Fassarar Ma'anonin Alqura'ni - Fassara a yaren Teluguwanci- Abdul-Rahim ibnu Muhammad

Lambar shafi:close

external-link copy
6 : 28

وَنُمَكِّنَ لَهُمْ فِی الْاَرْضِ وَنُرِیَ فِرْعَوْنَ وَهَامٰنَ وَجُنُوْدَهُمَا مِنْهُمْ مَّا كَانُوْا یَحْذَرُوْنَ ۟

మరియు (ఇస్రాయీల్ సంతతి) వారికి భూమిలో అధికారం ఒసంగాలనీ[1] మరియు ఫిర్ఔన్, హామాన్[2] మరియు వారి సైనికులకు - దేనిని గురించైతే (ఫిర్ఔన్ జాతి) వారు భయపడుతూ ఉండేవారో[3] - అదే వారికి చూపాలని! info

[1] ఇక్కడ అ'ర్దున్, భూమి అంటే కనాన్ (షామ్).
[2] హామాన్, ఫిర్'ఔన్ యొక్క ముఖ్య నాయకుడు. చూడండి, 40:36-37.
[3] అంటే, ఇస్రాయీ'ల్ సంతతివారి ద్వారా తమ నాశనం కావచ్చనే ఏ భయం వల్లనైతే ఫిర్'ఔన్ జాతి వారు ఇస్రాయీ'ల్ సంతతివారి మగ సంతానాన్ని హత్య చేస్తూ ఉండేవారో - దానినే వారికి సత్యం చేసి చూపటానికి.

التفاسير:

external-link copy
7 : 28

وَاَوْحَیْنَاۤ اِلٰۤی اُمِّ مُوْسٰۤی اَنْ اَرْضِعِیْهِ ۚ— فَاِذَا خِفْتِ عَلَیْهِ فَاَلْقِیْهِ فِی الْیَمِّ وَلَا تَخَافِیْ وَلَا تَحْزَنِیْ ۚ— اِنَّا رَآدُّوْهُ اِلَیْكِ وَجَاعِلُوْهُ مِنَ الْمُرْسَلِیْنَ ۟

మేము మూసా తల్లి మనస్సులో ఇలా[1] సూచించాము: "నీవు అతనికి (మూసాకు) పాలు ఇస్తూ ఉండు. కాని అతనికి ప్రమాదమున్నదని, నీవు భావిస్తే అతనిని నదిలో విడిచి పెట్టు[2]. మరియు నీవు భయపడకు మరియు దుఃఖించకు; నిశ్చయంగా మేము అతనిని నీ వద్దకు తిరిగి చేర్చుతాము. మరియు అతనిని (మా) సందేశహరులలో ఒకనిగా చేస్తాము!" info

[1] వ'హీ: అంటే ఇక్కడ ఆమె మనస్సులో ఆలోచన పుట్టించడం.
[2] చూడండి, 20:39.

التفاسير:

external-link copy
8 : 28

فَالْتَقَطَهٗۤ اٰلُ فِرْعَوْنَ لِیَكُوْنَ لَهُمْ عَدُوًّا وَّحَزَنًا ؕ— اِنَّ فِرْعَوْنَ وَهَامٰنَ وَجُنُوْدَهُمَا كَانُوْا خٰطِـِٕیْنَ ۟

తరువాత ఫిర్ఔన్ కుటుంబంవారు[1] - తమకు శత్రువై, దుఃఖకారణుడవటానికి - అతనిని ఎత్తుకున్నారు. నిశ్చయంగా ఫిర్ఔన్, హామాన్ మరియు వారి సైనికులు పాపిష్ఠులు! info

[1] అంటే ఫిర్'ఔన్ భార్య. ఇంకా చూడండి, 66:11.

التفاسير:

external-link copy
9 : 28

وَقَالَتِ امْرَاَتُ فِرْعَوْنَ قُرَّتُ عَیْنٍ لِّیْ وَلَكَ ؕ— لَا تَقْتُلُوْهُ ۖۗ— عَسٰۤی اَنْ یَّنْفَعَنَاۤ اَوْ نَتَّخِذَهٗ وَلَدًا وَّهُمْ لَا یَشْعُرُوْنَ ۟

మరియు ఫిర్ఔన్ భార్య (అతనితో) ఇలా అన్నది: "ఇతను నీకూ మరియు నాకూ కంటి చలువ! ఇతనిని చంపకు, బహుశా ఇతడు మనకు ఉపయోగకారి కావచ్చు![1] లేదా మనం ఇతనిని కుమారునిగా చేసుకోవచ్చు!" కాని వారు (వాస్తవాన్ని) తెలుసుకోలేక పోయారు. info

[1] వారికి సంతానం లేనందుకు ఆమె అతనిని ('అ.స.ను) కుమారునిగా చేసుకోదలచింది.

التفاسير:

external-link copy
10 : 28

وَاَصْبَحَ فُؤَادُ اُمِّ مُوْسٰی فٰرِغًا ؕ— اِنْ كَادَتْ لَتُبْدِیْ بِهٖ لَوْلَاۤ اَنْ رَّبَطْنَا عَلٰی قَلْبِهَا لِتَكُوْنَ مِنَ الْمُؤْمِنِیْنَ ۟

మరియు మూసా తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. ఆమె విశ్వసించినవారిలో ఉండటానికి మేము, ఆమె హృదయాన్ని దృఢపరచి ఉండకపోతే, ఆమె అతనిని (మూసాను) గురించి అంతా బట్టబయలు చేసి ఉండేది. info
التفاسير:

external-link copy
11 : 28

وَقَالَتْ لِاُخْتِهٖ قُصِّیْهِ ؗ— فَبَصُرَتْ بِهٖ عَنْ جُنُبٍ وَّهُمْ لَا یَشْعُرُوْنَ ۟ۙ

ఆమె, అతని (మూసా) సోదరితో[1] అన్నది: "అతని వెంట వెళ్ళు." కావున ఆమె దూరం నుండియే అతనిని గమనించసాగింది. కానీ, వారది గ్రహించలేక పోయారు. info

[1] మూసా('అ.స.) సోదరీమణి పేరు మర్యమ్ బిన్తె 'ఇమ్రాన్ మరియు 'ఈసా ('అ.స.) తల్లిపేరు కూడా మర్యమ్ బిన్తె 'ఇమ్రాన్.

التفاسير:

external-link copy
12 : 28

وَحَرَّمْنَا عَلَیْهِ الْمَرَاضِعَ مِنْ قَبْلُ فَقَالَتْ هَلْ اَدُلُّكُمْ عَلٰۤی اَهْلِ بَیْتٍ یَّكْفُلُوْنَهٗ لَكُمْ وَهُمْ لَهٗ نٰصِحُوْنَ ۟

మరియు మేము అతనిని (ఇతరుల) పాలు త్రాగకుండా మొదటనే నిషేధించి ఉన్నాము. (అతని సోదరి) వారితో అన్నది: "మీ కొరకు అతనిని (పాలిచ్చి) పోషించగల ఒక కుటుంబం వారిని నేను మీకు చూపనా? మరియు వారు అతనిని మంచిగా చూసుకునే వారై ఉంటారు." info
التفاسير:

external-link copy
13 : 28

فَرَدَدْنٰهُ اِلٰۤی اُمِّهٖ كَیْ تَقَرَّ عَیْنُهَا وَلَا تَحْزَنَ وَلِتَعْلَمَ اَنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ وَّلٰكِنَّ اَكْثَرَهُمْ لَا یَعْلَمُوْنَ ۟۠

ఈ విధంగా మేము అతనిని (మూసాను) - అతని తల్లి కళ్ళు చల్లబడటానికి, ఆమె దుఃఖించకుండా ఉండటానికి మరియు అల్లాహ్ వాగ్దానం సత్యమైనదని ఆమె తెలుసుకోవటానికి - తిరిగి ఆమె వద్దకు చేర్చాము. కాని వాస్తవానికి చాలా మందికి ఇది తెలియదు. info
التفاسير: