แปล​ความหมาย​อัลกุรอาน​ - คำแปลภาษาเตลูกู - อับดุรเราะหีม บิน มุฮัมมัด

หมายเลข​หน้า​:close

external-link copy
84 : 5

وَمَا لَنَا لَا نُؤْمِنُ بِاللّٰهِ وَمَا جَآءَنَا مِنَ الْحَقِّ ۙ— وَنَطْمَعُ اَنْ یُّدْخِلَنَا رَبُّنَا مَعَ الْقَوْمِ الصّٰلِحِیْنَ ۟

"మరియు మేము అల్లాహ్ మరియు మా వద్దకు వచ్చిన సత్యాన్ని విశ్వసించకుండా ఉండటానికి మాకేమైంది? మా ప్రభువు మమ్మల్ని సద్వర్తనులతో చేర్చాలని మేము కోరుకుంటున్నాము." info
التفاسير:

external-link copy
85 : 5

فَاَثَابَهُمُ اللّٰهُ بِمَا قَالُوْا جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَا ؕ— وَذٰلِكَ جَزَآءُ الْمُحْسِنِیْنَ ۟

కావున వారు పలికిన దానికి ఫలితంగా, అల్లాహ్ వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను ప్రసాదించాడు. వారందులో శాశ్వతంగా ఉంటారు. మరియు సజ్జనులకు లభించే ప్రతిఫలం ఇదే! info
التفاسير:

external-link copy
86 : 5

وَالَّذِیْنَ كَفَرُوْا وَكَذَّبُوْا بِاٰیٰتِنَاۤ اُولٰٓىِٕكَ اَصْحٰبُ الْجَحِیْمِ ۟۠

మరియు ఎవరైతే సత్యతిరస్కారులై మా సూచనలను (ఆయాత్ లను) అబద్ధాలన్నారో, అలాంటి వారు భగభగమండే నరకాగ్ని వాసులవుతారు. info
التفاسير:

external-link copy
87 : 5

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تُحَرِّمُوْا طَیِّبٰتِ مَاۤ اَحَلَّ اللّٰهُ لَكُمْ وَلَا تَعْتَدُوْا ؕ— اِنَّ اللّٰهَ لَا یُحِبُّ الْمُعْتَدِیْنَ ۟

ఓ విశ్వాసులారా! అల్లాహ్ మీకు ధర్మసమ్మతం చేసిన పరిశుద్ధ వస్తువులను నిషిద్ధం చేసుకోకండి మరియు హద్దులు మీరకండి. నిశ్ఛయంగా, అల్లాహ్ హద్దులు మీరి పోయే వారిని ప్రేమించడు.[1] info

[1] ఒక 'స'హాబీ దైవప్రవక్త ('స'అస) దగ్గరికి హాజరై అన్నాడు: "ఓ దైవప్రవక్తా! నేను మాంసం తినటం వలన నా కామవాంఛలు పెరుగుతున్నాయి. కావున నేను మాంసాహారాన్ని నాపై నిషేధించుకున్నాను." అట్టి సందర్భంలో ఈ ఆయత్ అవతరింపజేయబడింది. (తిర్మిజీ').

التفاسير:

external-link copy
88 : 5

وَكُلُوْا مِمَّا رَزَقَكُمُ اللّٰهُ حَلٰلًا طَیِّبًا ۪— وَّاتَّقُوا اللّٰهَ الَّذِیْۤ اَنْتُمْ بِهٖ مُؤْمِنُوْنَ ۟

మరియు అల్లాహ్ మీకు జీవనోపాధిగా ప్రసాదించిన వాటిలో ధర్మసమ్మతమైన, పరిశుద్ధమైన పదార్థాలను తినండి. మీరు విశ్వసించిన అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. info
التفاسير:

external-link copy
89 : 5

لَا یُؤَاخِذُكُمُ اللّٰهُ بِاللَّغْوِ فِیْۤ اَیْمَانِكُمْ وَلٰكِنْ یُّؤَاخِذُكُمْ بِمَا عَقَّدْتُّمُ الْاَیْمَانَ ۚ— فَكَفَّارَتُهٗۤ اِطْعَامُ عَشَرَةِ مَسٰكِیْنَ مِنْ اَوْسَطِ مَا تُطْعِمُوْنَ اَهْلِیْكُمْ اَوْ كِسْوَتُهُمْ اَوْ تَحْرِیْرُ رَقَبَةٍ ؕ— فَمَنْ لَّمْ یَجِدْ فَصِیَامُ ثَلٰثَةِ اَیَّامٍ ؕ— ذٰلِكَ كَفَّارَةُ اَیْمَانِكُمْ اِذَا حَلَفْتُمْ ؕ— وَاحْفَظُوْۤا اَیْمَانَكُمْ ؕ— كَذٰلِكَ یُبَیِّنُ اللّٰهُ لَكُمْ اٰیٰتِهٖ لَعَلَّكُمْ تَشْكُرُوْنَ ۟

మీరు ఉద్దేశం లేకుండానే చేసిన ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని పట్టుకోడు. కాని మీరు బుద్ధిపూర్వకంగా చేసే ప్రమాణాలను గురించి ఆయన మిమ్మల్ని (తప్పకుండా) పట్టుకుంటాడు. కావున దానికి (ఇలాంటి ప్రమాణ భంగానికి) పరిహారంగా మీరు మీ ఇంటి వారికి పెట్టే, మధ్యరకమైన ఆహారం పది మంది పేదలకు పెట్టాలి. లేదా వారికి వస్త్రాలు ఇవ్వాలి. లేదా ఒక బానిసకు స్వాతంత్ర్యం ఇప్పించాలి. ఎవడికి ఈ శక్తి లేదో! అతడు మూడు దినాలు ఉపవాసం ఉండాలి. మీరు ప్రమాణం చేసి భంగపరిస్తే, ఇది దానికి పరిహారం (కఫ్ఫారా)[1]. మీ ప్రమాణాలను కాపాడుకోండి. మీరు కృతజ్ఞులై ఉండటానికి అల్లాహ్ తన ఆజ్ఞలను ఈ విధంగా మీకు విశదపరుస్తున్నాడు.[2] info

[1] ప్రమాణం: ఇది 'అరబ్బీలో 'హలఫ్ లేక అయ్ మాన్ అనబడుతుంది. ఇవి మూడు రకాలు: 1)ల'గ్వున్: ఇది మానవుడు మాటి మాటికి ఆలోచించకుండా చేసే ప్రమాణం. దీనికెట్టి పరిహారం (కఫ్ఫారా) లేదు. 2) 'గమూసున్: మానవుడు ఇతరులను మోసపుచ్చటానికి చేసే బూటక ప్రమాణం. ఇది మహాపాపం. దీనికెట్టి పరిహారం (కఫ్ఫారా) ఉపయోగకరం కాదు. 3) ము'అఖ్ఖదతున్: మానవుడు సహృదయంతో పూర్తి విశ్వాసంతో చేసే ప్రమాణం. దీనిని భంగపరిస్తే పరిహారం (కఫ్పారా) ఇవ్వాలి. అది ఈ ఆయత్ లో పేర్కొనబడింది. [2] చూడండి, 2:224-225; 38:44.

التفاسير:

external-link copy
90 : 5

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِنَّمَا الْخَمْرُ وَالْمَیْسِرُ وَالْاَنْصَابُ وَالْاَزْلَامُ رِجْسٌ مِّنْ عَمَلِ الشَّیْطٰنِ فَاجْتَنِبُوْهُ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ ۟

ఓ విశ్వాసులారా! నిశ్చయంగా మధ్యపానం,[1] జూదం, బలిపీఠం మీద బలి ఇవ్వటం (అన్సాబ్)[2] మరియు శకునానికై బాణాల ప్రయోగం (అజ్లామ్) ఇవన్నీ కేవలం అసహ్యకరమైన షైతాన్ చేష్టలు, కావున మీరు సాఫల్యం పొందాలంటే వీటిని త్యజించండి. info

[1] మద్యపానం (సారాయి మొదలైన మత్తు పదార్థాలను తినటం, త్రాగటం, పీల్చుకోవటం) గురించి ఇది మూడవ ఆజ్ఞ. ఇక్కడ వీటిని గురించి నిషేధం వచ్చింది. ఇంతకు ముందు 2:219, 4:43లలో వీటిని గురించి ఆజ్ఞలు వచ్చాయి. [2] చూడండి, 5:3 వ్యాఖ్యానం 1.

التفاسير: