Vertaling van de betekenissen Edele Qur'an - De Telugu-vertaling van de tafsir-samenvatting van de Heilige Koran.

external-link copy
104 : 4

وَلَا تَهِنُوْا فِی ابْتِغَآءِ الْقَوْمِ ؕ— اِنْ تَكُوْنُوْا تَاْلَمُوْنَ فَاِنَّهُمْ یَاْلَمُوْنَ كَمَا تَاْلَمُوْنَ ۚ— وَتَرْجُوْنَ مِنَ اللّٰهِ مَا لَا یَرْجُوْنَ ؕ— وَكَانَ اللّٰهُ عَلِیْمًا حَكِیْمًا ۟۠

ఓ విశ్వాసపరులారా మీరు అవిశ్వాసపరుల్లోంచి మీ శతృవులను వెంబడించటంలో బలహీనపడకండి మరియు బద్దకించకండి. ఒక వేళ హతమార్చటం వలన,గాయపర్చటం వలన మీకు ఏదైతే సంభవించినదో దాని వలన మీరు బాధపడితే మీరు బాధపడినట్లే వారు అదే విధంగా బాధపడ్డారు. మీకు సంభవించినదే వారికీ సంభవించినది. కావున వారి సహనం మీ సహనం కన్నా గొప్పది కాకూడదు. ఎందుకంటే మీరు అల్లాహ్ నుండి వారు ఆశించని పుణ్యమును,సహాయమును,మద్దతును ఆశిస్తున్నారు. మరియు అల్లాహ్ తన దాసుల స్థితిగతులను తెలుసుకునేవాడు, తన కార్యనిర్వహణలో,తన ధర్మశాసనంలో వివేకవంతుడు. info
التفاسير:
Voordelen van de verzen op deze pagina:
• استحباب صلاة الخوف وبيان أحكامها وصفتها.
భయాందోళనల వేళ నమాజు (సలాతుల్ ఖౌఫ్) యొక్క ధర్మబద్ధత మరియు దాని ఆదేశముల,దాని లక్షణముల ప్రకటన. info

• الأمر بالأخذ بالأسباب في كل الأحوال، وأن المؤمن لا يعذر في تركها حتى لو كان في عبادة.
అన్ని సంధర్భముల్లో కారకాలను ఎంచుకునే ఆదేశం. మరియు విశ్వాసపరుడు ఆరాధనలో ఉన్నా కూడా వాటిని వదిలే విషయంలో అనుమతి లేదు. info

• مشروعية دوام ذكر الله تعالى على كل حال، فهو حياة القلوب وسبب طمأنينتها.
అన్ని సంధర్భముల్లో అల్లాహ్ స్మరణను శాశ్వతం చేయటం యొక్క ధర్మబద్ధత. ఇది హృదయముల జీవితం మరియు వాటి మనశ్శాంతికి కారణం. info

• النهي عن الضعف والكسل في حال قتال العدو، والأمر بالصبر على قتاله.
శతృవులతో పోరాడే సమయంలో బలహీనత నుండి,బద్దకం వహించటం నుండి వారింపు. మరియు వారితో పోరాడే వేళ సహనం చూపే ఆదేశం. info