Vertaling van de betekenissen Edele Qur'an - Telugu-vertaling - Abdul Rahim bin Mohammed

Pagina nummer:close

external-link copy
38 : 4

وَالَّذِیْنَ یُنْفِقُوْنَ اَمْوَالَهُمْ رِئَآءَ النَّاسِ وَلَا یُؤْمِنُوْنَ بِاللّٰهِ وَلَا بِالْیَوْمِ الْاٰخِرِ ؕ— وَمَنْ یَّكُنِ الشَّیْطٰنُ لَهٗ قَرِیْنًا فَسَآءَ قَرِیْنًا ۟

మరియు వారికి, ఎవరైతే ప్రజలకు చూపటానికి తమ సంపదను ఖర్చుపెడతారో మరియు అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించరో! మరియు ఎవడైతే షైతాన్ ను తన స్నేహితునిగా (ఖరీనున్ గా) చేసుకుంటాడో![1] అతడు ఎంత నీచమైన స్నేహితుడు. info

[1] చూడండి, 2:268 మరియు 41:25.

التفاسير:

external-link copy
39 : 4

وَمَاذَا عَلَیْهِمْ لَوْ اٰمَنُوْا بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ وَاَنْفَقُوْا مِمَّا رَزَقَهُمُ اللّٰهُ ؕ— وَكَانَ اللّٰهُ بِهِمْ عَلِیْمًا ۟

మరియు వారు ఒకవేళ అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించి అల్లాహ్ వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఇతరులపై ఖర్చుచేసి ఉంటే వారికే మయ్యేది? మరియు అల్లాహ్ కు, వారిని గురించి బాగా తెలుసు. info
التفاسير:

external-link copy
40 : 4

اِنَّ اللّٰهَ لَا یَظْلِمُ مِثْقَالَ ذَرَّةٍ ۚ— وَاِنْ تَكُ حَسَنَةً یُّضٰعِفْهَا وَیُؤْتِ مِنْ لَّدُنْهُ اَجْرًا عَظِیْمًا ۟

నిశ్చయంగా, అల్లాహ్ ఎవరికీ రవ్వంత (పరమాణువంత) అన్యాయం కూడా చేయడు[1]. ఒక సత్కార్యముంటే ఆయన దానిని రెండింతలు చేస్తాడు; మరియు తన తరఫు నుండి గొప్ప ప్రతిఫలాన్ని కూడా ప్రసాదిస్తాడు. info

[1] చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 6, 'హదీస్' నం. 105.

التفاسير:

external-link copy
41 : 4

فَكَیْفَ اِذَا جِئْنَا مِنْ كُلِّ اُمَّةٍ بِشَهِیْدٍ وَّجِئْنَا بِكَ عَلٰی هٰۤؤُلَآءِ شَهِیْدًا ۟ؕؔ

మేము (ప్రతిఫల దినమున) ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని తెచ్చి మరియు (ఓ ప్రవక్తా!) నిన్ను వీరికి సాక్షిగా నిలబెట్టినప్పుడు ఎలా ఉంటుంది? info
التفاسير:

external-link copy
42 : 4

یَوْمَىِٕذٍ یَّوَدُّ الَّذِیْنَ كَفَرُوْا وَعَصَوُا الرَّسُوْلَ لَوْ تُسَوّٰی بِهِمُ الْاَرْضُ ؕ— وَلَا یَكْتُمُوْنَ اللّٰهَ حَدِیْثًا ۟۠

ఆ (ప్రతిఫల) దినమున, ప్రవక్త మాటను తిరస్కరించి, అతనికి అవిధేయత చూపిన వారంతా; తాము భూమిలో పూడ్చబడితే ఎంత బాగుండేదని కోరుతారు! కానీ, వారు అల్లాహ్ ముందు ఏ విషయాన్నీ దాచలేరు[1]. info

[1] చూడండి, 3:85.

التفاسير:

external-link copy
43 : 4

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَقْرَبُوا الصَّلٰوةَ وَاَنْتُمْ سُكٰرٰی حَتّٰی تَعْلَمُوْا مَا تَقُوْلُوْنَ وَلَا جُنُبًا اِلَّا عَابِرِیْ سَبِیْلٍ حَتّٰی تَغْتَسِلُوْا ؕ— وَاِنْ كُنْتُمْ مَّرْضٰۤی اَوْ عَلٰی سَفَرٍ اَوْ جَآءَ اَحَدٌ مِّنْكُمْ مِّنَ الْغَآىِٕطِ اَوْ لٰمَسْتُمُ النِّسَآءَ فَلَمْ تَجِدُوْا مَآءً فَتَیَمَّمُوْا صَعِیْدًا طَیِّبًا فَامْسَحُوْا بِوُجُوْهِكُمْ وَاَیْدِیْكُمْ ؕ— اِنَّ اللّٰهَ كَانَ عَفُوًّا غَفُوْرًا ۟

ఓ విశ్వాసులారా! మీరు మత్తులో ఉంటే[1], మీరు పలికేది గ్రహించనంత వరకు మరియు మీకు ఇంద్రియ స్ఖలనం (జునుబున్) అయి ఉంటే - స్నానం చేయనంత వరకు - నమాజ్ సమీపానికి వెళ్లకండి; కాని నడుస్తూ (మస్జిద్) నుండి దాట వలసి వస్తే తప్ప[2]. కాని ఒకవేళ మీరు రోగపీడితులై ఉంటే, లేదా ప్రయాణంలో ఉంటే, లేక మలమూత్రవిసర్జన చేసి ఉంటే, లేక స్త్రీలతో సంభోగం చేసి ఉంటే - మీకు నీళ్ళు దొరక్కపోతే - పరిశుద్ధమైన మట్టిని చేతులతో స్పర్శించి, ఆ చేతులతో మీ ముఖాలను మరియు మీ చేతులను, తుడుచుకోండి (తయమ్మమ్ చేయండి)[3]. నిశ్చయంగా అల్లాహ్ తప్పులను మన్నించేవాడు, క్షమించేవాడు. info

[1] ఇది మద్యపానానికి సంబంధించిన రెండవ ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ 2:219లో వచ్చింది. ఈ ఆజ్ఞ వచ్చినప్పుడు, ఇంకా మద్యపానాన్ని హరాం చేసిన ఆయతు (5:90) అవతరించబడలేదు. [2] అంటే మస్జిద్ నుండి దాటిపోతే ఎలాంటి పాపం లేదు. (ఇబ్నె-కసీ'ర్). ప్రయాణీకులను గురించిన ఆజ్ఞ ముందు వస్తోంది. [3] తయమ్మమ్ విధానం: ఒకసారి మీ అరచేతులతో పరిశుద్ధ భూమి (మట్టి)ని తాకండి. వాటితో ముఖాన్ని తుడుచుకోండి, తరువాత మీ రెండు చేతుల వెనుక భాగాలను మణికట్ల వరకు తుడుచుకోండి. (ముస్నద్ అ'హ్మద్ పుస్తకం - 4, పేజీ - 263. ఇంకా చూడండి, 5:6).

التفاسير:

external-link copy
44 : 4

اَلَمْ تَرَ اِلَی الَّذِیْنَ اُوْتُوْا نَصِیْبًا مِّنَ الْكِتٰبِ یَشْتَرُوْنَ الضَّلٰلَةَ وَیُرِیْدُوْنَ اَنْ تَضِلُّوا السَّبِیْلَ ۟ؕ

ఏమీ? గ్రంథజ్ఞానంలో కొంతభాగం ఇవ్వబడిన వారిని గురించి నీకు తెలియదా (చూడలేదా)? వారు మార్గభ్రష్టత్వాన్ని కొనుక్కుంటున్నారు మరియు మీరు కూడా సన్మార్గం నుండి తప్పిపోవాలని కోరుతున్నారు. info
التفاسير: