قرآن کریم کے معانی کا ترجمہ - تیلگو ترجمہ - عبدالرحیم بن محمد

صفحہ نمبر:close

external-link copy
119 : 16

ثُمَّ اِنَّ رَبَّكَ لِلَّذِیْنَ عَمِلُوا السُّوْٓءَ بِجَهَالَةٍ ثُمَّ تَابُوْا مِنْ بَعْدِ ذٰلِكَ وَاَصْلَحُوْۤا اِنَّ رَبَّكَ مِنْ بَعْدِهَا لَغَفُوْرٌ رَّحِیْمٌ ۟۠

అయితే నిశ్చయంగా, నీ ప్రభువు - ఎవరైతే అజ్ఞానంలో పాపాలు చేసి, ఆ పిదప పశ్చాత్తాప పడి, సరిదిద్దుకుంటారో - దాని (ఆ పశ్చాత్తాపం) తరువాత (వారిని క్షమిస్తాడు); నిశ్చయంగా, నీ ప్రభువు క్షమించేవాడు, అపార కరుణా ప్రదాత. info
التفاسير:

external-link copy
120 : 16

اِنَّ اِبْرٰهِیْمَ كَانَ اُمَّةً قَانِتًا لِّلّٰهِ حَنِیْفًا ؕ— وَلَمْ یَكُ مِنَ الْمُشْرِكِیْنَ ۟ۙ

నిశ్చయంగా, ఇబ్రాహీమ్ (ఒక్కడే) అల్లాహ్ కు భక్తిపరుడై, ఏకదైవ సిద్ధాంతాన్ని (సత్యధర్మాన్ని) స్థాపించటంలో తనకు తానే ఒక సమాజమై ఉండెను.[1] అతను అల్లాహ్ కు సాటి కల్పించేవారిలో ఎన్నడూ చేరలేదు. info

[1] లేక ఒక నాయకుడై ఉండెను. ఇంకా చూడండి, 4:125.

التفاسير:

external-link copy
121 : 16

شَاكِرًا لِّاَنْعُمِهٖ ؕ— اِجْتَبٰىهُ وَهَدٰىهُ اِلٰی صِرَاطٍ مُّسْتَقِیْمٍ ۟

ఆయన (అల్లాహ్) యొక్క అనుగ్రహాలకు కృతజ్ఞుడై ఉండేవాడు. ఆయన (అల్లాహ్) అతనిని (తన స్నేహితునిగా) ఎన్నుకొని, అతనికి ఋజుమార్గం వైపుకు మార్గదర్శకత్వం చేశాడు. info
التفاسير:

external-link copy
122 : 16

وَاٰتَیْنٰهُ فِی الدُّنْیَا حَسَنَةً ؕ— وَاِنَّهٗ فِی الْاٰخِرَةِ لَمِنَ الصّٰلِحِیْنَ ۟ؕ

మేము అతనికి ఇహలోకంలో మంచి స్థితిని ప్రసాదించాము. మరియు నిశ్చయంగా, అతను పరలోకంలో సద్వర్తనులతో పాటు ఉంటాడు info
التفاسير:

external-link copy
123 : 16

ثُمَّ اَوْحَیْنَاۤ اِلَیْكَ اَنِ اتَّبِعْ مِلَّةَ اِبْرٰهِیْمَ حَنِیْفًا ؕ— وَمَا كَانَ مِنَ الْمُشْرِكِیْنَ ۟

తరువాత మేము నీకు (ఓ ముహమ్మద్!) ఈ సందేశాన్ని పంపాము: "నీవు ఇబ్రాహీమ్ అనుసరించిన, ఏకదైవ సిద్ధాంతాన్ని (సత్యధర్మాన్ని) అనుసరించు. అతను (ఇబ్రాహీమ్) అల్లాహ్ కు సాటి కల్పించే వారిలోని వాడు కాడు." info
التفاسير:

external-link copy
124 : 16

اِنَّمَا جُعِلَ السَّبْتُ عَلَی الَّذِیْنَ اخْتَلَفُوْا فِیْهِ ؕ— وَاِنَّ رَبَّكَ لَیَحْكُمُ بَیْنَهُمْ یَوْمَ الْقِیٰمَةِ فِیْمَا كَانُوْا فِیْهِ یَخْتَلِفُوْنَ ۟

వాస్తవానికి, శనివార శాసనం (సబ్త్) విషయంలో అభిప్రాయభేదాలు కలిగి ఉన్న వారికే అది విధించబడింది. మరియు నిశ్చయంగా, నీ ప్రభువు! పునరుత్థాన దినమున వారి మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలను గురించి తీర్పు చేస్తాడు. info
التفاسير:

external-link copy
125 : 16

اُدْعُ اِلٰی سَبِیْلِ رَبِّكَ بِالْحِكْمَةِ وَالْمَوْعِظَةِ الْحَسَنَةِ وَجَادِلْهُمْ بِالَّتِیْ هِیَ اَحْسَنُ ؕ— اِنَّ رَبَّكَ هُوَ اَعْلَمُ بِمَنْ ضَلَّ عَنْ سَبِیْلِهٖ وَهُوَ اَعْلَمُ بِالْمُهْتَدِیْنَ ۟

(ప్రజలను) వివేకంతోనూ, మంచి ఉపదేశం (ప్రచారం) తోనూ నీ ప్రభువు మార్గం వైపునకు ఆహ్వానించు. మరియు వారితో ఉత్తమరీతిలో వాదించు.[1] నిశ్చయంగా, నీ ప్రభువుకు తన మార్గం నుండి భ్రష్టుడైన వాడెవడో తెలుసు. మరియు మార్గదర్శకత్వం పొందిన వాడెవడో కూడా ఆయనకు బాగా తెలుసు. info

[1] ఇదే విధమైన ఆయత్ కు చూడండి, 29:46. 'ధర్మం విషయంలో బలవంతం లేదు.' 2:256.

التفاسير:

external-link copy
126 : 16

وَاِنْ عَاقَبْتُمْ فَعَاقِبُوْا بِمِثْلِ مَا عُوْقِبْتُمْ بِهٖ ؕ— وَلَىِٕنْ صَبَرْتُمْ لَهُوَ خَیْرٌ لِّلصّٰبِرِیْنَ ۟

మరియు మీరు (మీ ప్రత్యర్థులను) శిక్షించదలచుకుంటే, మీకు జరిగిన దానికి (అన్యాయానికి) సమానమైన శిక్ష మాత్రమే ఇవ్వండి. కాని మీరు సహనం వహిస్తే నిశ్చయంగా, సహనం వహించేవారికి ఎంతో మేలు కలుగుతుంది. info
التفاسير:

external-link copy
127 : 16

وَاصْبِرْ وَمَا صَبْرُكَ اِلَّا بِاللّٰهِ وَلَا تَحْزَنْ عَلَیْهِمْ وَلَا تَكُ فِیْ ضَیْقٍ مِّمَّا یَمْكُرُوْنَ ۟

(ఓ ముహమ్మద్!) నీవు సహనం వహించు మరియు నీకు సహనమిచ్చేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే. మరియు వారిని గురించి దుఃఖపడకు మరియు వారు పన్నే కుట్రలకు నీవు వ్యాకుల పడకు. info
التفاسير:

external-link copy
128 : 16

اِنَّ اللّٰهَ مَعَ الَّذِیْنَ اتَّقَوْا وَّالَّذِیْنَ هُمْ مُّحْسِنُوْنَ ۟۠

నిశ్చయంగా, అల్లాహ్ భయభక్తులు గల వారితో మరియు సజ్జనులైన వారితో పాటు ఉంటాడు. info
التفاسير: