Bản dịch ý nghĩa nội dung Qur'an - 简易古兰经经注泰卢固语版

లుఖ్మాన్

Trong những ý nghĩa của chương Kinh:
الأمر باتباع الحكمة التي تضمّنها القرآن، والتحذير من الإعراض عنها.
ఖుర్ఆన్ లో ఉన్న జ్ఞానమును అనుసరించమని ఆదేశము మరియు దానితో విముఖత చూపటం నుండి హెచ్చరించడం. info

external-link copy
1 : 31

الٓمّٓ ۟ۚ

(الٓـمٓ) అలిఫ్-లామ్-మీమ్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది. info
التفاسير:

external-link copy
2 : 31

تِلْكَ اٰیٰتُ الْكِتٰبِ الْحَكِیْمِ ۟ۙ

ఓ ప్రవక్తా మీపై అవతరింపబడిన ఈ ఆయతులు విజ్ఞతతో మాట్లాడే గ్రంధ ఆయతులు. info
التفاسير:

external-link copy
3 : 31

هُدًی وَّرَحْمَةً لِّلْمُحْسِنِیْنَ ۟ۙ

మరియు అది తమ ప్రభువు హక్కులను,ఆయన దాసుల హక్కులను నెరవేర్చటంతో సత్కార్యము చేసే వారి కొరకు మార్గదర్శకత్వము,కారుణ్యము. info
التفاسير:

external-link copy
4 : 31

الَّذِیْنَ یُقِیْمُوْنَ الصَّلٰوةَ وَیُؤْتُوْنَ الزَّكٰوةَ وَهُمْ بِالْاٰخِرَةِ هُمْ یُوْقِنُوْنَ ۟ؕ

వారు నమాజును పరిపూర్ణ పద్దతిలో పాటిస్తారు మరియు వారు తమ సంపదల జకాత్ విధి దానమును చెల్లిస్తారు. మరియు వారు అంతిమ దినములో ఉన్న మరణాంతరం లేపబడటం,లెక్క తీసుకోబడటం,ప్రతిఫలం ప్రసాదించబడటం,శిక్షింపబడటం పై విశ్వాసమును కనబరుస్తారు. info
التفاسير:

external-link copy
5 : 31

اُولٰٓىِٕكَ عَلٰی هُدًی مِّنْ رَّبِّهِمْ وَاُولٰٓىِٕكَ هُمُ الْمُفْلِحُوْنَ ۟

ఈ గుణాలతో వర్ణించబడిన వీరందరు తమ ప్రభువు వద్ద నుండి సన్మార్గంపై ఉన్నారు. మరియు వారందరే తాము ఆశించిన వాటిని పొంది,తాము భయపడే వాటి నుండి దూరంగా ఉండటంతో సాఫల్యం చెందుతారు. info
التفاسير:

external-link copy
6 : 31

وَمِنَ النَّاسِ مَنْ یَّشْتَرِیْ لَهْوَ الْحَدِیْثِ لِیُضِلَّ عَنْ سَبِیْلِ اللّٰهِ بِغَیْرِ عِلْمٍ ۖۗ— وَّیَتَّخِذَهَا هُزُوًا ؕ— اُولٰٓىِٕكَ لَهُمْ عَذَابٌ مُّهِیْنٌ ۟

మరియు ప్రజల్లోంచి నజర్ బిన్ హారిస్ లాంటి వారు పరధ్యానంలో పడవేసే మాటలను ఎంచుకుని ప్రజలను ఎటువంటి జ్ఞానం లేకుండా అల్లాహ్ ధర్మం నుండి వాటి వైపు మరలిస్తారు. మరియు అల్లాహ్ ఆయతులను ఎగతాళిగా చేసుకుని వాటి నుండి పరిహాసమాడేవారు. ఈ గుణాలతో వర్ణించబడిన వీరందరికి పరలోకంలో అవమానమును కలిగించే శిక్ష ఉన్నది. info
التفاسير:

external-link copy
7 : 31

وَاِذَا تُتْلٰی عَلَیْهِ اٰیٰتُنَا وَلّٰی مُسْتَكْبِرًا كَاَنْ لَّمْ یَسْمَعْهَا كَاَنَّ فِیْۤ اُذُنَیْهِ وَقْرًا ۚ— فَبَشِّرْهُ بِعَذَابٍ اَلِیْمٍ ۟

మరియు అతనిపై మా ఆయతులు చదివి వినిపించినప్పుడు అతడు వాటిని వినటం నుండి అహంకారమును చూపుతూ వాటిని విననట్లుగా, శబ్దములను వినటం నుండి అతని రెండు చెవులలో చెవుడు ఉన్నట్లుగా మరలిపోతాడు. ఓ ప్రవక్తా మీరు అతనికి అతని గురించి నిరీక్షించే బాధాకరమైన శిక్ష గురించి శుభవార్తనివ్వండి. info
التفاسير:

external-link copy
8 : 31

اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ لَهُمْ جَنّٰتُ النَّعِیْمِ ۟ۙ

నిశ్చయంగా అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి సత్కార్యములు చేసే వారి కొరకు అనుగ్రహభరితమైన స్వర్గ వనాలు కలవు. అల్లాహ్ వారి కోసం సిద్ధం చేసి ఉంచిన వాటిని అనుభవిస్తారు. info
التفاسير:

external-link copy
9 : 31

خٰلِدِیْنَ فِیْهَا ؕ— وَعْدَ اللّٰهِ حَقًّا ؕ— وَهُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟

వారు వాటిలో శాశ్వతంగా ఉంటారు. దీని గురించి అల్లాహ్ వారితో ఎటువంటి సందేహం లేని సత్య వాగ్దానము చేశాడు. మరియు పరిశుద్ధుడైన ఆయన తనని ఎవరూ ఓడించని సర్వ శక్తిమంతుడు మరియు తన సృష్టించటంలో,తన విధి వ్రాతలో,తన ధర్మ శాసనములలో వివేకనంతుడు. info
التفاسير:

external-link copy
10 : 31

خَلَقَ السَّمٰوٰتِ بِغَیْرِ عَمَدٍ تَرَوْنَهَا وَاَلْقٰی فِی الْاَرْضِ رَوَاسِیَ اَنْ تَمِیْدَ بِكُمْ وَبَثَّ فِیْهَا مِنْ كُلِّ دَآبَّةٍ ؕ— وَاَنْزَلْنَا مِنَ السَّمَآءِ مَآءً فَاَنْۢبَتْنَا فِیْهَا مِنْ كُلِّ زَوْجٍ كَرِیْمٍ ۟

పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ ఆకాశములను ఎత్తుగా ఎటువంటి స్థంభములు లేకుండా సృష్టించాడు. మరియు భూమిలో అది మిమ్మల్ని తీసుకుని ప్రకంపించకుండా ఉండేందుకు పర్వతములను పాతాడు. మరియు భూమిపై రకరకాల జంతువులను విస్తరింపజేశాడు. మరియు మేము ఆకాశము నుండి వర్షపు నీటిని అవతరింపజేశాము. అప్పుడు మేము భూమిలో ఆనందభరితమైన దృశ్యము కల అన్ని రకముల వాటిని మొలకెత్తించాము. దానితో ప్రజలు,పశువులు ప్రయోజనం చెందుతారు. info
التفاسير:

external-link copy
11 : 31

هٰذَا خَلْقُ اللّٰهِ فَاَرُوْنِیْ مَاذَا خَلَقَ الَّذِیْنَ مِنْ دُوْنِهٖ ؕ— بَلِ الظّٰلِمُوْنَ فِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟۠

ఈ ప్రస్తావించబడినవి అల్లాహ్ సృష్టితాలు. ఓ ముష్రికులారా అల్లాహ్ ను వదిలి మీరు ఆరాధించేవి ఏమి సృష్టించాయో నాకు చూపించండి ?!. కాని దుర్మార్గులు సత్యము నుండి స్పష్టమైన మార్గ భ్రష్టతలో ఉన్నారు. ఏవిధంగానంటే వారు తమ ప్రభువుతో పాటు ఏమీ సృష్టించని వారిని సాటి కల్పిస్తున్నారు. మరియు వారే సృష్టించబడినవారు. info
التفاسير:
Trong những bài học trích được của các câu Kinh trên trang này:
• طاعة الله تقود إلى الفلاح في الدنيا والآخرة.
అల్లాహ్ పై విధేయత ఇహలోకములో,పరలోకములో సాఫల్యమునకు దారి తీస్తుంది. info

• تحريم كل ما يصد عن الصراط المستقيم من قول أو فعل.
మాటల్లోంచి లేదా చేతల్లోంచి సన్మార్గము నుండి ఆపే ప్రతీది నిషేధము. info

• التكبر مانع من اتباع الحق.
అహంకారం సత్యమును అనుసరించటం నుండి ఆటంకపరుస్తుంది. info

• انفراد الله بالخلق، وتحدي الكفار أن تخلق آلهتهم شيئًا.
సృష్టించటంలో అల్లాహ్ ప్రత్యేకమైనవాడు కావటం,మరియు అవిశ్వాసపరులకు వారి విగ్రహాలు ఏదైన దాన్ని సృష్టించటం గురించి ఛాలేంజ్ చేయటం. info