Përkthimi i kuptimeve të Kuranit Fisnik - Përkthimi në gjuhën telugu - Abdurrahim ibn Muhamed

అల్-వాఖియహ్

external-link copy
1 : 56

اِذَا وَقَعَتِ الْوَاقِعَةُ ۟ۙ

ఆ అనివార్య సంఘటన సంభవించినపుడు,[1] info

[1] అనివార్య సంఘటన అంటే, అంతిమ ఘడియ, పునరుత్థాన దినం.

التفاسير:

external-link copy
2 : 56

لَیْسَ لِوَقْعَتِهَا كَاذِبَةٌ ۟ۘ

అది సంభవించటంలో ఎలాంటి సందేహం (అసత్యం) లేదు. info
التفاسير:

external-link copy
3 : 56

خَافِضَةٌ رَّافِعَةٌ ۟ۙ

అది కొందరిని హీనపరుస్తుంది, మరికొందరిని పైకెత్తుతుంది[1]. info

[1] అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞలను అనుసరించిన వారు పైకెత్తబడతారు. వాటిని తిరస్కరించిన వారు హీనపరచబడతారు.

التفاسير:

external-link copy
4 : 56

اِذَا رُجَّتِ الْاَرْضُ رَجًّا ۟ۙ

భూమి తీవ్ర కంపనంతో కంపించినపుడు; info
التفاسير:

external-link copy
5 : 56

وَّبُسَّتِ الْجِبَالُ بَسًّا ۟ۙ

మరియు పర్వతాలు పొడిగా మార్చబడినపుడు; info
التفاسير:

external-link copy
6 : 56

فَكَانَتْ هَبَآءً مُّنْۢبَثًّا ۟ۙ

అప్పుడు వాటి దుమ్ము నలువైపులా నిండి పోయినపుడు; info
التفاسير:

external-link copy
7 : 56

وَّكُنْتُمْ اَزْوَاجًا ثَلٰثَةً ۟ؕ

మరియు మీరు మూడు వర్గాలుగా విభజింపబడతారు. info
التفاسير:

external-link copy
8 : 56

فَاَصْحٰبُ الْمَیْمَنَةِ ۙ۬— مَاۤ اَصْحٰبُ الْمَیْمَنَةِ ۟ؕ

ఇక కుడిపక్షం వారు, ఆ కుడిపక్షము వారు ఎంత (అదృష్టవంతులు)![1] info

[1] కుడిపక్షం వారంటే తమ కర్మపత్రాలు కుడిచేతిలో ఇవ్వబడేవారు. అంటే స్వర్గానికి అర్హులైనవారు. చూడండి, 74:39.

التفاسير:

external-link copy
9 : 56

وَاَصْحٰبُ الْمَشْـَٔمَةِ ۙ۬— مَاۤ اَصْحٰبُ الْمَشْـَٔمَةِ ۟ؕ

మరికొందరు వామపక్షం వారుంటారు, ఆ వామపక్షపు వారు ఎంత (దౌర్భాగ్యులు)![1] info

[1] వారు (ఎడమ) పక్షంవారు అంటే తమ కర్మపత్రాలు ఎడమ చేతిలో ఇవ్వబడినవారు. అంటే నరకానికి అర్హులైన వారు. చూడండి, 90:19.

التفاسير:

external-link copy
10 : 56

وَالسّٰبِقُوْنَ السّٰبِقُوْنَ ۟ۙ

మరియు (ఇహలోకంలో విశ్వాసంలో) ముందున్న వారు (స్వర్గంలో కూడా) ముందుంటారు. info
التفاسير:

external-link copy
11 : 56

اُولٰٓىِٕكَ الْمُقَرَّبُوْنَ ۟ۚ

అలాంటి వారు (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందుతారు. info
التفاسير:

external-link copy
12 : 56

فِیْ جَنّٰتِ النَّعِیْمِ ۟

వారు సర్వసుఖాలు గల స్వర్గవనాలలో ఉంటారు. info
التفاسير:

external-link copy
13 : 56

ثُلَّةٌ مِّنَ الْاَوَّلِیْنَ ۟ۙ

మొదటి తరాల వారిలో నుండి చాలా మంది; info
التفاسير:

external-link copy
14 : 56

وَقَلِیْلٌ مِّنَ الْاٰخِرِیْنَ ۟ؕ

మరియు తరువాత తరాల వారిలో నుండి కొంతమంది. info
التفاسير:

external-link copy
15 : 56

عَلٰی سُرُرٍ مَّوْضُوْنَةٍ ۟ۙ

(బంగారు) జలతారు అల్లిన ఆసనాల మీద; info
التفاسير:

external-link copy
16 : 56

مُّتَّكِـِٕیْنَ عَلَیْهَا مُتَقٰبِلِیْنَ ۟

ఒకరికొకరు ఎదురెదురుగా, వాటి మీద దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు.[1] info

[1] చూడండి, 15:47.

التفاسير: