قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - تېلۇگوچە تەرجىمىسى- ئابدۇرەھىم ئىبنى مۇھەممەد

بەت نومۇرى:close

external-link copy
37 : 24

رِجَالٌ ۙ— لَّا تُلْهِیْهِمْ تِجَارَةٌ وَّلَا بَیْعٌ عَنْ ذِكْرِ اللّٰهِ وَاِقَامِ الصَّلٰوةِ وَاِیْتَآءِ الزَّكٰوةِ— یَخَافُوْنَ یَوْمًا تَتَقَلَّبُ فِیْهِ الْقُلُوْبُ وَالْاَبْصَارُ ۟ۙ

ప్రజలలో కొందరిని - వారి వ్యాపారం గానీ మరియు క్రయవిక్రయాలు గానీ - అల్లాహ్ స్మరణ నుండీ, నమాజ్ స్థాపించడం నుండీ మరియు విధిదానం (జకాత్) ఇవ్వడం నుండీ తప్పించలేవు. హృదయాలు మరియు కనుగ్రుడ్లు గిరగిర తిరిగి పోయే, ఆ దినమును గురించి, వారు భయపడుతూ ఉంటారు[1]. info

[1] చూడండి, 40:18.

التفاسير:

external-link copy
38 : 24

لِیَجْزِیَهُمُ اللّٰهُ اَحْسَنَ مَا عَمِلُوْا وَیَزِیْدَهُمْ مِّنْ فَضْلِهٖ ؕ— وَاللّٰهُ یَرْزُقُ مَنْ یَّشَآءُ بِغَیْرِ حِسَابٍ ۟

వారు ఇలా చేయటం, అల్లాహ్ వారికి వారి మంచిపనుల కొరకు ప్రతిఫలమివ్వటానికి; మరియు తన అనుగ్రహాలను వారిపై అధికం చేయటానికి. మరియు అల్లాహ్ తాను కోరిన వారికి లెక్కలేనంత జీవనోపాధిని ప్రసాదిస్తాడు. info
التفاسير:

external-link copy
39 : 24

وَالَّذِیْنَ كَفَرُوْۤا اَعْمَالُهُمْ كَسَرَابٍۭ بِقِیْعَةٍ یَّحْسَبُهُ الظَّمْاٰنُ مَآءً ؕ— حَتّٰۤی اِذَا جَآءَهٗ لَمْ یَجِدْهُ شَیْـًٔا وَّوَجَدَ اللّٰهَ عِنْدَهٗ فَوَفّٰىهُ حِسَابَهٗ ؕ— وَاللّٰهُ سَرِیْعُ الْحِسَابِ ۟ۙ

ఇక సత్యాన్ని తిరస్కరించిన వారి కర్మలను ఎడారిలోని ఎండమావితో పోల్చ వచ్చు. దప్పిక గొన్నవాడు - దానిని నీరుగా భావించి దాని వద్దకు చేరి, చివరికి ఏమీ పొందలేక - అక్కడ అల్లాహ్ ను పొందుతాడు. అప్పుడు ఆయన అతని లెక్కను పూర్తిగా తీర్చుతాడు. మరియు అల్లాహ్ లెక్క తీర్చటంలో అతి శీఘ్రుడు[1]. info

[1] అంటే సత్యతిరస్కారుడు ఎన్ని మంచిపనులు, సత్కార్యాలు చేసినా అవి పరలోకంలో ఎండమావులుగా అదృశ్యమైపోతాయి. అంటే అతనికి వాటి నుండి ఎట్టి పుణ్యఫలితం లభించదు. అతడు నరకంతో చేరిపోతాడు.

التفاسير:

external-link copy
40 : 24

اَوْ كَظُلُمٰتٍ فِیْ بَحْرٍ لُّجِّیٍّ یَّغْشٰىهُ مَوْجٌ مِّنْ فَوْقِهٖ مَوْجٌ مِّنْ فَوْقِهٖ سَحَابٌ ؕ— ظُلُمٰتٌ بَعْضُهَا فَوْقَ بَعْضٍ ؕ— اِذَاۤ اَخْرَجَ یَدَهٗ لَمْ یَكَدْ یَرٰىهَا ؕ— وَمَنْ لَّمْ یَجْعَلِ اللّٰهُ لَهٗ نُوْرًا فَمَا لَهٗ مِنْ نُّوْرٍ ۟۠

లేక (సత్యతిరస్కారుల పరిస్థితి) చాలా లోతుగల సముద్రంలోని చీకట్లవలే ఉంటుంది. దానిపై ఒక గొప్ప అల క్రమ్ముకొని ఉంటుంది. దానిపై మరొక గొప్ప అల, దానిపై మేఘాలు. చీకట్లు ఒకదానిపై నొకటి క్రమ్ముకొని ఉంటాయి. అపుడు ఎవడైనా తన చేతిని (చూడాలని) చాచితే, వాడు దానిని చూడలేడు. మరియు ఎవనికైతే అల్లాహ్ వెలుగునివ్వడో, అతనికి ఏ మాత్రం వెలుగు దొరకదు[1]. info

[1] సత్యరిరస్కారులను సముద్రపులోతులో చీకట్లలో ఉన్నవాటితో పోల్చబడింది. అంటే సత్యతిరస్కారుడు అంధకారంలో మునిగి ఉన్నాడు. అవి వానిని విశ్వాసపు వెలుగులోనికి రానివ్వవను. పరలోకంలో కూడా వాడు నరకపు అంధకారంలో ఉంటాడు.
వెలుగు సముద్రపు లోతుతోకి చేరలేదు. ఎందుకంటే వెలుగులో ఇమిడి ఉన్న ఏడు రంగులు ఒకదాని తరువాత ఒకటి, సముద్రపు తలాలలోనికి వెలుగు పోయేటప్పుడు పీల్చుకోబడతాయి. కాబట్టి సముద్రపు లోపటి భాగంలో చీకటి ఉంటుందని సైంటిస్టులు ఇప్పుడిప్పుడే తెలుసుకున్నారు. కాని ఇది దివ్యఖుర్ఆన్ లో 1400 వందల సంవత్సరాల ముందే వ్రాయబడింది.

التفاسير:

external-link copy
41 : 24

اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ یُسَبِّحُ لَهٗ مَنْ فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ وَالطَّیْرُ صٰٓفّٰتٍ ؕ— كُلٌّ قَدْ عَلِمَ صَلَاتَهٗ وَتَسْبِیْحَهٗ ؕ— وَاللّٰهُ عَلِیْمٌۢ بِمَا یَفْعَلُوْنَ ۟

ఏమీ? నీకు తెలియదా (చూడటం లేదా) ? నిశ్చయంగా, భూమ్యాకాశాలలో ఉన్న సర్వమూ మరియు రెక్కలు విప్పి ఎగిరే పక్షులు సైతం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయని? వాస్తవానికి ప్రతిదానికి తన నమాజ్ మరియు స్తోత్రం చేసే పద్ధతి తెలుసు[1]. మరియు అవి చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు[2]. info

[1] అంటే ప్రతి దానికి అల్లాహ్ (సు.తా.) యొక్క స్తోత్రం (ప్రార్థన) ఏ విధంగా చేయాలో తెలుసు. భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు అల్లాహ్ (సు.తా.) స్తోత్రం చేయడమనేది కూడా అల్లాహ్ (సు.తా.) ఘనతలలో ఒకటి. ఏ విధంగానైతే వాటిని సృష్టించడం కూడా కేవలం ఆయన (సు.తా.) ఘనతలలో ఒకటో! చూడండి, 17:44.
[2] విచక్షణాశక్తి లేని ప్రతివస్తువు కూడా అల్లాహ్ (సు.తా.) స్తోత్రం చేస్తుంది. అలాంటప్పుడు ఈ విచక్షణాశక్తి గల జిన్నాతులు మరియు మానవులు కూడా అల్లాహ్ (సు.తా.) స్తోత్రం చేయకుంటే వారు ఆయన శిక్షకు అర్హులు కాగూడదా ?

التفاسير:

external-link copy
42 : 24

وَلِلّٰهِ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ۚ— وَاِلَی اللّٰهِ الْمَصِیْرُ ۟

మరియు భూమ్యాకాశాల మీద సర్వాధిపత్యం అల్లాహ్ దే! మరియు అల్లాహ్ వైపునకే (అందరికీ) మరలి పోవలసి ఉంది. info
التفاسير:

external-link copy
43 : 24

اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ یُزْجِیْ سَحَابًا ثُمَّ یُؤَلِّفُ بَیْنَهٗ ثُمَّ یَجْعَلُهٗ رُكَامًا فَتَرَی الْوَدْقَ یَخْرُجُ مِنْ خِلٰلِهٖ ۚ— وَیُنَزِّلُ مِنَ السَّمَآءِ مِنْ جِبَالٍ فِیْهَا مِنْ بَرَدٍ فَیُصِیْبُ بِهٖ مَنْ یَّشَآءُ وَیَصْرِفُهٗ عَنْ مَّنْ یَّشَآءُ ؕ— یَكَادُ سَنَا بَرْقِهٖ یَذْهَبُ بِالْاَبْصَارِ ۟ؕ

ఏమీ? నీకు తెలియదా (చూడటం లేదా) ? నిశ్చయంగా, అల్లాహ్ యే మేఘాలను మెల్లమెల్లగా నడుపుతూ, వాటిని ఒక దానితో ఒకటి కలుపుతాడని, ఆ తరువాత వాటిని ప్రోగు చేస్తాడని! ఆ పిదప వాటి నుండి వర్షాన్ని కురిపించేది నీవు చూస్తున్నావు కదా! మరియు ఆయనే ఆకాశంలో ఉన్న కొండల వంటి (మేఘాల) నుండి వడగండ్ల చల్లని (వర్షాన్ని) తాను కోరిన వారిపై కురిపిస్తాడు. మరియు తాను కోరిన వారిని వాటి నుండి తప్పిస్తాడు. వాటి పిడుగు యొక్క మెరుపు కంటి చూపులను దాదాపు హరించేలా ఉంటుంది. info
التفاسير: