Traduzione dei Significati del Sacro Corano - Traduzione in telugu - Abdul Rahim Bin Muhammed

Numero di pagina:close

external-link copy
20 : 47

وَیَقُوْلُ الَّذِیْنَ اٰمَنُوْا لَوْلَا نُزِّلَتْ سُوْرَةٌ ۚ— فَاِذَاۤ اُنْزِلَتْ سُوْرَةٌ مُّحْكَمَةٌ وَّذُكِرَ فِیْهَا الْقِتَالُ ۙ— رَاَیْتَ الَّذِیْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ یَّنْظُرُوْنَ اِلَیْكَ نَظَرَ الْمَغْشِیِّ عَلَیْهِ مِنَ الْمَوْتِ ؕ— فَاَوْلٰى لَهُمْ ۟ۚ

మరియు విశ్వసించిన వారు ఇలా అంటున్నారు: "(యుద్ధం చేయమని ఆదేశిస్తూ) ఒక సూరహ్ ఎందుకు అవతరింప జేయబడలేదు?"[1] కాని ఇప్పుడు యుద్ధం చేయమని నిర్దేశిస్తూ ఒక సూరహ్ అవతరింప జేయబడితే తమ హృదయాలలో వ్యాధి ఉన్నవారు, మరణం ఆవహించిన వారి వలే నీ వైపునకు చూడటాన్ని, నీవు గమనిస్తావు.[2] కాని అది వారికే మేలైనదై ఉండేది. info

[1] ఈ సూరహ్ 22:39 కంటే ముందు అవతరింపజేయబడింది.
[2] చూడండి, 4:77 ఇటువంటి వాక్యానికి.

التفاسير:

external-link copy
21 : 47

طَاعَةٌ وَّقَوْلٌ مَّعْرُوْفٌ ۫— فَاِذَا عَزَمَ الْاَمْرُ ۫— فَلَوْ صَدَقُوا اللّٰهَ لَكَانَ خَیْرًا لَّهُمْ ۟ۚ

ఆజ్ఞాపాలన చేయటం మరియు మంచి మాటలు పలుకటం. ఒకవేళ (జిహాద్ కొరకు) దృఢమైన నిర్ణయం తీసుకోబడినప్పుడు, వారు అల్లాహ్ విషయంలో సత్యవంతులుగా ఉన్నట్లయితే వారికే మేలు జరిగేది. info
التفاسير:

external-link copy
22 : 47

فَهَلْ عَسَیْتُمْ اِنْ تَوَلَّیْتُمْ اَنْ تُفْسِدُوْا فِی الْاَرْضِ وَتُقَطِّعُوْۤا اَرْحَامَكُمْ ۟

(వారితో ఇలా అను): "ఏమీ? మీరు (అల్లాహ్) ఆజ్ఞాపాలనకు విముఖులై, మరల భూమిలో సంక్షోభం రేకెత్తిస్తూ మీ బంధుత్వాలను తెంపుకుంటారా?" info
التفاسير:

external-link copy
23 : 47

اُولٰٓىِٕكَ الَّذِیْنَ لَعَنَهُمُ اللّٰهُ فَاَصَمَّهُمْ وَاَعْمٰۤی اَبْصَارَهُمْ ۟

ఇలాంటి వారినే అల్లాహ్ శపించాడు (బహిష్కరించాడు). వారిని చెవిటి వారిగా చేశాడు మరియు వారి కండ్లను గ్రుడ్డి చేశాడు. info
التفاسير:

external-link copy
24 : 47

اَفَلَا یَتَدَبَّرُوْنَ الْقُرْاٰنَ اَمْ عَلٰی قُلُوْبٍ اَقْفَالُهَا ۟

వారు ఈ ఖుర్ఆన్ ను గురించి యోచించరా? లేదా వారి హృదయాల మీద తాళాలు పడి వున్నాయా? info
التفاسير:

external-link copy
25 : 47

اِنَّ الَّذِیْنَ ارْتَدُّوْا عَلٰۤی اَدْبَارِهِمْ مِّنْ بَعْدِ مَا تَبَیَّنَ لَهُمُ الْهُدَی ۙ— الشَّیْطٰنُ سَوَّلَ لَهُمْ ؕ— وَاَمْلٰی لَهُمْ ۟

మార్గదర్శకత్వం స్పష్టమైన తర్వాత కూడా, ఎవరైతే తమ వీపులు త్రిప్పుకొని మరలి పోయారో! నిశ్చయంగా, షైతాన్ (వారి చేష్టలను) వారికి మంచివిగా చూపాడు మరియు (అల్లాహ్) వారికి వ్యవధినిచ్చాడు. info
التفاسير:

external-link copy
26 : 47

ذٰلِكَ بِاَنَّهُمْ قَالُوْا لِلَّذِیْنَ كَرِهُوْا مَا نَزَّلَ اللّٰهُ سَنُطِیْعُكُمْ فِیْ بَعْضِ الْاَمْرِ ۚ— وَاللّٰهُ یَعْلَمُ اِسْرَارَهُمْ ۟

ఇది ఎందుకంటే వాస్తవానికి వారు, అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకునే వారితో ఇలా అన్నందుకు: "మేము కొన్ని విషయాలలో మిమ్మల్ని అనుసరిస్తాము." మరియు అల్లాహ్ కు వారి రహస్య సమాలోచనలను గురించి బాగా తెలుసు.[1] info

[1] చూడండి, 4:81.

التفاسير:

external-link copy
27 : 47

فَكَیْفَ اِذَا تَوَفَّتْهُمُ الْمَلٰٓىِٕكَةُ یَضْرِبُوْنَ وُجُوْهَهُمْ وَاَدْبَارَهُمْ ۟

అయితే దేవదూతలు వారి ఆత్మలను వశపరచుకొని, వారి ముఖాల మీద మరియు వీపుల మీద కొడుతూ వారిని తీసుకు వెళ్ళేటప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది?[1] info

[1] చూడండి, 6:93 మరియు 8:50.

التفاسير:

external-link copy
28 : 47

ذٰلِكَ بِاَنَّهُمُ اتَّبَعُوْا مَاۤ اَسْخَطَ اللّٰهَ وَكَرِهُوْا رِضْوَانَهٗ فَاَحْبَطَ اَعْمَالَهُمْ ۟۠

ఇది వాస్తవానికి, వారు అల్లాహ్ కు ఆగ్రహం కలిగించే విధానాన్ని అనుసరించి నందుకు మరియు ఆయన సమ్మతించే మార్గాన్ని అసహ్యించుకున్నందుకు! కావున ఆయన వారి కర్మలను వృథా చేశాడు. info
التفاسير:

external-link copy
29 : 47

اَمْ حَسِبَ الَّذِیْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ اَنْ لَّنْ یُّخْرِجَ اللّٰهُ اَضْغَانَهُمْ ۟

ఏమీ? తమ హృదయాలలో వ్యాధి ఉన్నవారు, అల్లాహ్ వారి ద్వేషాన్ని బయట పెట్టడని భావిస్తున్నారా?[1] info

[1] అ'ద్'గానున్: 'ది'గ్ నున్ యొక్క బహువచనం. ద్వేషం, పగ, అసహ్యం, ఏవగింపు.

التفاسير: