[1] యూదులు దైవప్రవక్త ('స'అస)ను వినినప్పుడు, ఎగతాళి చేస్తూ ఇలా అనేవారు: సమి'అనా వ 'అ'సయ్ నా. "మేము నీ మాటను విన్నాము." అని బిగ్గరగా అని తరువాత ముఖం త్రిప్పుకొని గాని, లేక మెల్లగా గాని కొన్నిసార్లు ఎగతాళిగా గానీ అతని ('స'అస) ముఖం మీద కూడా "ఉల్లంఘించాము," అని అనేవారు. అదే విధంగా: వస్ మ'అ 'గైర మస్ మ'ఇన్. అంటే - "విను! నీ మాట వినకుండాబోవు గాక!" లేక "నీ మాట అంగీకరించబడక పోవు గాక!" అని శపించేవారు. ఇంకా చూడండి, 2:93. [2] రా'ఇనా : కొరకు చూడండి 2:104.