[1] ఏ విధంగానైతే ఈనాడు కూడా బిద్'ఆత్ చేసేవారు దైవప్రవక్త ('స'అస)ను మానవునిగా భావించటం లేదో!
[1] ఖుర్ఆన్ లో మూడుసార్లు అల్లాహ్ (సు.తా.) తన సందేశహరునికి ('స'అస) ఆదేశించాడు: "నీ ప్రభువు సాక్షిగా చెప్పు: 'అల్లాహ్ (సు.తా.) పునరుత్థానం తప్పక తెస్తాడని.' వాటిలో ఇది ఒకటి." చూడండి, 10:53, 34:3 అది మీరు ప్రపంచంలో చేసిన కర్మలకు తగిన ప్రతిఫళ మివ్వటానికి. ఎందుకంటే చాలా మందికి ఈ లోకంలో వారికి తగిన ప్రతిఫలం దొరకదు. దుర్మార్గులు ఇక్కడ శిక్షింపబడకుండా పోవచ్చు. సన్మార్గులకు వారి మంచిపనులకు పూర్తి ప్రతిఫలం దొరకక పోవచ్చు! కాని వచ్చే జీవితంలో ప్రతి ఒక్కరికి వారి కర్మలకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వారికి ఎలాంటి అన్యాయం జరుగదు. పునరుత్థరింపజేయటం అల్లాహ్ (సు.తా.)కు ఎంతో సులభమైనది.
[1] చూడండి, 11:103 మరియు 56:49-50 పునరుత్థాన దినం, సమావేశదినం ఎందుకు అనబడిందంటే - ఆ రోజు యుగయుగాల ప్రజలందరు ఒకేసారి బ్రతికించి లేపబడతారు. మరియు ఒకేచోట సమావేశపరచబడతారు. అది ఒక పెద్ద మైదానం. ప్రతి ఒక్కడు ఎంతో దూరం వరకు చూడగల్గుతాడు.
[1] ఇట్టి వాక్యానికై చూడండి, 59:9.