Përkthimi i kuptimeve të Kuranit Fisnik - Përkthimi në gjuhën telugu - Abdurrahim ibn Muhamed

external-link copy
40 : 22

١لَّذِیْنَ اُخْرِجُوْا مِنْ دِیَارِهِمْ بِغَیْرِ حَقٍّ اِلَّاۤ اَنْ یَّقُوْلُوْا رَبُّنَا اللّٰهُ ؕ— وَلَوْلَا دَفْعُ اللّٰهِ النَّاسَ بَعْضَهُمْ بِبَعْضٍ لَّهُدِّمَتْ صَوَامِعُ وَبِیَعٌ وَّصَلَوٰتٌ وَّمَسٰجِدُ یُذْكَرُ فِیْهَا اسْمُ اللّٰهِ كَثِیْرًا ؕ— وَلَیَنْصُرَنَّ اللّٰهُ مَنْ یَّنْصُرُهٗ ؕ— اِنَّ اللّٰهَ لَقَوِیٌّ عَزِیْزٌ ۟

వారికి ఎవరైతే కేవలం: "మా ప్రభువు అల్లాహ్!" అని అన్నందుకు మాత్రమే, అన్యాయంగా తమ ఇండ్ల నుండి తరిమి వేయబడ్డారో! ఒకవేళ అల్లాహ్ ప్రజలను ఒకరి ద్వారా మరొకరిని తొలగిస్తూ ఉండకపోతే[1] క్రైస్తవ సన్యాసుల మఠాలు, చర్చులు, యూదుల ప్రార్థనాలయాలు[2] మరియు మస్జిదులు, ఎక్కడైతే అల్లాహ్ పేరు అత్యధికంగా స్మరించబడుతుందో, అన్నీ ధ్వంసం చేయబడి ఉండేవి.[3] నిశ్చయంగా తనకు తాను సహాయం చేసుకునే వానికి అల్లాహ్ తప్పకుండా సహాయం చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ మహా బలవంతుడు, సర్వశక్తిమంతుడు. info

[1] ఇటువంటి వాక్యానికి చూడండి, 2:251 [2] యూదుల మాతాచారు (అ'హ్ బార్) లు తమ మత ధర్మాలను ఉపేదేశించే స్థలాలు, లేక యూదుల ప్రార్థనాలయాలు (సైనగోజెస్ / Synagogues) అనబడతాయి. [3] ధర్మస్వాతంత్ర్యం కొరకు ఆయుధాలు ఎత్తుకోవడం అత్యవసరమైన పని. చూడండి, 2:193.

التفاسير: