[1] అల్-కాఫిరీన్ : అంటే సత్యతిరస్కారులు. ఈ పదం ఇక్కడ ఖుర్ఆన్ అవతరణా క్రమంలో మొదటి సారి వచ్చింది. 57:20లో మాత్రం ఈ పదానికి భూమిని దున్నేవాడు అనే అర్థం ఉంది. మిగతా అన్నీ చోట్లలో ఈ పదం సత్యతిరస్కారులనే అర్థంలోనే వాడబడింది.
[1] చూడండి, 6:94, 19:80, 95. కొందరు వ్యాఖ్యాతలు ఈ ఆయత్ వలీద్ బిన్ ము'గైరాను ఉద్దేశిస్తోంది అని అభిప్రాయపడ్డారు. అతడు సత్యతిరస్కారం మరియు దురహంకారంలో మితిమీరి పోయాడు. ఈ ఆయత్ ఇటువంటి ప్రతి సత్యతిరస్కారిని సూచిస్తుంది.
[1] సఖరున్: నరకానికి ఏడు అంతస్తులు లేక శ్రేణులున్నాయి. 1) జహన్నుమ్ (నరకం), 2) ల"జ్జా (ధ్వంసం చేసే అగ్ని), 3) 'హు'త్మ (అణగ/చితకగొట్టే శిక్ష), 4) స'యీర్ (ప్రజ్వలించే అగ్ని), 5) సఖర్ (నరకాగ్ని), 6) జ'హీమ్ (మండే అగ్ని), 7) హావియహ్, ఇది అన్నింటి కంటే క్రింది అంతస్తు, ఇందులో మునాఫిఖులు (కపటవిశ్వాసులు) ఉంటారు. ఏడు ద్వారాలు అంటే ఏడు విధాలైన పాపుల దారులు. చూడండి, 15:44.
[1] చూడండి, 2:26.
[1] విప్పబడిన గ్రంథాలు అంటే : ము'హమ్మద్ ('స'అస), అల్లాహ్ (సు.తా.) యొక్క ప్రవక్త అని వ్రాయబడిన గ్రంథం ప్రతి ఒక్కరికి ఇవ్వబడాలని లేక దైవగ్రంథం ప్రతి ఒక్కరికి ఇవ్వబడాలని. చూడండి, 2:118. వారు ఇలా పలకడం వారి దురహంకారాన్ని సూచిస్తుంది.