[1] 'మీరు ఒక పెద్ద ఉద్యోగి దగ్గరికి పోవాలంటే మొదట అతని సెక్రేటరీ ద్వారా సమయం తీసుకోవలసి ఉంటుంది. అదే విధంగా అల్లాహుతా'ఆలా వద్దకు చేరటానికి సిఫారసు కావాలి.' అని కొందరు, అల్లాహ్ (సు.తా.) కు బదులుగా ఇతరులను వేడుకునేవారు వాదిస్తారు. వారు తప్పు దారిలో ఉన్నారు. ఇక్కడ అల్లాహ్ (సు.తా.) అంటున్నాడు: 'మీరు ఆయనను ఇతరులతో పోల్చకండి. ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు,' అని. అల్లాహుతా'ఆసా ఏకైకుడు, సర్వసమర్థుడు అంతా ఎరుగువాడు. ఆయన ప్రసన్నతను పొందటానికి, ఆయన (సు.తా.) ప్రవక్తల ద్వారా చూపిన మార్గం (సత్యధర్మమైన ఇస్లాం) మీద నడిచి, సత్కార్యాలు చేయటమే చాలు. చూడండి, 10:3.
[1] సమానుడు కాజాలడు అని అర్థం.
[1] నా దాసుడు నా సాన్నిహిత్యాన్ని పొందటానికి నేను అతనికి విధి ఫ'ర్దగా చేసిన వాటిపై అమలు చేస్తాడు. ఆ తరువాత నవాఫిల్ ద్వారా కూడా మరింత నా సాన్నిహిత్యాన్ని పొందటానికి ప్రయత్నిస్తాడు. మరియు నేను అతనిని ప్రేమిస్తాను. నేను అతనిని ప్రేమించినపుడు నేను అతని చెవి అవుతాను దానితో అతడు వింటాడు. అతని కన్ను అవుతాను దానితో అతడు చూస్తాడు, అతని చేయి అవుతాను దానితో అతడు పట్టుకుంటాడు, కాలు అవుతాను దానితో అతడు నడుస్తాడు మరియు అతడు నన్ను అడిగిన దానిని నేను అతనికి ఇస్తాను. నన్ను శరణు వేడుకుంటే, నేను శరణు ఇస్తాను. ('స.బు'ఖారీ, కితాబ్ అర్రిఖాఖ్). దీనిని తప్పుగా అర్థం చేసుకోరాదు. ఏ మానవుడైతే తన ఆరాధన మరియు విధేయతలో కేవలం అల్లాహ్ (సు.తా.) నే ప్రత్యేకించుకుంటాడో అతడు అల్లాహ్ (సు.తా.)కు ఇష్టం లేనటువంటిది ఏదీ వినడు, చూడడు, చేయడు మరియు పలకడు. అతడు చేసే ప్రతికార్యం కేవలం అల్లాహ్ (సు.తా.) సంతుష్టి పొందడానికే ఉంటుంది.