Përkthimi i kuptimeve të Kuranit Fisnik - Përkthimi në gjuhën telugu - Abdurrahim ibn Muhamed

Numri i faqes:close

external-link copy
32 : 5

مِنْ اَجْلِ ذٰلِكَ ؔۛۚ— كَتَبْنَا عَلٰی بَنِیْۤ اِسْرَآءِیْلَ اَنَّهٗ مَنْ قَتَلَ نَفْسًا بِغَیْرِ نَفْسٍ اَوْ فَسَادٍ فِی الْاَرْضِ فَكَاَنَّمَا قَتَلَ النَّاسَ جَمِیْعًا ؕ— وَمَنْ اَحْیَاهَا فَكَاَنَّمَاۤ اَحْیَا النَّاسَ جَمِیْعًا ؕ— وَلَقَدْ جَآءَتْهُمْ رُسُلُنَا بِالْبَیِّنٰتِ ؗ— ثُمَّ اِنَّ كَثِیْرًا مِّنْهُمْ بَعْدَ ذٰلِكَ فِی الْاَرْضِ لَمُسْرِفُوْنَ ۟

ఈ కారుణం వల్లనే మేము ఇస్రాయీల్ సంతతి వారికి ఈ ఉత్తరువు ఇచ్చాము: "నిశ్చయంగా - ఒక వ్యక్తి (హత్యకు) బదులుగా గానీ లేదా భూమిలో కల్లోలం వ్యాపింపజేసి నందుకు గానీ గాక - ఎవడైనా ఒక వ్యక్తిని (అన్యాయంగా) చంపితే, అతడు సర్వ మానవజాతిని చంపినట్లే, మరియు ఎవడైనా ఒక మానవుని ప్రాణాన్ని కాపాడితే, అతడు సర్వ మానవజాతి ప్రాణాలను కాపాడినట్లే!" మరియు వాస్తవానికి, వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని మా ప్రవక్తలు వచ్చారు, అయినా వాస్తవానికి వారిలో పలువురు భూమిలో అక్రమాలు చేసేవారు. info
التفاسير:

external-link copy
33 : 5

اِنَّمَا جَزٰٓؤُا الَّذِیْنَ یُحَارِبُوْنَ اللّٰهَ وَرَسُوْلَهٗ وَیَسْعَوْنَ فِی الْاَرْضِ فَسَادًا اَنْ یُّقَتَّلُوْۤا اَوْ یُصَلَّبُوْۤا اَوْ تُقَطَّعَ اَیْدِیْهِمْ وَاَرْجُلُهُمْ مِّنْ خِلَافٍ اَوْ یُنْفَوْا مِنَ الْاَرْضِ ؕ— ذٰلِكَ لَهُمْ خِزْیٌ فِی الدُّنْیَا وَلَهُمْ فِی الْاٰخِرَةِ عَذَابٌ عَظِیْمٌ ۟ۙ

నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్ తో మరియు ఆయన ప్రవక్తతో పోరాడుతారో మరియు ధరణిలో కల్లోలం రేకెత్తించటానికి ప్రయత్నిస్తారో, అలాంటి వారికి మరణ శిక్ష విధించాలి; లేదా శిలువపై ఎక్కించాలి; లేదా వారి అభిముఖ పక్షాల కాళ్ళు - చేతులను నరికించాలి; లేదా వారిని దేశ బహిష్క్రుతుల్ని చేయాలి. ఇది వారికి ఇహలోకంలో గల అవమానం. మరియు వారికి పరలోకంలో కూడా ఘోర శిక్ష ఉంటుంది. info
التفاسير:

external-link copy
34 : 5

اِلَّا الَّذِیْنَ تَابُوْا مِنْ قَبْلِ اَنْ تَقْدِرُوْا عَلَیْهِمْ ۚ— فَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟۠

మీరు స్వాధీనపరచుకోక ముందు పశ్చాత్తాప పడేవారు తప్ప! కావున మీరు నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత, అని తెలుసుకోండి. info
التفاسير:

external-link copy
35 : 5

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَابْتَغُوْۤا اِلَیْهِ الْوَسِیْلَةَ وَجَاهِدُوْا فِیْ سَبِیْلِهٖ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ ۟

ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు ఆయన సాన్నిధ్యానికి చేరే మార్గాన్ని అన్వేషించండి.[1] మరియు ఆయన మార్గంలో నిరంతరం కృషి చేస్తే మీరు సాఫల్యం పొంద వచ్చు![2] info

[1] వసీల: మార్గం, అంటే తాను కోరిన దానిని పొందటానికి లేక దానికి సన్నిహితు లవటానికి సహాయపడేది. అంటే దైవభీతి మరియు సద్వర్తన మరియు అల్లాహ్ (సు.తా.) 'హరాం చేసిన వాటి నుండి దూరంగా ఉండటం. కాని మూర్ఖులు ఈ సత్యాన్ని విడిచి గోరీలలో ఉన్నా వారిని తమకు వసీలాగా భావిస్తున్నారు. షరీ'అత్ లో ఇలాంటి అపోహలకు ఎలాంటి స్థానం లేదు. ('స'హీ'హ్ బు'ఖారీ, కితాబ్ అల్ - అ'జాన్ మరియు 'స'హీ'హ్ ముస్లిం, కితాబ్ అ'స్సలాహ్). అ'జాన్ తరువాత చదువ వలసిన దు'ఆయే వసీలా అది: "అల్లాహుమ్మ రబ్బ హాజి హిద్ద'అవతి త్తామ్మతి, వ'స్సలాతిల్ ఖాయి'మతి, ఆతి ము'హమ్మదన్ వసీలత వల్ - ఫ'దీలత, వబ్'అస్ హు మకామమ్ మ'హ్ మూ దల్లజీ' వఅద్తహు." స్వర్గంలో నబీ ('స'అస) కు ప్రసాదించబడిన మకామె మ'హమూద్ కూడా వసీల అనబడుతుంది. కావున ఎవడైతే అ'జాన్ తరువాత పై దు'ఆ చేస్తాడో అతడు నా సిఫారసుకు యోగ్యుడవుతాడు అని మహా ప్రవక్త ('స'అస) అన్నారు. [2] చూడండి, 2:186.

التفاسير:

external-link copy
36 : 5

اِنَّ الَّذِیْنَ كَفَرُوْا لَوْ اَنَّ لَهُمْ مَّا فِی الْاَرْضِ جَمِیْعًا وَّمِثْلَهٗ مَعَهٗ لِیَفْتَدُوْا بِهٖ مِنْ عَذَابِ یَوْمِ الْقِیٰمَةِ مَا تُقُبِّلَ مِنْهُمْ ۚ— وَلَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۟

నిశ్చయంగా, సత్య తిరస్కారులైన వారు తీర్పుదినాన గల శిక్ష నుండి తప్పించుకోవటానికి - వారి వద్ద ఉంటే - భూమిలో ఉన్న సమస్తాన్ని దానితో పాటు మరి అంత (ధనాన్ని) కూడా, విమోచనా ధనంగా ఇవ్వగోరుతారు కాని అది స్వీకరించబడదు. మరియు వారికి అతి బాధాకరమైన శిక్ష ఉంటుంది.[1] info

[1] చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 8, 'హదీస్' నం. 546.

التفاسير: