[1] అంటే స్ర్తీ పురుషుల మిశ్రమంతో! అంటే పురుషుని రేతస్సు, లేక వీర్యబిందువు, లేక శుక్లం (Sperm), స్త్రీ బీజకణం (Ovum) చూడండి, 86:6-7.
[2] అంటే పరీక్షించటం, చూడండి, 67:2.
[1] ప్రతి మానవుడు తన ఆత్మను వ్యాపారంలో పెడ్తాడు. దానిని నష్టంలో పడవేస్తాడు. లేక లాభంలో ('స. ముస్లిం). నష్టం అంటే నరకం, లాభం అంటే స్వర్గం. ఇంకా చూడండి, 90:10.
[1] ఇది అల్లాహ్ (సు.తా.) ప్రసాదించిన స్వేచ్ఛను చెడు మార్గంలో వినియోగించటం వల్ల లభించే ప్రతిఫలం. ఇంకా చూడండి, 73:12-13.
[1] మొక్కుబడులు కేవలం అల్లాహ్ (సు.తా.) కే చేస్తారు. మరియు వాటిని పూర్తి చేస్తారు. "అల్లాహ్ (సు.తా.) పేరుతో మొక్కుబడి చేసుకుంటే దానిని పూర్తి చేసుకోవాలి." ('స. బు'ఖారీ) చూడండి, 15:23.
[1] దైవప్రవక్త ('స'అస) ఆదేశానుసారం 'స'హాబీలు (ర'ది.'అన్హుమ్) బద్ర్ యుద్ధ ఖైదీలకు మొదట అన్నం పెట్టి , తరువాత తాము తినేవారు, (ఇబ్నె-కసీ'ర్) మన ఆధీనంలో ఉన్న సేవకులతో కూడా మంచిగా వ్యవహరించాలి. దైవప్రవక్త ('స'అస) చివరి ఉపదేశం: "నమా'జ్ ను మరియు మీ సేవకులను ఆదరించండి." (ఇబ్నె-మాజా). ఇంకా చూడండి, 2:177 మరియు 90:14-16.
[1] 'సబరున్: సహనం, అంటే ధర్మమార్గంలో వచ్చే కష్టాలను భరించటం. అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞాపాలన కొరకు తమ సుఖసంతోషాలను మరియు అపేక్షలను త్యాగం చేయటం. అల్లాహ్ (సు.తా.) అవిధేయత నుండి దూరంగా ఉండటం.
[2] చూడండి, 18:31.
[1] వారు ఎల్లప్పుడూ బాలురుగానే ఉంటారు. వారు వృద్ధులు కారు. వారికి మరణం రాదు. ఇంకా చూడండి, 56:17-18 మరియు 52:24.
[1] మక్కా సత్యతిరస్కారులు దైవప్రవక్త ('స'అస)ను : అతని ధర్మప్రచారాన్ని అపమనే వారు. మరియు తమ దేవతలను ఆరాధించమనేవారు. దానికి బదులుగా వారు అతనికి కోరినంత ధనం, అధికారం ఇస్తాం అనేవారు. మరియు అతనికి ఇష్టమైన స్త్రీతో వివాహం చేయిస్తాం అనేవారు. (ఫ'త్హ్ అల్-ఖదీర్).