Traduzione dei Significati del Sacro Corano - Traduzione in telugu - Abdul Rahim Bin Muhammed

ముహమ్మద్

external-link copy
1 : 47

اَلَّذِیْنَ كَفَرُوْا وَصَدُّوْا عَنْ سَبِیْلِ اللّٰهِ اَضَلَّ اَعْمَالَهُمْ ۟

ఎవరైతే సత్యాన్ని తిరస్కరించి (ఇతరులను) అల్లాహ్ మార్గం నుండి నిరోధించారో, వారి కర్మలను ఆయన (అల్లాహ్) నిష్ఫలం చేశాడు. info
التفاسير:

external-link copy
2 : 47

وَالَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ وَاٰمَنُوْا بِمَا نُزِّلَ عَلٰی مُحَمَّدٍ وَّهُوَ الْحَقُّ مِنْ رَّبِّهِمْ ۙ— كَفَّرَ عَنْهُمْ سَیِّاٰتِهِمْ وَاَصْلَحَ بَالَهُمْ ۟

మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తూ - ముహమ్మద్ మీద అవతరింప జేయబడిన దానిని - తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యమని నమ్మారో! వారి పాపాలను ఆయన తుడిచి వేశాడు మరియు వారి స్థితిని బాగు పరిచాడు. info
التفاسير:

external-link copy
3 : 47

ذٰلِكَ بِاَنَّ الَّذِیْنَ كَفَرُوا اتَّبَعُوا الْبَاطِلَ وَاَنَّ الَّذِیْنَ اٰمَنُوا اتَّبَعُوا الْحَقَّ مِنْ رَّبِّهِمْ ؕ— كَذٰلِكَ یَضْرِبُ اللّٰهُ لِلنَّاسِ اَمْثَالَهُمْ ۟

ఇలా ఎందుకు జరిగిందంటే! వాస్తవానికి అవిశ్వాసులు అసత్యాన్ని అనుసరించారు మరియు విశ్వసించినవారు తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యాన్ని అనుసరించారు. ఈ విధంగా అల్లాహ్! ప్రజలకు ఉదాహరణల ద్వారా (వారి స్థానం) తెలియజేస్తున్నాడు. info
التفاسير:

external-link copy
4 : 47

فَاِذَا لَقِیْتُمُ الَّذِیْنَ كَفَرُوْا فَضَرْبَ الرِّقَابِ ؕ— حَتّٰۤی اِذَاۤ اَثْخَنْتُمُوْهُمْ فَشُدُّوا الْوَثَاقَ ۙ— فَاِمَّا مَنًّا بَعْدُ وَاِمَّا فِدَآءً حَتّٰی تَضَعَ الْحَرْبُ اَوْزَارَهَا— ذٰلِكَ ۛؕ— وَلَوْ یَشَآءُ اللّٰهُ لَانْتَصَرَ مِنْهُمْ ۙ— وَلٰكِنْ لِّیَبْلُوَاۡ بَعْضَكُمْ بِبَعْضٍ ؕ— وَالَّذِیْنَ قُتِلُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ فَلَنْ یُّضِلَّ اَعْمَالَهُمْ ۟

కావున మీరు సత్యతిరస్కారులను (యుద్ధంలో) ఎదుర్కొన్నప్పుడు,[1] వారిపై ప్రాబల్యం పొందే వరకు, వారి మెడలపై కొట్టండి. ఆ తరువాత వారిని గట్టిగా బంధించండి, (యుద్ధం ముగిసిన) తరువాత వారిని కనికరించి వదలి పెట్టండి,[2] లేదా పరిహార ధనం తీసుకొని వదలి పెట్టండి. (మీతో) యుద్ధం చేసేవారు తమ ఆయుధాలను పడవేసే వరకు (వారితో పోరాడండి). ఇది మీరు చేయవలసిన పని. అల్లాహ్ తలుచుకుంటే ఆయన వారికి ప్రతీకారం చేసేవాడు, కాని మిమ్మల్ని ఒకరి ద్వారా మరొకరిని పరీక్షించటానికి (ఆయన ఇలా చేశాడు). మరియు ఎవరైతే అల్లాహ్ మార్గంలో చంపబడ్డారో, అలాంటి వారి కర్మలను ఆయన వ్యర్థం చేయడు. info

[1] ప్రతి మానవునికి తనకు నచ్చిన ధర్మాన్ని అనుసరించే హక్కు ఉంది. ధర్మ విషయంలో బలవంతం లేదు, చూడండి, 2:256. కావున ఎవరైనా మీ ఇస్లాం ధర్మపాలన కారణంగా మీపై దౌర్జన్యాలు చేస్తే! మీరు ఇస్లాంపై నడవకుండా మీ స్వాతంత్ర్యాన్ని భంగపరిస్తే, వారితో మీ మానప్రాణాల రక్షణ మరియు మీ ఇస్లాం ధర్మ రక్షణకై, వారిని పూర్తిగా అణగద్రొక్కే వరకు, లేదా వారిని ఖైదీలుగా చేసుకునే వరకు, వారితో భయంకరంగా పోరాడమే జిహాద్. వారిపై ప్రాబల్యం వహించిన తరువాత వారిని బంధించండి. యుద్ధం ముగిసిన తరువాత వారిలో మంచితనం చూస్తే వారిని కనికరించి, లేదా పరిహారం తీసుకొని వదలండి. చూడండి, 2:190-191. ఇంకా చూడండి జిహాద్ ను గురించి అవతరింపజేయబడిన మొట్టమొదటి ఆయత్ లకు 22:39-40.
[2] పరిహారధనానికి బదులుగా యుద్ధఖైదీలను పరస్పరం మార్పిడి కూడా చేసుకోవచ్చు.

التفاسير:

external-link copy
5 : 47

سَیَهْدِیْهِمْ وَیُصْلِحُ بَالَهُمْ ۟ۚ

ఆయన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు మరియు వారి స్థితిని చక్కబరుస్తాడు. info
التفاسير:

external-link copy
6 : 47

وَیُدْخِلُهُمُ الْجَنَّةَ عَرَّفَهَا لَهُمْ ۟

మరియు వారికి తెలియజేసి యున్న, స్వర్గంలోకి వారిని ప్రవేశింపజేస్తాడు. info
التفاسير:

external-link copy
7 : 47

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِنْ تَنْصُرُوا اللّٰهَ یَنْصُرْكُمْ وَیُثَبِّتْ اَقْدَامَكُمْ ۟

ఓ విశ్వాసులారా! ఒకవేళ మీరు అల్లాహ్ కు (ఆయన మార్గంలో) సహాయపడితే, ఆయన మీకు సహాయం చేస్తాడు మరియు మీ పాదాలను స్థిరపరుస్తాడు.[1] info

[1] చూడండి, 22:40.

التفاسير:

external-link copy
8 : 47

وَالَّذِیْنَ كَفَرُوْا فَتَعْسًا لَّهُمْ وَاَضَلَّ اَعْمَالَهُمْ ۟

ఇకపోతే సత్యాన్ని తిరస్కరించిన వారికి వినాశం తప్పదు. మరియు (అల్లాహ్) వారి కర్మలు వ్యర్థం చేస్తాడు. info
التفاسير:

external-link copy
9 : 47

ذٰلِكَ بِاَنَّهُمْ كَرِهُوْا مَاۤ اَنْزَلَ اللّٰهُ فَاَحْبَطَ اَعْمَالَهُمْ ۟

ఇది ఎందుకంటే వాస్తవానికి, వారు అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకున్నారు. కాబట్టి ఆయన వారి కర్మలను విఫలం చేశాడు.[1] info

[1] కర్మలంటే ఇక్కడ సత్యతిరస్కారుల సత్కర్మలు విఫలమవుతాయి. వీశ్వాసం లేనిదే ఎన్ని పుణ్యకార్యాలు చేసినా అవి విఫలమే అవుతాయి. పరలోకంలో వాటికి ఎలాంటి మంచి ఫలితం దొరకదు. సత్యతిరస్కారుల గమ్యస్థానం నరకమే.

التفاسير:

external-link copy
10 : 47

اَفَلَمْ یَسِیْرُوْا فِی الْاَرْضِ فَیَنْظُرُوْا كَیْفَ كَانَ عَاقِبَةُ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ ؕ— دَمَّرَ اللّٰهُ عَلَیْهِمْ ؗ— وَلِلْكٰفِرِیْنَ اَمْثَالُهَا ۟

ఏమీ? వారు భూమిలో సంచరించి చూడలేదా? వారికి పూర్వం గతించిన వారి పర్యవసానం ఏమయిందో? అల్లాహ్ వారిని నిర్మూలించాడు. మరియు సత్యతిరస్కారులకు అలాంటి గతే పట్టబోతోంది.[1] info

[1] చూడండి, 6:10.

التفاسير:

external-link copy
11 : 47

ذٰلِكَ بِاَنَّ اللّٰهَ مَوْلَی الَّذِیْنَ اٰمَنُوْا وَاَنَّ الْكٰفِرِیْنَ لَا مَوْلٰی لَهُمْ ۟۠

ఇది ఎందుకంటే! నిశ్చయంగా, విశ్వసించిన వారి సంరక్షకుడు అల్లాహ్! మరియు నిశ్చయంగా, సత్యతిరస్కారులకు సంరక్షకుడు ఎవ్వడూ లేడు.[1] info

[1] ఉ'హుద్ యుద్ధంలో మక్కా ముష్రిక్ లు తమకు కొంత ప్రాబల్యం దొరికినందుకు: 'అ'అలు హుబల్' - హుబల్ కు జై! అంటే! విశ్వాసులు: 'అల్లాహు అ'అలావ అజల్లు' - అల్లాహ్ మహోన్నతుడు, గొప్పస్థానం గలవాడు. అని అన్నారు. మరియు ముష్రికులు: 'లనల్'ఉ'జ్జా వలా 'ఉ'జ్జాలకుమ్' - 'ఉ'జ్జా మాతోపాటు ఉన్నాడు, 'ఉ'జ్జా మీతో లేడు. అని, అంటే! ముస్లింలు: 'అల్లాహు మౌలానా వలా మౌలా లకుమ్' - అల్లాహ్ (సు.తా.) మా సంరక్షకుడు, మీ సంరక్షకుడు ఎవ్వడూ లేడు! అని అన్నారు. ('స.బు'ఖారీ)

التفاسير: