Fassarar Ma'anonin Alqura'ni - Fassara a yaren Teluguwanci- Abdul-Rahim ibnu Muhammad

external-link copy
13 : 42

شَرَعَ لَكُمْ مِّنَ الدِّیْنِ مَا وَصّٰی بِهٖ نُوْحًا وَّالَّذِیْۤ اَوْحَیْنَاۤ اِلَیْكَ وَمَا وَصَّیْنَا بِهٖۤ اِبْرٰهِیْمَ وَمُوْسٰی وَعِیْسٰۤی اَنْ اَقِیْمُوا الدِّیْنَ وَلَا تَتَفَرَّقُوْا فِیْهِ ؕ— كَبُرَ عَلَی الْمُشْرِكِیْنَ مَا تَدْعُوْهُمْ اِلَیْهِ ؕ— اَللّٰهُ یَجْتَبِیْۤ اِلَیْهِ مَنْ یَّشَآءُ وَیَهْدِیْۤ اِلَیْهِ مَنْ یُّنِیْبُ ۟ؕ

ఆయన, నూహ్ కు విధించిన (ఇస్లాం) ధర్మాన్నే, మీ కొరకు శాసించాడు; మరియు దానినే (ఓ ముహమ్మద్!) మేము నీకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేశాము; మరియు మేము దానినే ఇబ్రాహీమ్, మూసా మరియు ఈసాలకు కూడా విధిగా చేశాము. ఈ ధర్మాన్నే స్థాపించాలని [1] మరియు దానిని గురించి భేదాభిప్రాయాలకు గురి కాకుండా ఉండాలని. నీవు దాని వైపునకు పిలిచేది బహుదైవారాధకులకు ఎంతో సహింపలేనిదిగా ఉంది. అల్లాహ్ తాను కోరిన వానిని తన వైపునకు ఆకర్షిస్తాడు మరియు పశ్చాత్తాపంతో తన వైపునకు మరలేవానికి మార్గదర్శకత్వం చేస్తాడు. [2] info

[1] అద్దీను: ధర్మం అంటే అల్లాహ్ (సు.తా.) ను విశ్వసించి ఆయన అద్వితీయాన్ని నమ్మి, ఆయన ప్రవక్తలను అనుసరించి, ఆయన షరీయత్ పై నడవటం. ప్రవక్తలందరి ధర్మం ఇదే! చూడండి, 2:213. కాని వారి షరీయత్ లలో కొన్ని భేదాలుండవచ్చు. (చూడండి, 5:48) అందుకే దైవప్రవక్త ('స'అస) అన్నారు : 'మేము (ప్రవక్తలం) అంతా సోదరులం. మా అందరి ధర్మం ఒక్కటే ఇస్లాం!' ('స'హీ'హ్ బు'ఖారీ)
[2] అల్లాహ్ (సు.తా.) అతనికే మార్గదర్శకత్వం చేస్తాడు, ఎవడైతే స్వయంగా, అల్లాహ్ (సు.తా.) వైపునకు మరలుతాడో ! ఇక ఎవడైతే మార్గభ్రష్టత్వాన్ని ఎన్నుకుంటాడో, ఆయన, అతనిని దానిలో వదలుతాడు. అల్లాహ్ (సు.తా.) దృష్టిలో, ఆయనకు విధేయత (ఇస్లాం) మాత్రమే నిజమైన ధర్మం. చూడండి, 3:19, 3:85, 21:92 చూడండి, 23:52.

التفاسير: