Fassarar Ma'anonin Alqura'ni - Fassarar Taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa.

Lambar shafi:close

external-link copy
44 : 24

یُقَلِّبُ اللّٰهُ الَّیْلَ وَالنَّهَارَ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَعِبْرَةً لِّاُولِی الْاَبْصَارِ ۟

అల్లాహ్ రేయింబవళ్ళ మధ్య పెద్దవవటంలో,పొట్టిదవటంలో మరియు రావటం,పోవటంలో మారుస్తున్నాడు. నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన సూచనలలో నుంచి రుబూబియత్ యొక్క ఆధారాలలో అల్లాహ్ సామర్ధ్యంపై,ఆయన ఏకత్వంపై అంతర్దృష్టి కలవారికి హితోపదేశం ఉన్నది. info
التفاسير:

external-link copy
45 : 24

وَاللّٰهُ خَلَقَ كُلَّ دَآبَّةٍ مِّنْ مَّآءٍ ۚ— فَمِنْهُمْ مَّنْ یَّمْشِیْ عَلٰی بَطْنِهٖ ۚ— وَمِنْهُمْ مَّنْ یَّمْشِیْ عَلٰی رِجْلَیْنِ ۚ— وَمِنْهُمْ مَّنْ یَّمْشِیْ عَلٰۤی اَرْبَعٍ ؕ— یَخْلُقُ اللّٰهُ مَا یَشَآءُ ؕ— اِنَّ اللّٰهَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟

మరియు అల్లాహ్ జంతువుల్లోంచి భూ ఉపరితలంపై ప్రాకే ప్రతీ దాన్ని నీటి బిందువుతో సృష్టించాడు. వాటిలో నుండి తమ పొట్టపై ప్రాకుతూ నడిచే పాములు లాంటివి ఉన్నవి. మరియు వాటిలో నుండి రెండుకాళ్ళపై నడిచే మనుషులు,పక్షులు లాంటివి ఉన్నవి. మరియు వాటిలో నుండి నాలుగు కాళ్ళపై నడిచే పశువులు లాంటివి ఉన్నవి. అల్లాహ్ తాను ప్రస్తావించిన వాటిని,ప్రస్తావించని వాటిలో నుంచి తాను కోరిన వాటిని సృష్టిస్తాడు. నిశ్ఛయంగా అల్లాహ్ ప్రతీది చేసే సమర్ధుడు. ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు. info
التفاسير:

external-link copy
46 : 24

لَقَدْ اَنْزَلْنَاۤ اٰیٰتٍ مُّبَیِّنٰتٍ ؕ— وَاللّٰهُ یَهْدِیْ مَنْ یَّشَآءُ اِلٰی صِرَاطٍ مُّسْتَقِیْمٍ ۟

నిశ్ఛయంగా మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఎటువంటి సందేహం లేని స్పష్టమైన ఆయతులను అవతరింపజేశాము. అల్లాహ్ తాను తలచిన వారికి ఎటువంటి వంకరతనం లేని సన్మార్గము వైపునకు సౌభాగ్యమును కలిగింపజేస్తాడు. ఆ మార్గము అతన్ని స్వర్గము వైపునకు తీసుకుని పోతుంది. info
التفاسير:

external-link copy
47 : 24

وَیَقُوْلُوْنَ اٰمَنَّا بِاللّٰهِ وَبِالرَّسُوْلِ وَاَطَعْنَا ثُمَّ یَتَوَلّٰی فَرِیْقٌ مِّنْهُمْ مِّنْ بَعْدِ ذٰلِكَ ؕ— وَمَاۤ اُولٰٓىِٕكَ بِالْمُؤْمِنِیْنَ ۟

మరియు కపటులు ఇలా పలికారు : మేము అల్లాహ్ ను విశ్వసించాము మరియు దైవ ప్రవక్తను విశ్వసించాము. మరియు అల్లాహ్ పై విధేయత చూపాము మరియు ఆయన ప్రవక్తపై విధేయత చూపాము. ఆ తరువాత వారిలో నుండి ఒక వర్గము ముఖము చాటేసింది. వారు అల్లాహ్ పై,ఆయన ప్రవక్త పై విశ్వాసము గురించి,వారి పట్ల విధేయత గురించి వాదించిన తరువాత వారు అల్లాహ్ మార్గంలో ధర్మ పోరాటం ఆదేశం విషయంలో,ఇతరవాటిలో అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై విధేయత చూపలేదు. మరియు అల్లాహ్,ఆయన ప్రవక్త పై విధేయత నుండి విముఖత చూపే వీరందరు ఒక వేళ వారు విశ్వాసపరులని వాదించినా వారు విశ్వాసపరులు కారు. info
التفاسير:

external-link copy
48 : 24

وَاِذَا دُعُوْۤا اِلَی اللّٰهِ وَرَسُوْلِهٖ لِیَحْكُمَ بَیْنَهُمْ اِذَا فَرِیْقٌ مِّنْهُمْ مُّعْرِضُوْنَ ۟

ఈ కపటులందరు అల్లాహ్ వైపునకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపునకు వారు తగాదా పడుతున్న దాని విషయంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీర్పునివ్వటానికి పిలవబడినప్పుడు వారు తమ కపటత్వం వలన ఆయన తీర్పు నుండి విముఖత చూపేవారు. info
التفاسير:

external-link copy
49 : 24

وَاِنْ یَّكُنْ لَّهُمُ الْحَقُّ یَاْتُوْۤا اِلَیْهِ مُذْعِنِیْنَ ۟ؕ

ఒక వేళ హక్కు తమదే అని,ఆయన తమకు అనుకూలంగా తీర్పునిస్తారని వారికి తెలిస్తే వారు ఆయన వద్దకు లొంగిపోతూ,అణకువను చూపుతూ వస్తారు. info
التفاسير:

external-link copy
50 : 24

اَفِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ اَمِ ارْتَابُوْۤا اَمْ یَخَافُوْنَ اَنْ یَّحِیْفَ اللّٰهُ عَلَیْهِمْ وَرَسُوْلُهٗ ؕ— بَلْ اُولٰٓىِٕكَ هُمُ الظّٰلِمُوْنَ ۟۠

ఏమీ వీరందరి హృదయములలో ఏదైన రోగం వాటిని అంటిపెట్టుకుని ఉన్నదా ? లేదా వారు ఆయన అల్లాహ్ ప్రవక్త అన్న విషయంలో సందేహపడుతున్నారా ? లేదా తీర్పు విషయంలో అల్లాహ్,ఆయన ప్రవక్త వారికి అన్యాయం చేస్తారని భయపడుతున్నారా ? .ఈ ప్రస్తావించబడినది ఏదీ కాదు. కాని అతని తీర్పు నుండి వారి విముఖత,అతని పట్ల వారి మొండితనం వలన వారి మనస్సులలో ఉన్న రోగం వలన ఇది. info
التفاسير:

external-link copy
51 : 24

اِنَّمَا كَانَ قَوْلَ الْمُؤْمِنِیْنَ اِذَا دُعُوْۤا اِلَی اللّٰهِ وَرَسُوْلِهٖ لِیَحْكُمَ بَیْنَهُمْ اَنْ یَّقُوْلُوْا سَمِعْنَا وَاَطَعْنَا ؕ— وَاُولٰٓىِٕكَ هُمُ الْمُفْلِحُوْنَ ۟

విశ్వసించిన వారిని వారి మధ్య తీర్పునివ్వటం కొరకు అల్లాహ్ వైపునకు,దైవ ప్రవక్త వైపునకు పిలిచినప్పుడు వారి మాటలు ఇలా ఉంటాయి : మేము ఆయన మాటను విన్నాము మరియు ఆయన ఆదేశమునకు కట్టుబడి ఉన్నాము. ఈ గుణాలతో వర్ణించబడిన వారు ఇహ,పరాలలో సాఫల్యం చెందుతారు. info
التفاسير:

external-link copy
52 : 24

وَمَنْ یُّطِعِ اللّٰهَ وَرَسُوْلَهٗ وَیَخْشَ اللّٰهَ وَیَتَّقْهِ فَاُولٰٓىِٕكَ هُمُ الْفَآىِٕزُوْنَ ۟

మరియు ఎవరైతే అల్లాహ్ కు విధేయత చూపుతాడో,ఆయన ప్రవక్తకు విధేయత చూపుతాడో మరియు వారిద్దరి ఆదేశమునకు లొంగిపోతాడో,తనను పాప కార్యాల వద్దకు తీసుకుని వెళ్ళే వాటితో భయపడతాడో ఆయన ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి భయపడుతూ అల్లాహ్ యొక్క శిక్ష నుండి భయపడతాడో వారందరు మాత్రమే ఇహ,పరాల మంచితో సాఫల్యం చెందుతారు. info
التفاسير:

external-link copy
53 : 24

وَاَقْسَمُوْا بِاللّٰهِ جَهْدَ اَیْمَانِهِمْ لَىِٕنْ اَمَرْتَهُمْ لَیَخْرُجُنَّ ؕ— قُلْ لَّا تُقْسِمُوْا ۚ— طَاعَةٌ مَّعْرُوْفَةٌ ؕ— اِنَّ اللّٰهَ خَبِیْرٌ بِمَا تَعْمَلُوْنَ ۟

కపట విశ్వాసులు ఒక వేళ మీరు వారిని ధర్మ పోరాటం కొరకు బయలదేరమని ఆదేశిస్తే వారు తప్పకుండా బయలుదేరుతారని అల్లాహ్ పై తమ శక్తిమేరకు అంతం వరకు ప్రమాణం చేసేవారు. ఓ ప్రవక్తా మీరు వారితో అనండి : మీరు ప్రమాణాలు చేయకండి, మీ అబద్దము చెప్పటం తెలుసు. మీరు ఆరోపిస్తున్న మీ విధేయతా తెలుసు. మీరు చేస్తున్న వాటి గురించి అల్లాహ్ కు తెలుసు. మీరు మీ కర్మల్లోంచి ఏది దాచినా ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. info
التفاسير:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• تنوّع المخلوقات دليل على قدرة الله.
సృష్టితాల యొక్క వైవిధ్యం అల్లాహ్ సామర్ధ్యమునకు ఆధారం. info

• من صفات المنافقين الإعراض عن حكم الله إلا إن كان الحكم في صالحهم، ومن صفاتهم مرض القلب والشك، وسوء الظن بالله.
తీర్పు తమకు అనుకూలంగా ఉంటే తప్ప అల్లాహ్ తీర్పు నుండి విముఖత చూపటం కపట విశ్వాసుల లక్షణాల్లోంచిది,ఇంకా వారి లక్షణాల్లోంచి హృదయ రోగము, సందేహము,అల్లాహ్ పై అప నమ్మకము. info

• طاعة الله ورسوله والخوف من الله من أسباب الفوز في الدارين.
అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై విధేయత మరియు అల్లాహ్ నుండి భయపడటం రెండు నివాసాల్లో (ఇహపరాల్లో) సాఫల్యమునకు కారణాల్లోంచివి. info

• الحلف على الكذب سلوك معروف عند المنافقين.
అబద్దపు ప్రమాణం చేయటం కపటవాదులలో బాగా తెలిసిన ప్రవర్తన. info