Traducción de los significados del Sagrado Corán - Traducción Telugu- Abder-Rahim ibn Muhammad

external-link copy
46 : 4

مِنَ الَّذِیْنَ هَادُوْا یُحَرِّفُوْنَ الْكَلِمَ عَنْ مَّوَاضِعِهٖ وَیَقُوْلُوْنَ سَمِعْنَا وَعَصَیْنَا وَاسْمَعْ غَیْرَ مُسْمَعٍ وَّرَاعِنَا لَیًّا بِاَلْسِنَتِهِمْ وَطَعْنًا فِی الدِّیْنِ ؕ— وَلَوْ اَنَّهُمْ قَالُوْا سَمِعْنَا وَاَطَعْنَا وَاسْمَعْ وَانْظُرْنَا لَكَانَ خَیْرًا لَّهُمْ وَاَقْوَمَ ۙ— وَلٰكِنْ لَّعَنَهُمُ اللّٰهُ بِكُفْرِهِمْ فَلَا یُؤْمِنُوْنَ اِلَّا قَلِیْلًا ۟

యూదులలో కొందరు పదాలను వాటి సందర్భాల నుండి తారుమారు చేసి అంటారు: "మేము (నీ మాటలను) విన్నాము మరియు ఉల్లంఘించాము (సమి'అనా వ 'అ'సయ్ నా)." అనీ; మరియు: "విను! నీ మాట వినకబోవు గాక! (వస్ మ 'అ 'గైర మస్ మ'ఇన్)."[1] అనీ; మరియు (ఓ ముహమ్మద్!) నీవు మా మాట విను (రా'ఇనా) [2] అనీ తమ నాలుకలను మెలి త్రిప్పి సత్యధర్మాన్ని ఎగతాళి చేసే ఉద్దేశ్యంతో అంటారు. కాని అలా కాకుండా: "విన్నాము, విధేయులమయ్యాము. (సమి'అనా వ అ'త'అనా)." అనీ; మరియు: "మమ్మల్ని విను మరియు మా దిక్కుచూడు / మాకు వ్యవధినివ్వు (వస్ మ'అ వన్'జుర్ నా)," అనీ, అని ఉంటే వారికే మేలై ఉండేది మరియు ఉత్తమమైన పద్ధతిగా ఉండేది. కాని వారి సత్యతిరస్కార వైఖరి వల్ల అల్లాహ్ వారిని శపించాడు (బహిష్కరించాడు). కావున వారిలో కొందరు మాత్రమే విశ్వసించేవారు ఉన్నారు. info

[1] యూదులు దైవప్రవక్త ('స'అస)ను వినినప్పుడు, ఎగతాళి చేస్తూ ఇలా అనేవారు: సమి'అనా వ 'అ'సయ్ నా. "మేము నీ మాటను విన్నాము." అని బిగ్గరగా అని తరువాత ముఖం త్రిప్పుకొని గాని, లేక మెల్లగా గాని కొన్నిసార్లు ఎగతాళిగా గానీ అతని ('స'అస) ముఖం మీద కూడా "ఉల్లంఘించాము," అని అనేవారు. అదే విధంగా: వస్ మ'అ 'గైర మస్ మ'ఇన్. అంటే - "విను! నీ మాట వినకుండాబోవు గాక!" లేక "నీ మాట అంగీకరించబడక పోవు గాక!" అని శపించేవారు. ఇంకా చూడండి, 2:93. [2] రా'ఇనా : కొరకు చూడండి 2:104.

التفاسير: