[1] మానవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారితో బాటు ఉంటాడు. ('స. బు'ఖారీ, కితాబుల్ ఆదాబ్, బాబ్ 97, ముస్లిం 'హదీస్' నెం. 1640). మరొక 'హదీస్'లో ఇలా ఉంది : "అత్యధికంగా నఫిల్ నమా'జ్ లు చేయటం వల్ల స్వర్గంలో దైవప్రవక్త ('స'అస) సాంగత్యం లభిస్తుంది." ('స. ముస్లిం కితాబ్ అ'స్సలాహ్, బాబ్ ఫ'ద్ల్ అస్సుజూద్, 'హదీస్' నం. 488).
[1] 'హిజ్ రకుమ్: అంటే మీ రక్షణ కొరకు మీ ఆయుధాలతో యుద్ధానికి సన్నద్ధులై ఉండండి.
[1] అంటే యుద్ధంలో మీకు విజయం మరియు విజయధనం లభిస్తే!