Fassarar Ma'anonin Alqura'ni - Fassara a yaren Teluguwanci- Abdul-Rahim ibnu Muhammad

Lambar shafi:close

external-link copy
70 : 12

فَلَمَّا جَهَّزَهُمْ بِجَهَازِهِمْ جَعَلَ السِّقَایَةَ فِیْ رَحْلِ اَخِیْهِ ثُمَّ اَذَّنَ مُؤَذِّنٌ اَیَّتُهَا الْعِیْرُ اِنَّكُمْ لَسٰرِقُوْنَ ۟

వారికి వారి సామగ్రి సిద్ధపరచిన తరువాత తన సోదరుని జీను సంచిలో ఒక నీరు త్రాగే పాత్రను[1] పెట్టాడు. ఆ పిదప ఒక ప్రకటించేవాడు ఇలా ప్రకటించాడు: "ఓ బిడారు వారలారా! మీరు నిశ్చయంగా దొంగలు!" info

[1] ఆ నీరు త్రాగే కప్పు వెండిది లేక బంగారుది.

التفاسير:

external-link copy
71 : 12

قَالُوْا وَاَقْبَلُوْا عَلَیْهِمْ مَّاذَا تَفْقِدُوْنَ ۟

వారు (యూసుఫ్ సోదరులు) వారి వైపు తిరిగి ఇలా అన్నారు: "మీ వస్తువు ఏదైనా పోయిందా?" info
التفاسير:

external-link copy
72 : 12

قَالُوْا نَفْقِدُ صُوَاعَ الْمَلِكِ وَلِمَنْ جَآءَ بِهٖ حِمْلُ بَعِیْرٍ وَّاَنَا بِهٖ زَعِیْمٌ ۟

(కార్యకర్తలు) అన్నారు: "రాజు గారి పాత్రపోయింది! మరియు ఎవడు దానిని తీసుకొని వస్తాడో అతనికి ఒక ఒంటె బరువు ధాన్యం (బహుమానంగా) ఇవ్వబడుతుంది మరియు నేను దానికి బాధ్యుణ్ణి." info
التفاسير:

external-link copy
73 : 12

قَالُوْا تَاللّٰهِ لَقَدْ عَلِمْتُمْ مَّا جِئْنَا لِنُفْسِدَ فِی الْاَرْضِ وَمَا كُنَّا سٰرِقِیْنَ ۟

(యూసుఫ్ సోదరులు) అన్నారు: "అల్లాహ్ సాక్షి! మీకు బాగా తెలుసు. మేము మీ దేశంలో సంక్షోభం రేకెత్తించటానికి రాలేదు మరియు మేము దొంగలము కాము!" info
التفاسير:

external-link copy
74 : 12

قَالُوْا فَمَا جَزَآؤُهٗۤ اِنْ كُنْتُمْ كٰذِبِیْنَ ۟

(కార్యకర్తలు) అన్నారు: "మీరు అబద్ధమాడుతున్నారని తెలిస్తే దానికి శిక్ష ఏమిటి?" info
التفاسير:

external-link copy
75 : 12

قَالُوْا جَزَآؤُهٗ مَنْ وُّجِدَ فِیْ رَحْلِهٖ فَهُوَ جَزَآؤُهٗ ؕ— كَذٰلِكَ نَجْزِی الظّٰلِمِیْنَ ۟

వారు (యూసుఫ్ సోదరులు) జవాబిచ్చారు: "ఎవడి సంచిలో ఆ పాత్ర దొరకుతుందో అతడు దానికి పరిహారంగా (బానిసగా) ఉండాలి. మేము ఇదే విధంగా దుర్మార్గులను శిక్షిస్తాము."[1] info

[1] య'అఖూబ్ ('అ.స.) షరీయత్ లో, దొంగతనం చేసినవాడు, పట్టుబడిన తరువాత దొంగిలించబడిన సరుకు యజమాని దగ్గర బానిసగా ఉండాలి. కావున వారు కూడా ఆ శిక్షనే ప్రతిపాదించారు.

التفاسير:

external-link copy
76 : 12

فَبَدَاَ بِاَوْعِیَتِهِمْ قَبْلَ وِعَآءِ اَخِیْهِ ثُمَّ اسْتَخْرَجَهَا مِنْ وِّعَآءِ اَخِیْهِ ؕ— كَذٰلِكَ كِدْنَا لِیُوْسُفَ ؕ— مَا كَانَ لِیَاْخُذَ اَخَاهُ فِیْ دِیْنِ الْمَلِكِ اِلَّاۤ اَنْ یَّشَآءَ اللّٰهُ ؕ— نَرْفَعُ دَرَجٰتٍ مَّنْ نَّشَآءُ ؕ— وَفَوْقَ كُلِّ ذِیْ عِلْمٍ عَلِیْمٌ ۟

అప్పుడతడు తన సోదరుని మూట వెదికే ముందు, వారి (సవతి సోదరుల) మూటలను వెతకటం ప్రారంభించాడు. చివరకు తన సోదరుని మూట నుండి దానిని (పాత్రను) బయటికి తీశాడు. ఈ విధంగా మేము యూసుఫ్ కొరకు యుక్తి చూపాము. ఈ విధంగా - అల్లాహ్ ఇచ్ఛయే లేకుంటే - అతను తన సోదరురుణ్ణి, రాజధర్మం ప్రకారం పొందలేక పోయే వాడు.[1] మేము కోరిన వారి స్థానాలను పెంచుతాము. మరియు జ్ఞానులందరినీ మించిన జ్ఞాని ఒకడు (అల్లాహ్) ఉన్నాడు. info

[1] ఈజిప్టు రాజ్యధర్మం ప్రకారం యూసుఫ్ ('అ.స.) దొంగగా నిరూపించబడినా (బెన్యామీన్ ను) పొందలేక పోయేవారు. కావున అతను, తన మారు సోదరులను మొదటనే ప్రశ్నించి దొందతనం చేసినవారి విషయంలో వారి అభిప్రాయాన్ని తీసుకున్నారు.

التفاسير:

external-link copy
77 : 12

قَالُوْۤا اِنْ یَّسْرِقْ فَقَدْ سَرَقَ اَخٌ لَّهٗ مِنْ قَبْلُ ۚ— فَاَسَرَّهَا یُوْسُفُ فِیْ نَفْسِهٖ وَلَمْ یُبْدِهَا لَهُمْ ۚ— قَالَ اَنْتُمْ شَرٌّ مَّكَانًا ۚ— وَاللّٰهُ اَعْلَمُ بِمَا تَصِفُوْنَ ۟

(అతని సోదరులన్నారు): "ఇతడు దొంగతనం చేసినా (ఆశ్చర్యం లేదు)! వాస్తవానికి ఇతని సోదరుడు కూడా ఇంతకు ముందు దొంగతనం చేశాడు." ఇది విని యూసుఫ్ (కోపాన్ని) తన హృదయంలోనే దాచుకున్నాడు మరియు దానిని వారిపై వ్యక్త పరచలేదు. (తన మనస్సులో) అనుకున్నాడు: "మీరు చాలా నీచమైన వారు మరియు మీరు పలికేది అల్లాహ్ కు బాగా తెలుసు!" info
التفاسير:

external-link copy
78 : 12

قَالُوْا یٰۤاَیُّهَا الْعَزِیْزُ اِنَّ لَهٗۤ اَبًا شَیْخًا كَبِیْرًا فَخُذْ اَحَدَنَا مَكَانَهٗ ۚ— اِنَّا نَرٰىكَ مِنَ الْمُحْسِنِیْنَ ۟

వారన్నారు: "ఓ సర్దార్ (అజీజ్) వాస్తవానికి, ఇతని తండ్రి చాలా ముసలివాడు, కావున ఇతనికి బదులుగా నీవు మాలో ఒకనిని ఉంచుకో. వాస్తవానికి, మేము నిన్ను మేలు చేసేవానిగా చూస్తున్నాము." info
التفاسير: