แปล​ความหมาย​อัลกุรอาน​ - คำแปลภาษาเตลูกู - อับดุรเราะหีม บิน มุฮัมมัด

หมายเลข​หน้า​:close

external-link copy
90 : 23

بَلْ اَتَیْنٰهُمْ بِالْحَقِّ وَاِنَّهُمْ لَكٰذِبُوْنَ ۟

అలా కాదు! మేము వారికి సత్యాన్ని అందజేశాము. మరియు నిశ్చయంగా, వారే అసత్యవాదులు! info
التفاسير:

external-link copy
91 : 23

مَا اتَّخَذَ اللّٰهُ مِنْ وَّلَدٍ وَّمَا كَانَ مَعَهٗ مِنْ اِلٰهٍ اِذًا لَّذَهَبَ كُلُّ اِلٰهٍ بِمَا خَلَقَ وَلَعَلَا بَعْضُهُمْ عَلٰی بَعْضٍ ؕ— سُبْحٰنَ اللّٰهِ عَمَّا یَصِفُوْنَ ۟ۙ

అల్లాహ్ ఎవ్వరినీ కూడా తనకు సంతానంగా చేసుకోలేదు మరియు ఆయనతో పాటు మరొక ఆరాధ్య దేవుడు లేడు. అలా అయితే ప్రతి దేవుడు తన సృష్టితో వేరై పోయేవాడు మరియు వారు ఒకరిపై నొకరు ప్రాబల్యం పొందగోరేవారు. అల్లాహ్! వారు కల్పించే వాటికి అతీతుడు.[1] info

[1] చూడండి, 6:100

التفاسير:

external-link copy
92 : 23

عٰلِمِ الْغَیْبِ وَالشَّهَادَةِ فَتَعٰلٰی عَمَّا یُشْرِكُوْنَ ۟۠

ఆయన అగోచర మరియు గోచర విషయాల జ్ఞానం గలవాడు. వారు సాటి కల్పించే భాగస్వాముల కంటే, ఆయన అత్యున్నతుడు. info
التفاسير:

external-link copy
93 : 23

قُلْ رَّبِّ اِمَّا تُرِیَنِّیْ مَا یُوْعَدُوْنَ ۟ۙ

(ఓ ముహమ్మద్!) ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! ఏ (శిక్ష అయితే) వారికి (అవిశ్వాసులకు) వాగ్దానం చేయబడి ఉన్నదో దానిని నీవు నాకు చూపనున్నచో! info
التفاسير:

external-link copy
94 : 23

رَبِّ فَلَا تَجْعَلْنِیْ فِی الْقَوْمِ الظّٰلِمِیْنَ ۟

ఓ నా ప్రభూ! నన్ను ఈ దుర్మార్గ ప్రజలలో చేర్చకు."[1] info

[1] దైవప్రవక్త ('స'అస) ఇలా ప్రార్థించారు: 'ఓ అల్లాహ్ (సు.తా.)! ఒకవేళ నీవు ఈ సమాజాన్ని పరీక్షించగోరితే లేక శిక్షించగోరితే! అంతకు ముందే నన్ను ఈ ప్రపంచం నుండి లేపుకో!' (తిర్మిజీ', అ'హ్మద్).

التفاسير:

external-link copy
95 : 23

وَاِنَّا عَلٰۤی اَنْ نُّرِیَكَ مَا نَعِدُهُمْ لَقٰدِرُوْنَ ۟

మరియు నిశ్చయంగా, మేము వారికి (అవిశ్వాసులకు) వాగ్దానము చేసింది (శిక్ష) నీకు చూపగల సమర్ధులము. info
التفاسير:

external-link copy
96 : 23

اِدْفَعْ بِالَّتِیْ هِیَ اَحْسَنُ السَّیِّئَةَ ؕ— نَحْنُ اَعْلَمُ بِمَا یَصِفُوْنَ ۟

చెడును, మంచితనముతో నివారించు.[1] వారు ఆపాదించే విషయాలు మాకు బాగా తెలుసు. info

[1] చూడండి, 13:22 చివరి వాక్యం మరియు 41:34-35.

التفاسير:

external-link copy
97 : 23

وَقُلْ رَّبِّ اَعُوْذُ بِكَ مِنْ هَمَزٰتِ الشَّیٰطِیْنِ ۟ۙ

మరియు ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! షైతానులు రేకెత్తించే కలతల నుండి (రక్షణ పొందటానికి) నేను నీ శరణు వేడుకుంటున్నాను. info
التفاسير:

external-link copy
98 : 23

وَاَعُوْذُ بِكَ رَبِّ اَنْ یَّحْضُرُوْنِ ۟

మరియు ఓ నా ప్రభూ! అవి నా వద్దకు రాకుండా ఉండాలని, నేను నీ శరణు వేడుకుంటున్నాను."[1] info

[1] కావున ప్రతి కార్యానికి ముందు: 'బిస్మిల్లా హిర్ర'హ్మా నిర్ర'హీమ్' చదవండి అని దైవప్రవక్త ('స'అస) అన్నారు. దీనిని గురించి 'హదీస్'లలో, దు'ఆలు కూడా పేర్కొనబడ్డాయి. (ముస్నద్ అ'హ్మద్ 2/181, అబూ-దావూద్, తిర్మిజీ').

التفاسير:

external-link copy
99 : 23

حَتّٰۤی اِذَا جَآءَ اَحَدَهُمُ الْمَوْتُ قَالَ رَبِّ ارْجِعُوْنِ ۟ۙ

చివరికి వారిలో ఒకడికి మరణం సమీపించినప్పుడు వాడిలా వేడుకుంటాడు: "ఓ నా ప్రభూ! నన్ను తిరిగి (భూలోకానికి) పంపు: info
التفاسير:

external-link copy
100 : 23

لَعَلِّیْۤ اَعْمَلُ صَالِحًا فِیْمَا تَرَكْتُ كَلَّا ؕ— اِنَّهَا كَلِمَةٌ هُوَ قَآىِٕلُهَا ؕ— وَمِنْ وَّرَآىِٕهِمْ بَرْزَخٌ اِلٰی یَوْمِ یُبْعَثُوْنَ ۟

నేను చేయకుండా వచ్చిన సత్కార్యాలు చేయటానికి."[1] అది కాని పని. నిశ్చయంగా అది అతని నోటిమాట మాత్రమే![2] ఇక (ఈ మరణించిన) వారు తిరిగి లేపబడే దినం వరకు వారి ముందు ఒక అడ్డుతెర (బర్ జఖ్) ఉంటుంది.[3] info

[1] ఈ దు'ఆ ప్రతి సత్యతిరస్కారి: 1) మరణం ఆసన్నమైనప్పుడు, 2) పునరుత్థానదినమున, అల్లాహ్ (సు.తా.) సమక్షంలో హాజరు చేయబడినప్పుడు మరియు 3) నరకంలోకి త్రోయబడి నప్పుడు చేస్తాడు. కాని సఫలుడు కాడు. ఈ వాక్యం ఖుర్ఆన్ లో అనేక సార్లు వచ్చింది. చూడండి, 63:10-11, 14:44, 7:53, 32:12, 6:27-28, 40:11-12, 35:37 మొదలైనవి. [2] అది కాని పని, చూడండి, 6:28 [3] ఇహలోక మరియు పరలోక జీవితపు మధ్య కాలాన్ని బర్'జ'ఖ్ అంటారు.

التفاسير:

external-link copy
101 : 23

فَاِذَا نُفِخَ فِی الصُّوْرِ فَلَاۤ اَنْسَابَ بَیْنَهُمْ یَوْمَىِٕذٍ وَّلَا یَتَسَآءَلُوْنَ ۟

ఆ తరువాత బాగా ఊదబడిన దినమున వారి మధ్య ఎలాంటి సంబంధాలు ఉండవు. మరియు వారు ఒకరి నొకరు పలుకరించుకోరు కూడా! info
التفاسير:

external-link copy
102 : 23

فَمَنْ ثَقُلَتْ مَوَازِیْنُهٗ فَاُولٰٓىِٕكَ هُمُ الْمُفْلِحُوْنَ ۟

ఇక ఎవరి (సత్కార్యాల) పళ్ళాలు బరువుగా ఉంటాయో, ఆలాంటి వారే సాఫల్యం పొందేవారు. info
التفاسير:

external-link copy
103 : 23

وَمَنْ خَفَّتْ مَوَازِیْنُهٗ فَاُولٰٓىِٕكَ الَّذِیْنَ خَسِرُوْۤا اَنْفُسَهُمْ فِیْ جَهَنَّمَ خٰلِدُوْنَ ۟ۚ

మరియు ఎవరి పళ్ళాలు తేలికగా ఉంటాయో, అలాంటి వారే తమను తాము నష్టానికి గురి చేసుకున్న వారు, వారే నరకంలో శాశ్వతంగా ఉండేవారు. info
التفاسير:

external-link copy
104 : 23

تَلْفَحُ وُجُوْهَهُمُ النَّارُ وَهُمْ فِیْهَا كٰلِحُوْنَ ۟

అగ్ని వారి ముఖాలను కాల్చి వేస్తుంది.[1] వారి పెదవులు బిగించుకు పోయి, పళ్ళు బయట పడతాయి. info

[1] ముఖం ఎందుకు పేర్కొనబడిందంటే మానవ ఉనికికి అన్నింటికంటే ముఖ్యమైన అంశం ముఖమే! నరకాగ్ని మాత్రం శరీరన్నంతా కాల్చుతుంది.

التفاسير: