قرآن کریم کے معانی کا ترجمہ - تیلگو ترجمہ - عبدالرحیم بن محمد

صفحہ نمبر:close

external-link copy
80 : 16

وَاللّٰهُ جَعَلَ لَكُمْ مِّنْ بُیُوْتِكُمْ سَكَنًا وَّجَعَلَ لَكُمْ مِّنْ جُلُوْدِ الْاَنْعَامِ بُیُوْتًا تَسْتَخِفُّوْنَهَا یَوْمَ ظَعْنِكُمْ وَیَوْمَ اِقَامَتِكُمْ ۙ— وَمِنْ اَصْوَافِهَا وَاَوْبَارِهَا وَاَشْعَارِهَاۤ اَثَاثًا وَّمَتَاعًا اِلٰی حِیْنٍ ۟

మరియు అల్లాహ్ మీకు, మీ గృహాలలో నివాసం ఏర్పరిచాడు. మరియు పశువుల చర్మాలతో మీకు ఇండ్లు (గుడారాలు) నిర్మించాడు. అవి మీకు ప్రయాణంలో ఉన్నప్పుడు మరియు మీరు బస చేసినప్పుడు, చాలా తేలికగా ఉంటాయి. వాటి ఉన్నితో, బొచ్చుగల చర్మాలతో మరియు వెంట్రుకలతో గృహోపలంకరణ సామగ్రి మరియు కొంతకాలం సుఖంగా గడుపుకునే వస్తువులను (మీ కొరకు సృష్టించాడు). info
التفاسير:

external-link copy
81 : 16

وَاللّٰهُ جَعَلَ لَكُمْ مِّمَّا خَلَقَ ظِلٰلًا وَّجَعَلَ لَكُمْ مِّنَ الْجِبَالِ اَكْنَانًا وَّجَعَلَ لَكُمْ سَرَابِیْلَ تَقِیْكُمُ الْحَرَّ وَسَرَابِیْلَ تَقِیْكُمْ بَاْسَكُمْ ؕ— كَذٰلِكَ یُتِمُّ نِعْمَتَهٗ عَلَیْكُمْ لَعَلَّكُمْ تُسْلِمُوْنَ ۟

మరియు అల్లాహ్ తాను సృష్టించిన వస్తువులలో కొన్నింటిని నీడ కొరకు నియమించాడు మరియు పర్వతాలలో మీకు రక్షణా స్థలాలను ఏర్పరచాడు. మరియు మీరు వేడి నుండి కాపాడుకోవటానికి వస్త్రాలను మరియు యుద్ధం నుండి కాపాడుకోవటానికి కవచాలను ఇచ్చాడు. మీరు ఆయనకు విధేయులై ఉండాలని, ఈ విధంగా ఆయన మీపై తన అనుగ్రహాలను పూర్తి చేస్తున్నాడు. info
التفاسير:

external-link copy
82 : 16

فَاِنْ تَوَلَّوْا فَاِنَّمَا عَلَیْكَ الْبَلٰغُ الْمُبِیْنُ ۟

(ఓ ప్రవక్తా!) ఒకవేళ వారు వెనుదిరిగితే, నీ కర్తవ్యం కేవలం సందేశాన్ని స్పష్టంగా అందజేయటం మాత్రమే! info
التفاسير:

external-link copy
83 : 16

یَعْرِفُوْنَ نِعْمَتَ اللّٰهِ ثُمَّ یُنْكِرُوْنَهَا وَاَكْثَرُهُمُ الْكٰفِرُوْنَ ۟۠

వారు అల్లాహ్ ఉపకారాన్ని గుర్తించిన తరువాత దానిని నిరాకరిస్తున్నారు మరియు వారిలో చాలా మంది సత్యతిరస్కారులే! info
التفاسير:

external-link copy
84 : 16

وَیَوْمَ نَبْعَثُ مِنْ كُلِّ اُمَّةٍ شَهِیْدًا ثُمَّ لَا یُؤْذَنُ لِلَّذِیْنَ كَفَرُوْا وَلَا هُمْ یُسْتَعْتَبُوْنَ ۟

మరియు (జ్ఞాపకం ఉంచుకోండి) ఆ రోజు మేము ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని లేపి నిలబెడ్తాము. అప్పుడు సత్యతిరస్కారులకు ఏ విధమైన (సాకులు చెప్పటానికి) అనుమతి ఇవ్వబడదు[1] మరియు వారికి పశ్చాత్తాప పడే అవకాశం కూడా ఇవ్వబడదు. info

[1] చూడండి, 77:35-36 మరియు 89 వ్యాఖ్యానం.

التفاسير:

external-link copy
85 : 16

وَاِذَا رَاَ الَّذِیْنَ ظَلَمُوا الْعَذَابَ فَلَا یُخَفَّفُ عَنْهُمْ وَلَا هُمْ یُنْظَرُوْنَ ۟

మరియు దుర్మార్గులు ఆ శిక్షను చూసినప్పుడు, అది వారి కొరకు తగ్గించడం జరుగదు మరియు వారికి ఎలాంటి వ్యవధి కూడా ఇవ్వబడదు.[1] info

[1] పరలోక జీవితం ప్రతిఫల జీవితం. అక్కడ మంచి కర్మలు చేయటానికి గానీ లేక పశ్చాత్తాప పడటానికి గానీ వ్యవధి ఇవ్వబడదు.

التفاسير:

external-link copy
86 : 16

وَاِذَا رَاَ الَّذِیْنَ اَشْرَكُوْا شُرَكَآءَهُمْ قَالُوْا رَبَّنَا هٰۤؤُلَآءِ شُرَكَآؤُنَا الَّذِیْنَ كُنَّا نَدْعُوْا مِنْ دُوْنِكَ ۚ— فَاَلْقَوْا اِلَیْهِمُ الْقَوْلَ اِنَّكُمْ لَكٰذِبُوْنَ ۟ۚ

మరియు (అల్లాహ్ కు) సాటి కల్పించిన వారు, తాము సాటిగా నిలిపిన వారిని చూసి అంటారు: "ఓ మా ప్రభూ! వీరే మేము నీకు సాటి కల్పించి, నీకు బదులుగా ఆరాధించిన వారు." కాని (సాటిగా నిలుపబడిన) వారు, సాటి కల్పించిన వారి మాటలను వారి వైపుకే విసురుతూ అంటారు: "నిశ్చయంగా, మీరు అసత్యవాదులు."[1] info

[1] సాటిగా నిలుపబడిన వారి జవాబుకు చూడండి, 10:29, 46:56, 19:81-82, 29:25, 18:52.

التفاسير:

external-link copy
87 : 16

وَاَلْقَوْا اِلَی اللّٰهِ یَوْمَىِٕذِ ١لسَّلَمَ وَضَلَّ عَنْهُمْ مَّا كَانُوْا یَفْتَرُوْنَ ۟

మరియు ఆ రోజు (అందరూ) వినమ్రులై తమను తాము అల్లాహ్ కు అప్పగించుకుంటారు. వారు కల్పించినవి (దైవాలు) వారిని త్యజించి ఉంటాయి. info
التفاسير: