[1] అల్లాహ్ (సు.తా.) కు ప్రియులైన వారి నాలుగు లక్షణాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి. 1)వారు అల్లాహ్ కు ప్రియులై, అల్లాహ్ (సు.తా.)ను ప్రేమించే వారూ, 2) విశ్వాసుల పట్ల మృదువుగానూ మరియు అవిశ్వాసుల పట్ల కఠినంగానూ ఉండేవారూ, 3) అల్లాహ్ (సు.తా.) మార్గంలో ధర్మపోరాటం (జిహాద్) చేసేవారూ మరియు 4) నిందించేవారి నిందలకు భయపడని వారునూ, అయి ఉంటారు.