Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht

అల్-బురూజ్

Qëllimet e sures:
بيان قوة الله وإحاطته الشاملة، ونصرته لأوليائه، والبطش بأعدائه.
అల్లాహ్ శక్తి గురించి మరియు ఆయన సమగ్ర చుట్టుముట్టడం గురించి మరియు ఆయన స్నేహితులకు ఆయన సహాయము గురించి మరియు ఆయన శతృవులకు అణచివేయటం గురించి ప్రకటన info

external-link copy
1 : 85

وَالسَّمَآءِ ذَاتِ الْبُرُوْجِ ۟ۙ

సూర్య చంద్రుల మరియు ఇతర వాటి గ్రుహములు కల ఆకాశముపై అల్లాహ్ ప్రమాణం చేశాడు. info
التفاسير:

external-link copy
2 : 85

وَالْیَوْمِ الْمَوْعُوْدِ ۟ۙ

మరియు ఆయన ఆ ప్రళయదినంపై ప్రమాణం చేశాడు దేనిలోనైతే ఆయన సృష్టిరాసులను సమీకరిస్తానని వాగ్దానం చేశాడో. info
التفاسير:

external-link copy
3 : 85

وَشَاهِدٍ وَّمَشْهُوْدٍ ۟ؕ

మరియు ఆయన ప్రతీ సాక్ష్యం పలికేవాడిపై ప్రమాణం చేశాడు ఉదాహరణకు దైవప్రవక్త తన జాతి గురించి సాక్ష్యం పలుకుతారు. మరియు ప్రతీ సాక్ష్యం ఇవ్వబడిన దాని పై ప్రమాణం చేశాడు ఉదాహరణకు జాతి (ఉమ్మత్) తన ప్రవక్త గురించి సాక్ష్యం పలుకుతుంది. info
التفاسير:

external-link copy
4 : 85

قُتِلَ اَصْحٰبُ الْاُخْدُوْدِ ۟ۙ

భూమిని పెద్దగా చీల్చిన వారు శపించబడ్డారు. info
التفاسير:

external-link copy
5 : 85

النَّارِ ذَاتِ الْوَقُوْدِ ۟ۙ

మరియు వారు అందులో అగ్నిని వెలిగించారు. మరియు వారు అందులో విశ్వాసపరులను జీవించి ఉన్న స్థితిలో వేశారు. info
التفاسير:

external-link copy
6 : 85

اِذْ هُمْ عَلَیْهَا قُعُوْدٌ ۟ۙ

అప్పుడు వారు ఆ చీల్చబడిన అగ్నితో నిండబడిన దాని వద్ద కూర్చుని ఉన్నారు. info
التفاسير:

external-link copy
7 : 85

وَّهُمْ عَلٰی مَا یَفْعَلُوْنَ بِالْمُؤْمِنِیْنَ شُهُوْدٌ ۟ؕ

మరియు వారు విశ్వాసపరులకు ఇచ్చే శిక్షను,యాతనను చూస్తున్నారు. ఆ సమయంలో వారు ప్రత్యక్షమై ఉండటం వలన. info
التفاسير:

external-link copy
8 : 85

وَمَا نَقَمُوْا مِنْهُمْ اِلَّاۤ اَنْ یُّؤْمِنُوْا بِاللّٰهِ الْعَزِیْزِ الْحَمِیْدِ ۟ۙ

ఈ అవిశ్వాసపరులందరు విశ్వాసపరుల పట్ల ప్రతీకారం తీసుకున్నది కేవలం వారు ఎవరు ఓడించలేని సర్వ శక్తిమంతుడైన మరియు ప్రతీ దానిలో స్థుతించబడిన అల్లాహ్ పై విశ్వాసం కనబరచారని మాత్రమే. info
التفاسير:

external-link copy
9 : 85

الَّذِیْ لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— وَاللّٰهُ عَلٰی كُلِّ شَیْءٍ شَهِیْدٌ ۟ؕ

ఆయన ఒక్కడి కొరకే భూమ్యాకాశముల రాజ్యాధికారము. మరియు ఆయన ప్రతీది తెలుసుకునేవాడు. తన దాసుల వ్యవహారముల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. info
التفاسير:

external-link copy
10 : 85

اِنَّ الَّذِیْنَ فَتَنُوا الْمُؤْمِنِیْنَ وَالْمُؤْمِنٰتِ ثُمَّ لَمْ یَتُوْبُوْا فَلَهُمْ عَذَابُ جَهَنَّمَ وَلَهُمْ عَذَابُ الْحَرِیْقِ ۟ؕ

నిశ్చయంగా ఎవరైతే విశ్వాసపర పురుషులను మరియు విశ్వాసపర స్త్రీలను వారిని ఒక్కడైన అల్లాహ్ పై విశ్వాసము నుండి మరల్చటానికి శిక్షిస్తారో ఆ తరువాత తమ పాపముల గురించి అల్లాహ్ యందు పశ్ఛాత్తాప్పడరో వారి కొరకు ప్రళయదినమున నరకము యొక్క శిక్ష కలదు. మరియు వారి కొరకు వారిని దహించి వేసే అగ్ని శిక్ష కలదు. ఏదైతే వారు విశ్వాసపరులను అగ్నితో కాల్చివేసే కార్యం చేసేవారో దానికి ప్రతిఫలంగా. info
التفاسير:

external-link copy
11 : 85

اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ لَهُمْ جَنّٰتٌ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ؕ— ذٰلِكَ الْفَوْزُ الْكَبِیْرُ ۟ؕ

నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ ను విశ్వసించి సత్కార్యములు చేస్తారో వారి కొరకు స్వర్గవనాలు కలవు వాటి భవనముల క్రింది నుండి,వాటి వృక్షముల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ ప్రతిఫలము ఏదైతే ఆయన వారి కొరకు సిద్ధం చేశాడో ఏ సాఫల్యం సరితూగని పెద్ద సాఫల్యము. info
التفاسير:

external-link copy
12 : 85

اِنَّ بَطْشَ رَبِّكَ لَشَدِیْدٌ ۟ؕ

ఓ ప్రవక్త నిశ్చయంగా దుర్మార్గుని కొరకు మీ ప్రభువు పట్టు - మరియు నిశ్ఛయంగా అతనికి కొంత సమయం గడువు ఇవ్వటం - ఎంతో దృఢమైనది. info
التفاسير:

external-link copy
13 : 85

اِنَّهٗ هُوَ یُبْدِئُ وَیُعِیْدُ ۟ۚ

నిశ్చయంగా ఆయనే సృష్టిని మరియు శిక్షను ఆరంభించేవాడు మరియు వాటిని మరల ఉనికిలోకి తెచ్చేవాడు. info
التفاسير:

external-link copy
14 : 85

وَهُوَ الْغَفُوْرُ الْوَدُوْدُ ۟ۙ

మరియు ఆయనే తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడేవారి పాపములను మన్నించేవాడు. మరియు నిశ్చయంగా ఆయన దైవభీతిపరుల్లోంచి తన స్నేహితులను ఇష్టపడుతాడు. info
التفاسير:

external-link copy
15 : 85

ذُو الْعَرْشِ الْمَجِیْدُ ۟ۙ

సింహాసనము వాడు,గౌరవోన్నతుడు. info
التفاسير:

external-link copy
16 : 85

فَعَّالٌ لِّمَا یُرِیْدُ ۟ؕ

పాపముల నుండి తాను కోరిన మన్నింపును తాను తలచిన వారికి చేసేవాడును మరియు తాను తలచిన వారికి శిక్షించేవాడును. పరిశుద్ధుడైన ఆయనను బలవంతం చేసేవాడు ఎవడూ లేడు. info
التفاسير:

external-link copy
17 : 85

هَلْ اَتٰىكَ حَدِیْثُ الْجُنُوْدِ ۟ۙ

ఓ ప్రవక్తా సత్యముకి వ్యతిరేకముగా పోరాడటానికి మరియు దాని నుండి ఆపటానికి సైనికులను కూడబెట్టిన సైన్యాల సమాచారము మీ వద్దకు వచ్చినదా ? info
التفاسير:

external-link copy
18 : 85

فِرْعَوْنَ وَثَمُوْدَ ۟ؕ

ఫిర్ఔన్ మరియు సాలిహ్ అలైహిస్సలాం సహచరులైన సమూద్ వారి (సమాచారము) info
التفاسير:

external-link copy
19 : 85

بَلِ الَّذِیْنَ كَفَرُوْا فِیْ تَكْذِیْبٍ ۟ۙ

వీరందరిని విశ్వాసము నుండి వారందరి వద్దకు సత్యతిరస్కార సమాజముల సమాచారములు రాకపోవటం మరియు వారి వినాశనము నుండి సంభవించినది ఆటంకపరచలేదు కాని వారు తమ ప్రవక్త తమ వద్దకు తీసుకుని వచ్చిన దాన్ని తమ మనోవాంఛలను అనుసరిస్తూ తిరస్కరించేవారు. info
التفاسير:

external-link copy
20 : 85

وَّاللّٰهُ مِنْ وَّرَآىِٕهِمْ مُّحِیْطٌ ۟ۚ

మరియు అల్లాహ్ వారి కర్మలను చుట్టుముట్టేవాడును వాటిని లెక్కవేసేవాడును. ఆయన నుండి ఏదీ తప్పి పోదు. వాటి పరంగా ఆయన వారికి తొందరలోనే ప్రతిఫలం ప్రసాదిస్తాడు. info
التفاسير:

external-link copy
21 : 85

بَلْ هُوَ قُرْاٰنٌ مَّجِیْدٌ ۟ۙ

సత్యతిరస్కారులన్నట్లు ఖుర్ఆన్ కవిత్వము కాదు వ్యాకరణము కాదు. కాని అది దివ్యమైన ఖుర్ఆన్. info
التفاسير:

external-link copy
22 : 85

فِیْ لَوْحٍ مَّحْفُوْظٍ ۟۠

మార్పు చేర్పుల నుండి తరుగు పెరుగుల నుండి భద్రంగా లౌహె మహఫూజ్ లో ఉంది. info
التفاسير:
Dobitë e ajeteve të kësaj faqeje:
• يكون ابتلاء المؤمن على قدر إيمانه.
విశ్వాసపరునికి అతని విశ్వాస సామర్ధ్యమును బట్టి పరీక్ష ఉంటుంది. info

• إيثار سلامة الإيمان على سلامة الأبدان من علامات النجاة يوم القيامة.
శరీరాల భద్రతపై విశ్వాస భద్రతకు ప్రాధాన్యతనివ్వటం ప్రళయదినమున సాఫల్యమునకు సూచన. info

• التوبة بشروطها تهدم ما قبلها.
తౌబా దాని షరతుల ప్రకారం చేయటం దానికన్న మునుపటి వాటిని నాశనం చేస్తుంది. info