Përkthimi i kuptimeve të Kuranit Fisnik - Përkthimi në gjuhën telugu - Abdurrahim ibn Muhamed

అత్-తలాఖ్

external-link copy
1 : 65

یٰۤاَیُّهَا النَّبِیُّ اِذَا طَلَّقْتُمُ النِّسَآءَ فَطَلِّقُوْهُنَّ لِعِدَّتِهِنَّ وَاَحْصُوا الْعِدَّةَ ۚ— وَاتَّقُوا اللّٰهَ رَبَّكُمْ ۚ— لَا تُخْرِجُوْهُنَّ مِنْ بُیُوْتِهِنَّ وَلَا یَخْرُجْنَ اِلَّاۤ اَنْ یَّاْتِیْنَ بِفَاحِشَةٍ مُّبَیِّنَةٍ ؕ— وَتِلْكَ حُدُوْدُ اللّٰهِ ؕ— وَمَنْ یَّتَعَدَّ حُدُوْدَ اللّٰهِ فَقَدْ ظَلَمَ نَفْسَهٗ ؕ— لَا تَدْرِیْ لَعَلَّ اللّٰهَ یُحْدِثُ بَعْدَ ذٰلِكَ اَمْرًا ۟

ఓ ప్రవక్తా! మీరు స్త్రీలకు విడాకులు (తలాఖ్) ఇచ్చేటప్పుడు వారికి, వారి నిర్ణీత గడువు (ఇద్దత్) తో విడాకులివ్వండి. మరియు ఆ గడువును ఖచ్చితంగా లెక్కపెట్టండి[1]. మరియు మీ ప్రభువైన అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. వారు బహిరంగంగా అశ్లీల చేష్టలకు పాల్పడితే తప్ప, మీరు వారిని వారి ఇండ్ల నుండి వెడల గొట్టకండి మరియు వారు కూడా స్వయంగా వెళ్ళి పోకూడదు[2]. మరియు ఇవి అల్లాహ్ నిర్ణయించిన హద్దులు. మరియు ఎవడైతే అల్లాహ్ (నిర్ణయించిన) హద్దులను అతిక్రమిస్తాడో వాస్తవానికి వాడు తనకు తానే అన్యాయం చేసుకున్నట్లు. నీకు తెలియదు, బహుశా! దాని తరువాత అల్లాహ్ ఏదైనా క్రొత్త మార్గం చూపించవచ్చు![3] info

[1] నిర్ణీతగడువుతో అంటే గడువు ప్రారంభం కాగల సమయంలో, నిర్ణీతగడువు లోపల ఆమెతో రాజీపడే అవకాశం ఉండేరీతిలో విడాకులివ్వాలి. ఇబ్నె ఉమర్ ('ర'ది.'అ) తన భార్యకు ఋతుస్రావంకాలం (బహిష్టు సమయం)లో విడాకులిస్తే, దైవప్రవక్త ('స'అస) క్రోధితులయ్యారు. స్త్రీలు పరిశుద్ధులుగా ఉన్నకాలంలో వారితో లైంగిక సంబంధం చేయక ముందు విడాకులివ్వాలి అని బోధించారు. ('స. బు'ఖారీ). ఇక్కడ పేర్కొన్న 'హదీస్' ఈ ఆయత్ వెలుగులో ఉంది. ఆ గడువును ఖచ్ఛితంగా లెక్కపెట్టాలి.
[2] ఇద్దత్ కాలం పూర్తి అయ్యే వరకు స్త్రీలు తమ భర్త ఇంటిలోనే ఉండాలి. భర్త ఆమె అన్న వస్త్రాల ఖర్చులు భరించాలి.
[3] చూఅంటే అల్లాహ్ (సు.తా.) వారి మధ్య మళ్ళీ ప్రేమ కలగించవచ్చు మరియు వారు తిరిగి తమ వివాహబంధాన్ని స్థిరపరచుకోవచ్చు! అందుకే ఒకసారి విడాకులివ్వడం ప్రోత్సహించబడింది. మరియు చాలా మంది వ్యాఖ్యాతల అభిప్రాయం ప్రకారం - ఈ ఆయత్ వెలుగులో - మూడు విడాకులు ఒకేసారి ఇవ్వడం నిషేధింపబడింది. ఎందుకంటే మొదటి మరియు రెండవ విడాకు తరువాత వివాహాన్ని తిరిగి స్థిరపరచుకోవచ్చు! (ఫ'త్హ్ అల్ ఖదీర్). ఒక స్త్రీకి అంతకు ముందు రెండువిడాకులివ్వబడి ఆ తరువాత మూడవవిడాకు ఇస్తే! అప్పుడు ఆమె తన భర్త ఇంట్లో ఉండజాలదు. మరియు అలాంటి పరిస్థితిలో, ఆమె మరొక పురుషుణ్ణి వివాహమాడకముందు తిరిగి తన మొదటి భర్తతో వివాహం కూడా చేసుకోజాలదు. ఇది ఫాతిమబిన్తెఖైస్ (ర.'అన్హా) కు జరిగిన విషయంతో స్పష్టమవుతుంది. ఆమె భర్త ఆమెకు మూడవసారి విడాకులిచ్చిన తరువాత ఆమె తన భర్త ఇంటి నుండి వెళ్ళిపోవటానికి నిరాకరించింది. అప్పుడావిషయం దైవప్రవక్త ('స'అస) దగ్గరికి వస్తే అతనామెను, తన భర్త ఇల్లు విడవమని ఆజ్ఞాపించారు, (అ'హ్మద్, నసాయీ').

التفاسير:

external-link copy
2 : 65

فَاِذَا بَلَغْنَ اَجَلَهُنَّ فَاَمْسِكُوْهُنَّ بِمَعْرُوْفٍ اَوْ فَارِقُوْهُنَّ بِمَعْرُوْفٍ وَّاَشْهِدُوْا ذَوَیْ عَدْلٍ مِّنْكُمْ وَاَقِیْمُوا الشَّهَادَةَ لِلّٰهِ ؕ— ذٰلِكُمْ یُوْعَظُ بِهٖ مَنْ كَانَ یُؤْمِنُ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ ؕ۬— وَمَنْ یَّتَّقِ اللّٰهَ یَجْعَلْ لَّهٗ مَخْرَجًا ۟ۙ

ఇక వారి నిర్ణీత గడువు ముగిసినప్పుడు, వారిని ధర్మప్రకారంగా (వివాహబంధంలో) ఉంచుకోండి, లేదా ధర్మప్రకారంగా వారిని విడచి పెట్టండి. మరియు మీలో న్యాయవంతులైన ఇద్దరు వ్యక్తులను సాక్షులుగా పెట్టుకోండి. మరియు అల్లాహ్ కొరకు సాక్ష్యం సరిగ్గా ఇవ్వండి. అల్లాహ్ ను మరియు అంతిమ దినమును విశ్వసించే ప్రతి వ్యక్తి కొరకు, ఈ విధమైన ఉపదేశమివ్వబడుతోంది. మరియు అల్లాహ్ యందు భయభక్తులు గలవానికి, ఆయన ముక్తిమార్గం చూపుతాడు. info
التفاسير:

external-link copy
3 : 65

وَّیَرْزُقْهُ مِنْ حَیْثُ لَا یَحْتَسِبُ ؕ— وَمَنْ یَّتَوَكَّلْ عَلَی اللّٰهِ فَهُوَ حَسْبُهٗ ؕ— اِنَّ اللّٰهَ بَالِغُ اَمْرِهٖ ؕ— قَدْ جَعَلَ اللّٰهُ لِكُلِّ شَیْءٍ قَدْرًا ۟

మరియు ఆయన, అతనికి అతడు ఊహించని దిక్కు నుండి జీనవోపాధిని ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ మీద నమ్మకం ఉంచుకున్న వానికి ఆయనే చాలు. నిశ్చయంగా, అల్లాహ్ తన పని పూర్తి చేసి తీరుతాడు. వాస్తవానికి, అల్లాహ్ ప్రతిదానికి దాని విధి (ఖద్ర్) నిర్ణయించి ఉన్నాడు. info
التفاسير:

external-link copy
4 : 65

وَا یَىِٕسْنَ مِنَ الْمَحِیْضِ مِنْ نِّسَآىِٕكُمْ اِنِ ارْتَبْتُمْ فَعِدَّتُهُنَّ ثَلٰثَةُ اَشْهُرٍ وَّا لَمْ یَحِضْنَ ؕ— وَاُولَاتُ الْاَحْمَالِ اَجَلُهُنَّ اَنْ یَّضَعْنَ حَمْلَهُنَّ ؕ— وَمَنْ یَّتَّقِ اللّٰهَ یَجْعَلْ لَّهٗ مِنْ اَمْرِهٖ یُسْرًا ۟

మరియు మీ స్త్రీలు ఋతుస్రావపు వయస్సు గడిచి పోయినవారైతే లేక మీకు దానిని గురించి ఎలాంటి అనుమానం ఉంటే; లేక వారి ఋతుస్రావం ఇంకా ప్రారంభం కాని వారైతే, అలాంటి వారి గడువు మూడు మాసాలు[1]. మరియు గర్భవతులైన స్త్రీల గడువు వారి కాన్పు అయ్యే వరకు[2]. మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు గలవానికి ఆయన, అతని వ్యవహారంలో సౌలభ్యం కలిగిస్తాడు. info

[1] ఋతుస్రావం ప్రారంభం కాని స్త్రీలకు మరియు ఋతుస్రావం ఆగిపోయిన స్త్రీలకు వేచి ఉండే గడువు మూడు నెలలు.
[2] గర్భవతులైన స్త్రీల గడువు - విడాకులివ్వబడినా లేక భర్త మరణించినా - ప్రసవించే వరకు! అలాంటి ప్రసవం విడాకుల తరువాత లేక భర్త మరణించిన రెండవరోజే అయినా సరే! ఈ విషయం 'హదీస్'లలో కూడా ఉంది. (బు.'ఖారీ, ముస్లిం). ఇతర స్త్రీలు భర్త మరణించిన తరువాత నాలుగు మాసాల పది రోజులు వేచి ఉండాలి. 2:234.

التفاسير:

external-link copy
5 : 65

ذٰلِكَ اَمْرُ اللّٰهِ اَنْزَلَهٗۤ اِلَیْكُمْ ؕ— وَمَنْ یَّتَّقِ اللّٰهَ یُكَفِّرْ عَنْهُ سَیِّاٰتِهٖ وَیُعْظِمْ لَهٗۤ اَجْرًا ۟

ఇది అల్లాహ్ ఆజ్ఞ, ఆయన దానిని మీపై అవతరింపజేశాడు. మరియు ఎవడైతే అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉంటాడో, ఆయన అతని పాపాలను తొలగిస్తాడు. మరియు అతని ప్రతిఫలాన్ని అధికం చేస్తాడు. info
التفاسير: