Përkthimi i kuptimeve të Kuranit Fisnik - Përkthimi në gjuhën telugu - Abdurrahim ibn Muhamed

అష్-షురా

external-link copy
1 : 42

حٰمٓ ۟ۚ

హా - మీమ్[1]. info

[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

التفاسير:

external-link copy
2 : 42

عٓسٓقٓ ۟

ఐన్ - సీన్ - ఖాఫ్[1], info

[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

التفاسير:

external-link copy
3 : 42

كَذٰلِكَ یُوْحِیْۤ اِلَیْكَ وَاِلَی الَّذِیْنَ مِنْ قَبْلِكَ ۙ— اللّٰهُ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟

(ఓ ముహమ్మద్!) సర్వశక్తిమంతుడూ, మహావివేకవంతుడూ అయిన అల్లాహ్, ఇదే విధంగా నీకూ మరియు నీ కంటే ముందు వచ్చిన వారికి కూడా దివ్యజ్ఞానం (వహీ) అవతరింపజేశాడు.[1] info

[1] ఏ విధంగానైతే దైవప్రవక్త ('స'అస)పై దివ్యజ్ఞానం అవతరింపజేయబడిందో, అదే విధంగా అతనికి ముందు వచ్చిన ప్రవక్తలపై కూడా అవతరింపజేయబడింది. దైవప్రవక్త ('స'అస) పై వ'హీ అవతరణను గురించి, ఒక 'స'హాబీ (ర'ది.'అ), దైవప్రవక్త ('స'అస) ను ప్రశ్నించగా ఇలా అన్నారు : "కొన్ని సార్లు అది (వ'హీ) నా దగ్గరకు ఘంటల శబ్దం వలే వస్తుంది. ఇది చాలా కఠినతరమైనది. అది ఆగిన తరువాత నాకు అంతా కంఠస్తమైపోతుంది. కొన్నిసార్లు దైవదూత ('అ.స.) మానవరూపంలో వచ్చి నాకు చెబుతాడు. అతను చెప్పినదంతా నాకు జ్ఞాపకమైపోతుంది." 'ఆయిషహ్ (ర.'అన్హా) అన్నారు : "నేను విపరీతమైన చలికాలంలో కూడా, వ'హీ అవతరణ ముగిసిన తరువాత, దైవప్రవక్త ('స'అస) ను చెమటలో మునిగి పోవటాన్ని చూశాను. మరియు అతని నుదుటి నుండి చెమట బిందువులు కారటం కూడా చూశాను." ('స'హీ'హ్ బు'ఖారీ).

التفاسير:

external-link copy
4 : 42

لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَهُوَ الْعَلِیُّ الْعَظِیْمُ ۟

ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకు చెందినదే. ఆయన మహోన్నతుడు, సర్వోత్తముడు. info
التفاسير:

external-link copy
5 : 42

تَكَادُ السَّمٰوٰتُ یَتَفَطَّرْنَ مِنْ فَوْقِهِنَّ وَالْمَلٰٓىِٕكَةُ یُسَبِّحُوْنَ بِحَمْدِ رَبِّهِمْ وَیَسْتَغْفِرُوْنَ لِمَنْ فِی الْاَرْضِ ؕ— اَلَاۤ اِنَّ اللّٰهَ هُوَ الْغَفُوْرُ الرَّحِیْمُ ۟

ఆకాశాలు, పై నుండి దాదాపు ప్రేలి పోనున్నాయి. మరియు దేవదూతలు తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయనను స్తుతిస్తూ ఉన్నారు మరియు భూమిలో ఉన్నవారి కొరకు క్షమాపణ కోరుతున్నారు. చూడండి, నిశ్చయంగా అల్లాహ్! ఆయనే క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. info
التفاسير:

external-link copy
6 : 42

وَالَّذِیْنَ اتَّخَذُوْا مِنْ دُوْنِهٖۤ اَوْلِیَآءَ اللّٰهُ حَفِیْظٌ عَلَیْهِمْ ۖؗ— وَمَاۤ اَنْتَ عَلَیْهِمْ بِوَكِیْلٍ ۟

మరియు ఎవరైతే ఆయనను వదలి ఇతరులను తమ సంరక్షకులుగా చేసుకుంటారో, వారిని అల్లాహ్ కనిపెట్టుకొని ఉన్నాడు. మరియు నీవు వారికి బాధ్యుడవు కావు. [1] info

[1] నీ బాధ్యత కేవలం మా సందేశాన్ని వారికి అందజేయటమే!

التفاسير:

external-link copy
7 : 42

وَكَذٰلِكَ اَوْحَیْنَاۤ اِلَیْكَ قُرْاٰنًا عَرَبِیًّا لِّتُنْذِرَ اُمَّ الْقُرٰی وَمَنْ حَوْلَهَا وَتُنْذِرَ یَوْمَ الْجَمْعِ لَا رَیْبَ فِیْهِ ؕ— فَرِیْقٌ فِی الْجَنَّةِ وَفَرِیْقٌ فِی السَّعِیْرِ ۟

మరియు ఈ విధంగా మేము నీపై ఈ ఖుర్ఆన్ ను, అరబ్బీ భాషలో, దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేశాము. [1] దానితో నీవు ఉమ్ముల్ ఖురా (మక్కా) [2] మరియు దాని చుట్టుప్రక్కల వారిని హెచ్చరించటానికి మరియు - దానిని గురించి ఎలాంటి సందేహం లేని - ఆ సమావేశ దినాన్ని గురించి హెచ్చరించేందుకు కూడా. [3] (ఆ రోజు) ఒక వర్గం వారు స్వర్గానికి పోతారు, మరొక వర్గం వారు మండే నరకాగ్నిలోకి పోతారు. info

[1] చూడండి, 14:4, 13:37, 19:97 ప్రతి ప్రవక్త ('అ.స.) తన కాలపు ప్రజల భాషనే మాట్లాడేవాడు.
[2] ఉమ్ముల్-ఖురా: అంటే అన్ని నగరాల తల్లి. మక్కా యొక్క మరొక పేరు. ఇది అతి ప్రాచీన నగరం. చూడండి 6:92
[3] పునరుత్థానదినం: సమావేశదినం ఎందుకు అనబడిందంటే, ఆ రోజు అన్ని తరాలకు చెందిన మానవులు, మంచివారు, చెడ్డవారు, విశ్వాసులు, అవిశ్వాసులు అందరూ సమావేశపరచ బడతారు.

التفاسير:

external-link copy
8 : 42

وَلَوْ شَآءَ اللّٰهُ لَجَعَلَهُمْ اُمَّةً وَّاحِدَةً وَّلٰكِنْ یُّدْخِلُ مَنْ یَّشَآءُ فِیْ رَحْمَتِهٖ ؕ— وَالظّٰلِمُوْنَ مَا لَهُمْ مِّنْ وَّلِیٍّ وَّلَا نَصِیْرٍ ۟

మరియు ఒకవేళ అల్లాహ్ కోరితే వారందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు! [1] కాని ఆయన తాను కోరిన వారిని తన కరుణకు పాత్రులుగా చేసుకుంటాడు.[2] మరియు దుర్మార్గుల కొరకు, రక్షించేవాడు గానీ సహాయపడేవాడు గానీ ఎవ్వడూ ఉండడు. info

[1] చూడండి, 5:48, 16:93, 10:19.
[2] చూడండి, 14:4 మరియు, 22:16

التفاسير:

external-link copy
9 : 42

اَمِ اتَّخَذُوْا مِنْ دُوْنِهٖۤ اَوْلِیَآءَ ۚ— فَاللّٰهُ هُوَ الْوَلِیُّ وَهُوَ یُحْیِ الْمَوْتٰی ؗ— وَهُوَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟۠

లేక వారు ఆయనను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్నారా? కానీ అల్లాహ్! కేవలం ఆయనే సంరక్షకుడు మరియు ఆయనే మృతులను బ్రతికించేవాడు మరియు ఆయనే ప్రతిదీ చేయగల సమర్ధుడు. info
التفاسير:

external-link copy
10 : 42

وَمَا اخْتَلَفْتُمْ فِیْهِ مِنْ شَیْءٍ فَحُكْمُهٗۤ اِلَی اللّٰهِ ؕ— ذٰلِكُمُ اللّٰهُ رَبِّیْ عَلَیْهِ تَوَكَّلْتُ ۖۗ— وَاِلَیْهِ اُنِیْبُ ۟

మరియు మీరు ఏ విషయాన్ని గురించి భేదాభిప్రాయాలు కలిగి వున్నారో, దాని తీర్పు అల్లాహ్ వద్దనే ఉంది. [1] ఆయనే అల్లాహ్! నా ప్రభువు, నేను ఆయననే నమ్ముకున్నాను మరియు నేను పశ్చాత్తాపంతో ఆయన వైపునకే మరలుతాను. info

[1] చూడండి, 5:101.

التفاسير: