[1] రాత్రి మరియు పగలు ఈ రెండూ అల్లాహ్ (సు.తా.) అనుగ్రహించిన వరాలు. ఒకవేళ రాత్రి లేకుంటే, ప్రజలందరూ ఒకేసారి విశ్రాంతి తీసుకోలేక పోయేవారు. ప్రతి ఒక్కడు తన ఇష్టానుసారం విశ్రాంతి తీసుకుంటే ప్రపంచ కార్యక్రమాలు సరళంగా జరిగేవి కావు. మానవుల జీవితాలు పరస్పర సహయోగం, వల్లనే సరళంగా జరుగుతున్నాయి. దాని కొరకు రాత్రింబవళ్ళు ఎంతో ఉపయోగకరమైనవి.
[1] ఈ సాక్షులు ప్రవక్త ('అలైహిమ్ స.)లు ప్రతి ప్రవక్త తన కాలపు ప్రజలకు సాక్షిగా ఉంటాడు.
[1] చూఎంత గొప్ప ప్రవక్తను అనుసరించినా, అహంభావం మరియు స్వాభిమానంతో ప్రవర్తించే వారిని అల్లాహ్ (సు.తా.) ప్రేమించడు. ఈ ఉదాహరణ ఇక్కడ మూసా ('అ.స.) జాతికి చెందిన ఖారూన్ అనే గొప్ప ధనవంతుడైన వ్యక్తి విషయంలో ఇవ్వబడింది. ఇంకా చూడండి, 29:39 మరియు 40:24.
[1] ఏ విధంగానైతే నీ ప్రభువుకు నీపై హక్కు ఉందో, అదే విధంగా నీ ఆత్మకు, నీ భార్యాపిల్లలకు, నీ బంధువులకు మరయు నీ అతిథులను మొదలైన వారికి కూడా నీ మీద., నీ ఆదాయం మీద హక్కు ఉంది. కావున ప్రతి ఒక్కనికి వాని హక్కు చెల్లించు.