Traduction des sens du Noble Coran - La traduction en télougou - 'Abd Ar-Rahîm ibn Muhammad

Numéro de la page:close

external-link copy
107 : 9

وَالَّذِیْنَ اتَّخَذُوْا مَسْجِدًا ضِرَارًا وَّكُفْرًا وَّتَفْرِیْقًا بَیْنَ الْمُؤْمِنِیْنَ وَاِرْصَادًا لِّمَنْ حَارَبَ اللّٰهَ وَرَسُوْلَهٗ مِنْ قَبْلُ ؕ— وَلَیَحْلِفُنَّ اِنْ اَرَدْنَاۤ اِلَّا الْحُسْنٰی ؕ— وَاللّٰهُ یَشْهَدُ اِنَّهُمْ لَكٰذِبُوْنَ ۟

మరియు (కపట విశ్వాసులలో) కొందరు (విశ్వాసులకు) హాని కలిగించటానికి, సత్యతిరస్కార వైఖరిని (బలపరచటానికి) మరియు విశ్వాసులను విడదీయటానికి, అల్లాహ్ మరియు ఆయన సందేశహరునితో ఇంతకు ముందు పోరాడిన వారు పొంచి ఉండటానికి, ఒక మస్జిద్ నిర్మించారు. మరియు వారు: "మా ఉద్దేశం మేలు చేయటం తప్ప మరేమీ కాదు!" అని గట్టి ప్రమాణాలు కూడా చేస్తున్నారు.[1] కాని వారు వాస్తవంగా అసత్యవాదులని అల్లాహ్ సాక్ష్యమిస్తున్నాడు. info

[1] 'ఖ'జరజ్ తెగకు చెందిన ఒక మదీనా వాసుడు అబూ'ఆమిర్ క్రైస్తవుడవుతాడు. అతడు 3వ హిజ్రీలో జరిగిన ఉహుద్ యుద్ధంలో మక్కా ఖురైషులకు సహాయపడి, ఆ యుద్ధం తరువాత సిరియాకు పారిపోతాడు. అతుడ బైజాన్ టైన్ చక్రవర్తి హిరాక్లియస్ ను మదీనా పై దండయాత్ర చేయటానికి ప్రోత్సహిస్తాడు. మదీనాపై వారు రాకూడదని దైవప్రవక్త ('స'అస) వారిని ఎధుర్కొనటానికి తబూక్ కు బయలుదేరే సమయంలో అతడి అనుచరులు వచ్చి: "మేము మదీనా-ఖుబాల మధ్య ఒక మస్జిద్ నిర్మించాము. మీరు వచ్చి అందులో నమా'జ్ చేయించండి." అని కోరుతారు. దైవప్రవక్త ('స'అస): "తబూక్ నుండి వచ్చిన తరువాత వస్తాను." అని అంటారు. ఆ సందర్భంలో తబూక్ నుండి తిరిగి వచ్చిన తరువాత ఈ ఆయత్ లు అవతరింపజేయబడ్డాయి. దైవప్రవక్త ('స'అస) తరువాత దానిని పడగొట్టిస్తారు. ఎందుకంటే ఆ మస్జిద్ నిర్మాణ లక్ష్యం విశ్వాసుల మధ్య భేదభావాలు పుట్టించడే ఉండెను.

التفاسير:

external-link copy
108 : 9

لَا تَقُمْ فِیْهِ اَبَدًا ؕ— لَمَسْجِدٌ اُسِّسَ عَلَی التَّقْوٰی مِنْ اَوَّلِ یَوْمٍ اَحَقُّ اَنْ تَقُوْمَ فِیْهِ ؕ— فِیْهِ رِجَالٌ یُّحِبُّوْنَ اَنْ یَّتَطَهَّرُوْا ؕ— وَاللّٰهُ یُحِبُّ الْمُطَّهِّرِیْنَ ۟

నీవెన్నడూ దానిలో (నమాజ్ కు) నిలబడకు. మొదటి రోజు నుండియే దైవభీతి ఆధారంగా స్థాపించబడిన మస్జిదే నీకు (నమాజ్ కు) నిలబడటానికి తగినది. అందులో పరిశుద్ధులు కాగోరేవారున్నారు. మరియు అల్లాహ్ పరిశుద్ధులు కాగోరేవారిని ప్రేమిస్తాడు. info
التفاسير:

external-link copy
109 : 9

اَفَمَنْ اَسَّسَ بُنْیَانَهٗ عَلٰی تَقْوٰی مِنَ اللّٰهِ وَرِضْوَانٍ خَیْرٌ اَمْ مَّنْ اَسَّسَ بُنْیَانَهٗ عَلٰی شَفَا جُرُفٍ هَارٍ فَانْهَارَ بِهٖ فِیْ نَارِ جَهَنَّمَ ؕ— وَاللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الظّٰلِمِیْنَ ۟

ఏమీ? ఎవడైతే అల్లాహ్ యందు గల భయభక్తులు మరియు ఆయన ప్రీతి, పునాదుల మీద తన (మస్జిద్) కట్టడాన్ని కట్టాడో, అతడు శ్రేష్ఠుడా? లేక, తన కట్టడపు పునాదులను, వరదలకు కూలిపోయి దాని క్రింది భాగం ఖాళీగా ఉన్న నది ఒడ్డున కట్టేవాడా? అది వానితో సహా నరకాగ్నిలోకి కొట్టుకొని పోతుంది. మరియు అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు. info
التفاسير:

external-link copy
110 : 9

لَا یَزَالُ بُنْیَانُهُمُ الَّذِیْ بَنَوْا رِیْبَةً فِیْ قُلُوْبِهِمْ اِلَّاۤ اَنْ تَقَطَّعَ قُلُوْبُهُمْ ؕ— وَاللّٰهُ عَلِیْمٌ حَكِیْمٌ ۟۠

వారి హృదయాలు ముక్కలైపోయి (వారు చనిపోయి) నంత వరకు, వారు కట్టిన కట్టడం వారి హృదయాలలో కలతలు పుట్టిస్తూ ఉంటుంది. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు. info
التفاسير:

external-link copy
111 : 9

اِنَّ اللّٰهَ اشْتَرٰی مِنَ الْمُؤْمِنِیْنَ اَنْفُسَهُمْ وَاَمْوَالَهُمْ بِاَنَّ لَهُمُ الْجَنَّةَ ؕ— یُقَاتِلُوْنَ فِیْ سَبِیْلِ اللّٰهِ فَیَقْتُلُوْنَ وَیُقْتَلُوْنَ ۫— وَعْدًا عَلَیْهِ حَقًّا فِی التَّوْرٰىةِ وَالْاِنْجِیْلِ وَالْقُرْاٰنِ ؕ— وَمَنْ اَوْفٰی بِعَهْدِهٖ مِنَ اللّٰهِ فَاسْتَبْشِرُوْا بِبَیْعِكُمُ الَّذِیْ بَایَعْتُمْ بِهٖ ؕ— وَذٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِیْمُ ۟

నిశ్చయంగా, అల్లాహ్ విశ్వాసుల నుండి వారి ప్రాణాలను వారి సంపదలను కొన్నాడు. కాబట్టి నిశ్చయంగా, వారి కొరకు స్వర్గముంది. వారు అల్లాహ్ మార్గంలో పోరాడి (తమ శత్రువులను) చంపుతారు మరియు చంపబడతారు. మరియు ఇది తౌరాత్, ఇంజీల్ మరియు ఖుర్ఆన్ లలో, ఆయన (అల్లాహ్) చేసిన వాగ్దానం, సత్యమైనది. మరియు తన వాగ్దానాన్ని నెరవేర్చటంలో అల్లాహ్ ను మించిన వాడు ఎవడు? కావున మీరు ఆయనతో చేసిన వ్యాపారానికి సంతోషపడండి. మరియు ఇదే ఆ గొప్ప విజయం.[1] info

[1] చూడండి, 'స. బు'ఖారీ, పు-4, 'హ. 352, పు-5, 'హ 377, మరియు పు-3, 'హ 3462.

التفاسير: