Fassarar Ma'anonin Alqura'ni - Fassara a yaren Teluguwanci- Abdul-Rahim ibnu Muhammad

external-link copy
24 : 4

وَّالْمُحْصَنٰتُ مِنَ النِّسَآءِ اِلَّا مَا مَلَكَتْ اَیْمَانُكُمْ ۚ— كِتٰبَ اللّٰهِ عَلَیْكُمْ ۚ— وَاُحِلَّ لَكُمْ مَّا وَرَآءَ ذٰلِكُمْ اَنْ تَبْتَغُوْا بِاَمْوَالِكُمْ مُّحْصِنِیْنَ غَیْرَ مُسٰفِحِیْنَ ؕ— فَمَا اسْتَمْتَعْتُمْ بِهٖ مِنْهُنَّ فَاٰتُوْهُنَّ اُجُوْرَهُنَّ فَرِیْضَةً ؕ— وَلَا جُنَاحَ عَلَیْكُمْ فِیْمَا تَرٰضَیْتُمْ بِهٖ مِنْ بَعْدِ الْفَرِیْضَةِ ؕ— اِنَّ اللّٰهَ كَانَ عَلِیْمًا حَكِیْمًا ۟

మరియు ఇతరుల వివాహబంధంలో ఉన్న స్త్రీలు - (ధర్మయుద్ధంలో) మీ చేతికి చిక్కిన బానిస స్త్రీలు తప్ప- (మీరు వివాహమాడటానికి నిషేధించబడ్డారు). ఇది అల్లాహ్ మీకు విధించిన అనుశాసనం. మరియు వీరు తప్ప మిగతా స్త్రీలంతా మీకు వివాహమాడటానికి ధర్మసమ్మతం చేయబడ్డారు. మీరు వారికి తగిన స్త్రీశుల్కం (మహ్ర్) ఇచ్చి వ్యభిచారంగా కాకుండా వివాహబంధంలో తీసుకోవటానికి కోరవచ్చు. కావున మీరు దాంపత్య సుఖాన్ని అనుభవించాలనుకున్న వారికి, వారి స్త్రీశుల్కం (మహ్ర్) విధిగా చెల్లించండి. కాని స్త్రీ శుల్కం (మహ్ర్) ఒప్పందం జరిగిన తరువాత పరస్పర అంగీకారంతో మీ మధ్య ఏమైనా రాజీ కుదిరితే, అందులో దోషం లేదు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు. info
التفاسير: