แปล​ความหมาย​อัลกุรอาน​ - คำแปลภาษาติลกู สำหรับหนังสืออรรถาธิบายอัลกุรอานอย่างสรุป (อัลมุคตะศ็อร ฟีตัฟซีร อัลกุรอานิลกะรีม)

หมายเลข​หน้า​: 169:151 close

external-link copy
156 : 7

وَاكْتُبْ لَنَا فِیْ هٰذِهِ الدُّنْیَا حَسَنَةً وَّفِی الْاٰخِرَةِ اِنَّا هُدْنَاۤ اِلَیْكَ ؕ— قَالَ عَذَابِیْۤ اُصِیْبُ بِهٖ مَنْ اَشَآءُ ۚ— وَرَحْمَتِیْ وَسِعَتْ كُلَّ شَیْءٍ ؕ— فَسَاَكْتُبُهَا لِلَّذِیْنَ یَتَّقُوْنَ وَیُؤْتُوْنَ الزَّكٰوةَ وَالَّذِیْنَ هُمْ بِاٰیٰتِنَا یُؤْمِنُوْنَ ۟ۚ

మరియు నీవు ఎవరినైతే ఇహలోకంలో అనుగ్రహాల ద్వారా,మన్నింపుల ద్వారా గౌరవాన్ని ప్రసాదించావో,సత్కార్యములు చేయటానికి సౌభాగ్యమును ప్రసాదించావో,ఎవరి కొరకైతే నీవు నీ దాసుల్లోంచి పుణ్యాత్ముల కొరకు పరలోకంలో స్వర్గాన్ని తయారు చేశావో మమ్మల్ని వారిలోంచి చేయి. నిశ్చయంగా మేము మా తప్పిదమును (లోపమును) అంగీకరించి నీ వైపునకు తౌబా చేస్తున్నాము,మరలుతున్నాము. అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు : దౌర్భాగ్య కారకాల ద్వారా ఆచరించే వారిలోంచి నేను కోరుకున్న వారికి నా శిక్షను కలిగింప చేస్తాను. నా యొక్క కారుణ్యం ఇహలోకంలో ప్రతి వస్తువును ఆవరించి ఉన్నది. అల్లాహ్ కారుణ్యం చేరకుండా ఏ సృష్టిరాసి లేదు. దాన్ని (సృష్టిరాసిని) ఆయన అనుగ్రహం,ఆయన ఉపకారం కప్పి ఉన్నది. అయితే అల్లాహ్ కు భయపడి ఆయన ఆదేశాలను పాటించేవారు,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండే వారి కొరకు,ఎవరైతే తమ సంపద నుండి జకాత్ తీసి దాని హక్కు దారులకు ఇస్తారో వారి కొరకు,ఎవరైతే నా ఆయతులపై విశ్వాసమును కనబరుస్తారో వారి కొరకు తొందరలోనే నేను పరలోకంలో నా కారుణ్యమును వ్రాస్తాను. info
التفاسير:

external-link copy
157 : 7

اَلَّذِیْنَ یَتَّبِعُوْنَ الرَّسُوْلَ النَّبِیَّ الْاُمِّیَّ الَّذِیْ یَجِدُوْنَهٗ مَكْتُوْبًا عِنْدَهُمْ فِی التَّوْرٰىةِ وَالْاِنْجِیْلِ ؗ— یَاْمُرُهُمْ بِالْمَعْرُوْفِ وَیَنْهٰىهُمْ عَنِ الْمُنْكَرِ وَیُحِلُّ لَهُمُ الطَّیِّبٰتِ وَیُحَرِّمُ عَلَیْهِمُ الْخَبٰٓىِٕثَ وَیَضَعُ عَنْهُمْ اِصْرَهُمْ وَالْاَغْلٰلَ الَّتِیْ كَانَتْ عَلَیْهِمْ ؕ— فَالَّذِیْنَ اٰمَنُوْا بِهٖ وَعَزَّرُوْهُ وَنَصَرُوْهُ وَاتَّبَعُوا النُّوْرَ الَّذِیْۤ اُنْزِلَ مَعَهٗۤ ۙ— اُولٰٓىِٕكَ هُمُ الْمُفْلِحُوْنَ ۟۠

ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అనుసరిస్తున్నారో ఆయన వ్రాయలేని,చదవలేని నిరక్షరాసి. ఆయనపై ఆయన ప్రభువు దైవ వాణిని మాత్రమే అవతరింప చేస్తాడు. ఆయన నామమును,ఆయన గుణాలను,ఆయనపై అవతరింపబడిన దానిని వారు మూసాపై అవతరింపబడిన తౌరాతులో,ఈసాపై అవతరింపబడిన ఇంజీలులో లిఖిత పూర్వకంగా పొందుతారు,దేని మంచి గురించినైతే,మేలు గురించినైతే తెలుస్తుందో దాని గురించే వారికి ఆదేశిస్తాడు. మంచి మనసుల్లో,స్వఛ్ఛమైన స్వభావముల్లో చెడుగా గర్తింపు ఉన్న వాటి నుండి వారిని వారిస్తాడు. అభిరుచులను ఎటువంటి నష్టం లేని తినే వస్తువుల్లోంచి,త్రాగే వస్తువుల్లోంచి,స్త్రీల్లోంచి వారి కొరకు అనుమతినిస్తున్నాడు. వాటిలోంచి అశుధ్దమైన వాటిని వారిపై నిషేధిస్తున్నాడు. వారిపై మోయబడిన కష్టమైన బాధలను తొలగిస్తాడు హత్య చేసిన వాడిని హతమార్చడం అనివార్యమవటం లాంటి ఆ హత్య కావాలని చేసిన,అనుకోకుండా చేసిన. అయితే ఎవరైతే ఇస్రాయీలు సంతతి వారిలో నుండి,ఇతరుల్లో నుండి ఆయనను విశ్వసిస్తారో,ఆయనను గౌరవిస్తారో,ఆయన పెద్దరికాన్ని తెలుపుతారో ఆయన్ని వ్యతిరేకించే సత్యతిరస్కారులకు వ్యతిరేకంగా ఆయనకు సహాయం చేస్తారో,సన్మార్గమును చూపే వెలుగుగా ఆయనపై అవతరింపబడిన ఖుర్ఆన్ ను అనుసరిస్తారో వారందరు తాము ఆశించిన వాటిని పొందుతూ తాము భయపడే దాని నుండి పరిరక్షింపబడి సాఫల్యం చెందుతారు. info
التفاسير:

external-link copy
158 : 7

قُلْ یٰۤاَیُّهَا النَّاسُ اِنِّیْ رَسُوْلُ اللّٰهِ اِلَیْكُمْ جَمِیْعَا ١لَّذِیْ لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ۚ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ یُحْیٖ وَیُمِیْتُ ۪— فَاٰمِنُوْا بِاللّٰهِ وَرَسُوْلِهِ النَّبِیِّ الْاُمِّیِّ الَّذِیْ یُؤْمِنُ بِاللّٰهِ وَكَلِمٰتِهٖ وَاتَّبِعُوْهُ لَعَلَّكُمْ تَهْتَدُوْنَ ۟

ఓ ప్రవక్తా మీరు ఇలా తెలపండి : ఓ ప్రజలారా నిశ్చయంగా నేను మీ అందరి వైపు మీలో నుండి అరబ్బులకు,మీలో నుండి ఆరబేతరులకు అల్లాహ్ వద్ద నుండి ప్రవక్తగా వచ్చాను. ఆయన ఒక్కడి కొరకే ఆకాశముల సామ్రాజ్యాధికారము మరియు ఆయన కొరకే భూమి పై సామ్రాజ్యాధికారము. పరిశుద్దుడైన ఆయన తప్ప వేరే సత్య ఆరాధ్య దైవం లేడు. ఆయన మృతులను జీవింప జేస్తాడు. జీవించి ఉన్న వారికి మరణాన్ని ప్రసాదిస్తాడు. అయితే ఓ ప్రజలారా మీరు అల్లాహ్ ను విశ్వసించండి. మరియు వ్రాయలేని,చదవలేని ఆయన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మీరు విశ్వసించండి. ఆయన వైపునకు దైవ వాణి ద్వారా ఆయన ప్రభువు తెలిపిన వాటిని మాత్రమే ఆయన తీసుకుని వచ్చారు,ఆయనే అల్లాహ్ ను విశ్వసిస్తున్నారు,ఆయన పై అవతరింప బడిన దానిని,ఆయన కన్న మునుపు ప్రవక్తలపై అవతరింపబడిన వాటిని ఎటువంటి వ్యత్యాసం లేకుండా విశ్వసిస్తున్నారు. మరియు మీరు ఇహపర లోకాల్లో మీ శ్రేయస్సు ఉన్న దాని వైపు మీరు సన్మార్గం పొందుతారని ఆశిస్తు ఆయన తన ప్రభువు వద్ద నుండి తీసుకుని వచ్చిన దాని విషయంలో ఆయనని అనుసరించండి. info
التفاسير:

external-link copy
159 : 7

وَمِنْ قَوْمِ مُوْسٰۤی اُمَّةٌ یَّهْدُوْنَ بِالْحَقِّ وَبِهٖ یَعْدِلُوْنَ ۟

మరియు ఇస్రాయీలు సంతతి అయిన మూసా జాతిలో నుండి ఒక వర్గము సత్య ధర్మము పై నిలబడి ఉన్నది. వారు ప్రజలను దాని వైపునకు మార్గదర్శకత్వం వహించే వారు,న్యాయపరంగా నిర్ణయాలు తీసుకువే వారు. దుర్మార్గమునకు పాల్పడే వారు కాదు. info
التفاسير:
ประโยชน์​ที่​ได้รับ​:
• تضمَّنت التوراة والإنجيل أدلة ظاهرة على بعثة النبي محمد صلى الله عليه وسلم وعلى صدقه.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవదౌత్యం,ఆయన నీతి గురించి ప్రత్యక్ష ఆధారాలు తౌరాతు,ఇంజీలులో కలవు. info

• رحمة الله وسعت كل شيء، ولكن رحمة الله عباده ذات مراتب متفاوتة، تتفاوت بحسب الإيمان والعمل الصالح.
అల్లాహ్ కారుణ్యం అన్ని వస్తువులను ఆవరించి ఉన్నది. కాని అల్లాహ్ కారుణ్యం దాసుల కొరకు వేరు వేరు స్థానాలు కలదై ఉంటుంది. విశ్వాసము,సత్కార్యాలకు తగ్గట్టుగా మారుతూ ఉంటుంది. info

• الدعاء قد يكون مُجْملًا وقد يكون مُفَصَّلًا حسب الأحوال، وموسى في هذا المقام أجمل في دعائه.
సంధర్భాలను బట్టి దుఆ ఒక్కొక్కసారి సంక్షిప్తంగా ఉంటుంది,ఒక్కొక్కసారి వివరణగా ఉంటుంది. మరియు మూసా ఈ స్థానములో తన దుఆను అత్యంత సంక్షిప్తంగా చేసేవారు. info

• من صور عدل الله عز وجل إنصافه للقِلَّة المؤمنة، حيث ذكر صفات بني إسرائيل المنافية للكمال المناقضة للهداية، فربما توهَّم متوهِّم أن هذا يعم جميعهم، فَذَكَر تعالى أن منهم طائفة مستقيمة هادية مهدية.
విశ్వాసపరులు తక్కువగా ఉన్నా అల్లాహ్ యొక్క న్యాయ వ్యవహారం ఉండటం అల్లాహ్ న్యాయ స్వరూపాల్లోంచిది. అయితే ఆయన సన్మార్గమును (హిదాయత్ ను) విచ్చిన్నం చేసే,పరిపూర్ణతను వ్యతిరేకించే ఇస్రాయీలు సంతతి వారి లక్షణాలను ప్రస్తావించాడు. సందేహపడేవాడు ఇది వారందరిలో ఉన్నదని సందేహ పడవచ్చు అందుకనే మహోన్నతుడైన అల్లాహ్ వారిలోంచి ఒక వర్గము సవ్యంగా,సన్మార్గము పై ఉన్నదని ప్రస్తావించాడు. info