Fassarar Ma'anonin Alqura'ni - Fassara a yaren Teluguwanci- Abdul-Rahim ibnu Muhammad

Lambar shafi:close

external-link copy
78 : 5

لُعِنَ الَّذِیْنَ كَفَرُوْا مِنْ بَنِیْۤ اِسْرَآءِیْلَ عَلٰی لِسَانِ دَاوٗدَ وَعِیْسَی ابْنِ مَرْیَمَ ؕ— ذٰلِكَ بِمَا عَصَوْا وَّكَانُوْا یَعْتَدُوْنَ ۟

ఇస్రాయీల్ సంతతి వారిలో అవిశ్వాస మార్గం అవలంబించిన వారు, దావూద్ మరియు మర్యమ్ కుమారుడైన ఈసా (ఏసు) నాలుకతో (నోటితో) శపించబడ్డారు.[1] ఇది వారు అవిధేయులై హద్దులు మీరి ప్రవర్తించిన దాని ఫలితం. info

[1] వారు శపించబడిన వాక్యాలకు చూడండి, కీర్తనలు - (Pslams), 78:21-22, 31-33. మత్తయి - (Mathew), 12:34, 23:33-35.

التفاسير:

external-link copy
79 : 5

كَانُوْا لَا یَتَنَاهَوْنَ عَنْ مُّنْكَرٍ فَعَلُوْهُ ؕ— لَبِئْسَ مَا كَانُوْا یَفْعَلُوْنَ ۟

వారు, తాము చేసే, అసభ్యకరమైన కార్యాల నుండి ఒకరినొకరు నిరోధించు కోలేదు. వారు చేసే పనులన్నీ ఎంతో నీచమైనవి. info
التفاسير:

external-link copy
80 : 5

تَرٰی كَثِیْرًا مِّنْهُمْ یَتَوَلَّوْنَ الَّذِیْنَ كَفَرُوْا ؕ— لَبِئْسَ مَا قَدَّمَتْ لَهُمْ اَنْفُسُهُمْ اَنْ سَخِطَ اللّٰهُ عَلَیْهِمْ وَفِی الْعَذَابِ هُمْ خٰلِدُوْنَ ۟

వారిలో అనేకులు సత్యతిరస్కారులతో మైత్రి చేసుకోవటాన్ని, నీవు చూస్తున్నావు. వారు తమ కొరకు ముందుగా చేసి పంపుకున్న నీచ కర్మల వలన అల్లాహ్ కు వారిపై కోపం కలిగింది మరియు వారు నరకబాధలో శాశ్వతంగా ఉంటారు. info
التفاسير:

external-link copy
81 : 5

وَلَوْ كَانُوْا یُؤْمِنُوْنَ بِاللّٰهِ وَالنَّبِیِّ وَمَاۤ اُنْزِلَ اِلَیْهِ مَا اتَّخَذُوْهُمْ اَوْلِیَآءَ وَلٰكِنَّ كَثِیْرًا مِّنْهُمْ فٰسِقُوْنَ ۟

ఒకవేళ వారు అల్లాహ్ నూ, ప్రవక్తనూ మరియు అతనిపై అవతరింపజేయబడిన దానిని (నిజంగానే) విశ్వసించి ఉంటే! వారిని (సత్యతిరస్కారులను0 తమ మిత్రులుగా చేసుకొని ఉండేవారు కాదు, కాని వారిలో అనేకులు అవిధేయులున్నారు. info
التفاسير:

external-link copy
82 : 5

لَتَجِدَنَّ اَشَدَّ النَّاسِ عَدَاوَةً لِّلَّذِیْنَ اٰمَنُوا الْیَهُوْدَ وَالَّذِیْنَ اَشْرَكُوْا ۚ— وَلَتَجِدَنَّ اَقْرَبَهُمْ مَّوَدَّةً لِّلَّذِیْنَ اٰمَنُوا الَّذِیْنَ قَالُوْۤا اِنَّا نَصٰرٰی ؕ— ذٰلِكَ بِاَنَّ مِنْهُمْ قِسِّیْسِیْنَ وَرُهْبَانًا وَّاَنَّهُمْ لَا یَسْتَكْبِرُوْنَ ۟

నిశ్చయంగా, విశ్వాసుల పట్ల (ముస్లింల పట్ల) విరోధ విషయంలో నీవు యూదులను మరియు బహుదైవారాధకును (ముష్రికీన్ లను), అందరి కంటే కఠినులుగా కనుగొంటావు. మరియు విశ్వాసుల పట్ల మైత్రి విషయంలో: "నిశ్చయంగా, మేము క్రైస్తవులము." అని , అన్న వారిని అత్యంత సన్నిహితులుగా పొందుతావు. ఇది ఎందుకంటే వారిలో మతగురువులు /విద్వాంసులు (ఖిస్సీసీన్) మరియు మునులు (రుహ్ బాన్) ఉన్నారు మరియు నిశ్చయంగా, వారు గర్వించరు. info
التفاسير:

external-link copy
83 : 5

وَاِذَا سَمِعُوْا مَاۤ اُنْزِلَ اِلَی الرَّسُوْلِ تَرٰۤی اَعْیُنَهُمْ تَفِیْضُ مِنَ الدَّمْعِ مِمَّا عَرَفُوْا مِنَ الْحَقِّ ۚ— یَقُوْلُوْنَ رَبَّنَاۤ اٰمَنَّا فَاكْتُبْنَا مَعَ الشّٰهِدِیْنَ ۟

మరియు వారు (కొందరు క్రైస్తవులు) ప్రవక్తపై అవతరింపజేయబడిన దానిని (ఈ గ్రంథాన్ని) విన్నప్పుడు, సత్యాన్ని తెలుసు కున్నందుకు, వారి కళ్ళ నుండి కన్నీళ్ళు కారటం నీవు చూస్తావు.[1] వారు ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! మేము విశ్వసించాము. కావున మమ్మల్ని సాక్ష్యం ఇచ్చే వారిలో వ్రాసుకో! info

[1] చూడండి, 3:199. ఇథియోపియా ('హబష) రాజు - జాఫర్ ('రది.'అ.) నుండి - సూరహ్ మర్యమ్ (19), విని కన్నీళ్ళు కార్చాడు. అతడు (ర'ది.'అ) ఇస్లాం స్వీకరించాడు. దానికి ఈ 'హదీస్' సాక్ష్యం: 'హబష రాజు మరణించినపుడు దైవప్రవక్త ('స'అస) సహారాలో తమ అనుచరులతో సహా గాయబానా నమా'జే జనా'జా చేశారు. ('స. బు'ఖారీ, 'స. ముస్లిం).

التفاسير: