۙ

అక్కడ వారు తమ సేవకులను తాము కోరిన ప్రతీ ఫలమును తమ వద్దకు తీసుకుని రమ్మని విన్నపించుకుంటారు వారు వాటి అంతమైపోవటం నుండి,వాటి నష్టముల నుండి నిశ్ఛింతగా ఉంటారు. info
التفاسير:

external-link copy
56 : 44

لَا یَذُوْقُوْنَ فِیْهَا الْمَوْتَ اِلَّا الْمَوْتَةَ الْاُوْلٰی ۚ— وَوَقٰىهُمْ عَذَابَ الْجَحِیْمِ ۟ۙ

వారు అందులో శాశ్వతంగా ఉంటారు. వారు ఇహలోకములోని మొదటి మరణం తప్ప అందులో మరణం రుచి చూడరు. మరియు వారి ప్రభువు వారిని నరకాగ్ని శిక్ష నుండి రక్షించాడు. info
التفاسير:

external-link copy
57 : 44

فَضْلًا مِّنْ رَّبِّكَ ؕ— ذٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِیْمُ ۟

వారిపై తమ ప్రభువు వద్ద నుండి అనుగ్రహముగా మరియు ఉపకారముగా. ఈ ప్రస్తావించబడిన స్వర్గములో వారి ప్రవేశము మరియు నరకాగ్ని నుండి వారికి రక్షణ ఇదే దానికి ఎటువంటి సాఫల్యము సరితూగని గొప్ప సాఫల్యము. info
التفاسير:

external-link copy
58 : 44

فَاِنَّمَا یَسَّرْنٰهُ بِلِسَانِكَ لَعَلَّهُمْ یَتَذَكَّرُوْنَ ۟

నిశ్ఛయంగా మేము ఈ ఖుర్ఆన్ ను ఓ ప్రవక్తా మీ అరబీ భాషలో అవతరింపజేసి దాన్ని సులభతరం చేశాము. బహుశా వారు హితోపదేశం గ్రహిస్తారని. info
التفاسير:

external-link copy
59 : 44

فَارْتَقِبْ اِنَّهُمْ مُّرْتَقِبُوْنَ ۟۠

అయితే మీరు మీకు సహాయం కలగటానికి మరియు వారి వినాశనమునకు నిరీక్షించండి. నిశ్చయంగా వారు మీ వినాశనమునకు నిరీక్షిస్తున్నారు. info
التفاسير:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• الجمع بين العذاب الجسمي والنفسي للكافر.
అవిశ్వాసి కొరకు శారీరక మరియు మానసిక శిక్ష మధ్య సమీకరించటం. info

• الفوز العظيم هو النجاة من النار ودخول الجنة.
నరకాగ్ని నుండి ముక్తి మరియు స్వర్గంలో ప్రవేశించటమే గొప్ప సాఫల్యం. info

• تيسير الله لفظ القرآن ومعانيه لعباده.
ఖుర్ఆన్ యొక్క ఉచ్ఛరణను మరియు దాని అర్ధాలను అల్లాహ్ తన దాసుల కొరకు సులభతరం చేయటం. info