Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa.

external-link copy
20 : 3

فَاِنْ حَآجُّوْكَ فَقُلْ اَسْلَمْتُ وَجْهِیَ لِلّٰهِ وَمَنِ اتَّبَعَنِ ؕ— وَقُلْ لِّلَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ وَالْاُمِّیّٖنَ ءَاَسْلَمْتُمْ ؕ— فَاِنْ اَسْلَمُوْا فَقَدِ اهْتَدَوْا ۚ— وَاِنْ تَوَلَّوْا فَاِنَّمَا عَلَیْكَ الْبَلٰغُ ؕ— وَاللّٰهُ بَصِیْرٌ بِالْعِبَادِ ۟۠

ఓ ప్రవక్తా! మీపై అవతరింపజేయబడిన సత్యసందేశంపై ఒకవేళ వారు మీతో వాదనలకు దిగితే, వారికి ఇలా జవాబివ్వండి “నేను మరియు నన్ను అనుసరించే విశ్వాసులు అల్లాహ్ కు సమర్పించుకున్నాము”. అలాగే ఓ ప్రవక్తా! గ్రంథప్రజలతో మరియు విగ్రహారాధకులతో ఇలా ప్రశ్నించండి, “నేను తెచ్చినదాన్ని (దివ్యసందేశాన్ని) అనుసరిస్తూ, మనస్పూర్తిగా మీరు అల్లాహ్ కు సమర్పించుకుంటారా ?” ఒకవేళ వారు అల్లాహ్ కు సమర్పించుకుని, మీ షరిఅహ్ (పవిత్ర ధర్మశాసనం) చట్టాన్ని అనుసరిస్తే, వారు సన్మార్గంపై ఉన్నట్లే. ఒకవేళ వారు ఇస్లాం నుండి మరలిపోతే, మీ బాధ్యత కేవలం వారికి మీ సందేశాన్ని అందజేయడం వరకే. అలాంటి వారి గురించి అల్లాహ్ నిర్ణయిస్తాడు. ఆయన తన దాసులను జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు మరియు వారి పనులకు బదులుగా ఆయన వారికి తగిన ప్రతిఫలం ప్రసాదిస్తాడు. info
التفاسير:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• من أعظم ما يُكفِّر الذنوب ويقي عذاب النار الإيمان بالله تعالى واتباع ما جاء به الرسول صلى الله عليه وسلم.
పాపాలను తుడిచి పెట్టే మరియు నరకాగ్ని శిక్షల నుండి కాపాడే అత్యంత గొప్ప విషయం ఏమిటంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను విశ్వసించడం మరియు ప్రవక్త తీసుకు వచ్చిన దానిని అనుసరించడం. info

• أعظم شهادة وحقيقة هي ألوهية الله تعالى ولهذا شهد الله بها لنفسه، وشهد بها ملائكته، وشهد بها أولو العلم ممن خلق.
అత్యంత గొప్పదైన మరియు వాస్తవమైన సాక్ష్యము ఏదంటే కేవలం అల్లాహ్ మాత్రమే సకల ఆరాధనలకు అర్హుడు. అందువలన అల్లాహ్ స్వయంగా దీనిపై సాక్ష్యం ఇస్తున్నాడు. అంతేగాక ఆయన యొక్క దైవదూతలు మరియు జ్ఞానులు కూడా దీనిపై సాక్ష్యం ఇస్తున్నారు. info

• البغي والحسد من أعظم أسباب النزاع والصرف عن الحق.
తిరుగుబాటు మరియు అసూయ అనేవి సంఘర్షణకు దారి తీస్తాయి మరియు సత్యం నుండి దూరం చేసి పరధ్యానానికి గురి చేస్తాయి. info