แปล​ความหมาย​อัลกุรอาน​ - คำแปลภาษาติลกู สำหรับหนังสืออรรถาธิบายอัลกุรอานอย่างสรุป (อัลมุคตะศ็อร ฟีตัฟซีร อัลกุรอานิลกะรีม)

หมายเลข​หน้า​:close

external-link copy
163 : 4

اِنَّاۤ اَوْحَیْنَاۤ اِلَیْكَ كَمَاۤ اَوْحَیْنَاۤ اِلٰی نُوْحٍ وَّالنَّبِیّٖنَ مِنْ بَعْدِهٖ ۚ— وَاَوْحَیْنَاۤ اِلٰۤی اِبْرٰهِیْمَ وَاِسْمٰعِیْلَ وَاِسْحٰقَ وَیَعْقُوْبَ وَالْاَسْبَاطِ وَعِیْسٰی وَاَیُّوْبَ وَیُوْنُسَ وَهٰرُوْنَ وَسُلَیْمٰنَ ۚ— وَاٰتَیْنَا دَاوٗدَ زَبُوْرًا ۟ۚ

నిశ్ఛయంగా మేము ఓ ప్రవక్త మీకన్న పూర్వ ప్రవక్తలపై అవతరిపజేసినట్లే మీపై దైవవాణిని అవతరింపజేశాము. అయితే మీరు ప్రవక్తల్లోంచి కొత్తవారు కాదు. నిశ్చయంగా మేము నూహ్ వైపునకు దైవవాణిని అవతరింపజేశాము. మరియు ఆయన తరువాత వచ్చిన దైవ ప్రవక్తలపై మేము దైవవాణిని అవతరింపజేశాము. మరియు ఇబ్రాహీంపై మరియు ఆయన ఇద్దరు కుమారులైన ఇస్మాయీల్,ఇస్హాఖ్ పై మరియు ఇస్హాఖ్ కుమారుడగు యాఖూబ్ పై మరియు ఆయన సంతతి పై (వారు యాఖూబ్ కుమారుల్లోంచి పన్నెండు మంది ఇస్రాయిల్ సంతతికి చెందిన తెగల్లోంచి అయిన దైవ ప్రవక్తలు) మేము దైవవాణిని అవతరింపజేశాము. మరియు మేము ఈసా,అయ్యూబ్,యూనుస్,హారూన్,సులైమాన్ ల వైపు దైవవాణిని అవతరింపజేశాము. మరియు మేము దావూద్ కు ఒక గ్రంధమును ప్రసాదించాము. అది జబూర్. info
التفاسير:

external-link copy
164 : 4

وَرُسُلًا قَدْ قَصَصْنٰهُمْ عَلَیْكَ مِنْ قَبْلُ وَرُسُلًا لَّمْ نَقْصُصْهُمْ عَلَیْكَ ؕ— وَكَلَّمَ اللّٰهُ مُوْسٰی تَكْلِیْمًا ۟ۚ

మరియు మేము కొంత మంది ప్రవక్తలను పంపించి వారి గాధలను ఖుర్ఆన్ లో మీకు తెలియపరిచాము. మరియు కొంత మంది ప్రవక్తలను పంపించి వారి గాధలను మీకు అందులో తెలియపరచలేదు. మరియు మేము వారి ప్రస్తావనను విజ్ఞత కొరకు అందులో వదిలివేశాము. మరియు అల్లాహ్ మూసాతో దైవ దౌత్యం ద్వారా ఎటువంటి ఆధారము లేకుండా పరిశుద్దుడైన ఆయనకు తగిన విధంగా వాస్తవంగా మూసా కు గౌరవంగా మాట్లాడాడు. info
التفاسير:

external-link copy
165 : 4

رُسُلًا مُّبَشِّرِیْنَ وَمُنْذِرِیْنَ لِئَلَّا یَكُوْنَ لِلنَّاسِ عَلَی اللّٰهِ حُجَّةٌ بَعْدَ الرُّسُلِ ؕ— وَكَانَ اللّٰهُ عَزِیْزًا حَكِیْمًا ۟

మేము వారిని అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచే వారికి గౌరవోన్నతమైన ప్రతిఫలము ద్వారా శుభవార్తనిచ్చేవారిగా మరియు ఆయనను అవిశ్వసించే వారికి బాధాకరమైన శిక్ష నుండి భయపెట్టేవారిగా పంపించాము. చివరికి ప్రవక్తలను పంపించిన తరువాత ప్రజలకు వంకలు పెట్టటానికి అల్లాహ్ ముందు ఎటువంటి వాదన లేకుండా ఉండటానికి. మరియు అల్లాహ్ తన రాజ్యాధికారంలో సర్వాధిక్యుడు మరియు తన తీర్పునివ్వటంలో వివేకవంతుడు. info
التفاسير:

external-link copy
166 : 4

لٰكِنِ اللّٰهُ یَشْهَدُ بِمَاۤ اَنْزَلَ اِلَیْكَ اَنْزَلَهٗ بِعِلْمِهٖ ۚ— وَالْمَلٰٓىِٕكَةُ یَشْهَدُوْنَ ؕ— وَكَفٰی بِاللّٰهِ شَهِیْدًا ۟ؕ

ఒక వేళ యూదులు మిమ్మల్ని తిరస్కరించినా నిశ్చయంగా ఓ ప్రవక్తా అల్లాహ్ మీపై అవతరింపజేసిన ఖుర్ఆన్ సరైనదన్న దాని ద్వారా మిమ్మల్ని దృవీకరిస్తున్నాడు. ఆయన అందులో తాను కోరుకుని తాను ఇష్టపడిన వాటిని లేదా తాను ఇష్టపడక తాను నిరాకరించిన వాటిని దాసులకు తెలియపరచదలచిన తన జ్ఞానమును అందులో అవతరింపజేశాడు. మీరు తీసుకుని వచ్చిన దాని నిజాయితీ గురించి అల్లాహ్ సాక్ష్యంతో పాటు దైవదూతలు సాక్ష్యం పలుకుతారు. మరియు సాక్షిగా అల్లాహ్ చాలును. ఇతరుల సాక్ష్యమునకు ఆయన సాక్ష్యము సరిపోతుంది. info
التفاسير:

external-link copy
167 : 4

اِنَّ الَّذِیْنَ كَفَرُوْا وَصَدُّوْا عَنْ سَبِیْلِ اللّٰهِ قَدْ ضَلُّوْا ضَلٰلًا بَعِیْدًا ۟

నిశ్చయంగా ఎవరైతే మీ దైవదౌత్యమును తిరస్కరించి ప్రజలను ఇస్లాం నుండి నిరోధిస్తారో వారు సత్యము నుండి చాలా దూరం అయిపోయారు. info
التفاسير:

external-link copy
168 : 4

اِنَّ الَّذِیْنَ كَفَرُوْا وَظَلَمُوْا لَمْ یَكُنِ اللّٰهُ لِیَغْفِرَ لَهُمْ وَلَا لِیَهْدِیَهُمْ طَرِیْقًا ۟ۙ

నిశ్చయంగా అల్లాహ్ పట్ల మరియు ఆయన ప్రవక్తల పట్ల అవిశ్వాసమును కనబరచి మరియు అవిశ్వాసముపై ఉండిపోయి తమ స్వయముపై హింసకు పాల్పడ్డారో వారిని అల్లాహ్ వారు అవిశ్వాసముపై మొండిగా వ్యవహరించిన దానికి మన్నించడు. మరియు వారిని అల్లాహ్ శిక్ష నుండి విముక్తిని కలిగించే మార్గం వైపునకు మార్గదర్శకం చేయడు. info
التفاسير:

external-link copy
169 : 4

اِلَّا طَرِیْقَ جَهَنَّمَ خٰلِدِیْنَ فِیْهَاۤ اَبَدًا ؕ— وَكَانَ ذٰلِكَ عَلَی اللّٰهِ یَسِیْرًا ۟

కాని నరకములో ప్రవేశమునకు దారితీసే మార్గము వైపునకు (మార్గదర్శకం చేస్తాడు) వారు అందులో శాశ్వతంగా ఉంటారు. మరియు ఇది అల్లాహ్ పై సులభము. ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు. info
التفاسير:

external-link copy
170 : 4

یٰۤاَیُّهَا النَّاسُ قَدْ جَآءَكُمُ الرَّسُوْلُ بِالْحَقِّ مِنْ رَّبِّكُمْ فَاٰمِنُوْا خَیْرًا لَّكُمْ ؕ— وَاِنْ تَكْفُرُوْا فَاِنَّ لِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— وَكَانَ اللّٰهُ عَلِیْمًا حَكِیْمًا ۟

ఓ మానవులారా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మహోన్నతుడైన అల్లాహ్ వద్ద నుండి సన్మార్గమును మరియు సత్య ధర్మమును మీ వద్దకు తీసుకుని వచ్చారు. కాబట్టి మీరు ఆయన మీ వద్దకు తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించండి అది మీ కొరకు ఇహపరాలలో మేలగును. మరియు ఒక వేళ మీరు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిస్తే నిశ్చయంగా అల్లాహ్ మీ విశ్వాసము నుండి అక్కరలేనివాడు. మరియు మీ అవిశ్వాసం ఆయనకు నష్టం కలిగించదు.అకాశముల్లో ఉన్న వాటి రాజ్యాధికారము మరియు భూమిలో,ఆ రెండిటి మధ్య ఉన్న వాటి రాజ్యాధికారము ఆయనకే చెందుతుంది. మరియు సన్మార్గమునకు ఎవరు హక్కుదారుడో అల్లాహ్ కు బాగా తెలుసు కాబట్టి ఆయన అతని కొరకు దాన్ని సులభతరం చేస్తాడు. మరియు ఎవరు దానికి హక్కు దారుడు కాడో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అతడిని దాని నుండి అంధుడిగా చేసేస్తాడు. మరియు ఆయన తన మాటల్లో మరియు తన కార్యాల్లో మరియు తన ధర్మ శాసనాల్లో మరియు తన విధి వ్రాతలో వివేకవంతుడు. info
التفاسير:
ประโยชน์​ที่​ได้รับ​:
• إثبات النبوة والرسالة في شأن نوح وإبراهيم وغيرِهما مِن ذرياتهما ممن ذكرهم الله وممن لم يذكر أخبارهم لحكمة يعلمها سبحانه.
నూహ్ అలైహిస్సలాం మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు వారిరువురి సంతానములో నుంచి ఇతరులు అల్లాహ్ ప్రస్తావించిన వారు మరియు పరిశుద్దుడైన ఆయన తనకు తెలిసిన విజ్ఞత వలన ప్రస్తావించ లేదో వారి విషయంలో దైవ దౌత్యము మరియు సందేశహరత నిరూపణ. info

• إثبات صفة الكلام لله تعالى على وجه يليق بذاته وجلاله، فقد كلّم الله تعالى نبيه موسى عليه السلام.
మహోన్నతుడైన అల్లాహ్ కొరకు ఆయన ఉనికికి మరియు ఆయన ఔన్నత్యానికి తగిన విధంగా మాట్లాడే గుణము యొక్క నిరూపణ. నిశ్చయంగా మహోన్నతుడైన అల్లాహ్ తన ప్రవక్త అయిన మూసా అలైహిస్సలాంతో మాట్లాడాడు. info

• تسلية النبي محمد عليه الصلاة والسلام ببيان أن الله تعالى يشهد على صدق دعواه في كونه نبيًّا، وكذلك تشهد الملائكة.
మహోన్నతుడైన అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తాను ప్రవక్త అన్న వాదనలో సత్యవంతులు అవటంపై సాక్ష్యం పలుకుతున్నాడని ప్రకటించటం ద్వారా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంనకు ఓదార్పు ఉన్నది మరియు అలాగే దైవదూతలు సాక్ష్యం పలుకుతున్నవి. info