[1] తాము స్వయంగా మార్గభ్రష్టులైనదే కాక ఇతరులను, అల్లాహ్ (సు.తా.) మార్గం నుండి ఆపేవారికి రెట్టింపు శిక్ష విధించబడుతుంది.
[1] ప్రతి ప్రవక్త తన జాతివారిలో సత్యాన్ని తిరస్కరించిన వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాడు. మరియు ము'హమ్మద్ ('స'అస) మరియు అతని అనుచరులు (ర'ది.'అన్హుమ్) ప్రవక్త ('అలైహిమ్ స.) ల విషయంలో వారు సత్యవాదులు మరియు వారు అల్లాహ్ (సు.తా.) సందేశాన్ని ప్రచారం చేశారని సాక్ష్యమిస్తారు. ('స.బు'ఖారీ, తఫ్సీర్ సూరహ్ అన్-నిసా').
[1] అల్-'అద్లు: తన వారితోనే కాక ఇతరులతో కూడా న్యాయం చేయటం. ఎవరితోనైనా ఉన్న ప్రేమ లేక శత్రుత్వం, న్యాయానికి అడ్డు రాకూడదు. మరొక అర్థం న్యాయంలో హెచ్చు తగ్గులు చేయగూడదు. ధర్మవిషయంలో కూడా ఏ విధమైన అన్యాయం జరుగకూడదు. అల్-ఎ'హ్సాను: అంటే, ఒకటి: మంచినడవడిక మరియు క్షమాగుణం. రెండోది: న్యాయంగా ఇవ్వవలసిన దాని కంటే ఎక్కువ ఇవ్వటం. ఉదా: నూరు రూపాయలు కూలి మాట్లాడుకున్న వానికి పని ముగిసిన తరువాత 110 రూపాయలు ఇవ్వటం. మూడవది: ఏ పని చేసినా కర్తవ్యంగా హృదయపూర్వకంగా చేయటం మరియు ఏకాగ్రచిత్తంతో అల్లాహ్ (సు.తా.)ను ఆరాధించటం (అన్ త'అబుదుల్లాహ్ క అన్నక తరాహు). అల్-ఫ'హ్ షా ఉ': అశ్లీలత, చెడు నడత, అసభ్యకరమైన పని, సిగ్గుమాలిన నడవడిక. ఈ కాలంలో ఫ్యాషన్ పేరు మీద జరిగేవి. స్త్రీపురుషులు సిగ్గు విడిచి, కలసి మెలసి తిరుగటం, డాన్సులు చేయటం, మొదలైనవి. అల్-మున్కరు: షరీయత్ నిషేధించిన పని. అల్-బ'గీ: ఆందోళన, అక్రమము, దౌర్జన్యం.
[1] దృఢంగా చేసిన ప్రమాణాలు. ఆలోచించకుండా చేసిన ప్రమాణాలకు చూడండి, 2:225. 'ఒక వ్యక్తి ప్రమాణం చేసిన తరువాత తాను చేసిన ప్రమాణం తప్పు అని తెలుసుకుంటే, తన ప్రమాణాన్ని తెంపి పరిహారం (కఫ్ఫార) ఇవ్వాలి.' ('స. ముస్లిం. నం. 1272). [2] కఫీలున్: అంటే జామీనుదారు, లేక హామీ ఇచ్చేవాడు అని అర్థం.
[1] చూడండి, 14:4 మరియు 2:26-27. అల్లాహుతా'ఆలాకు ప్రతివాని భవిష్యత్తు తెలుసు. కాబట్టి ఎవడైతే సన్మార్గానికి రాడని ఆయనకు తెలుసో అలాంటి వాడిని, మార్గభ్రష్టత్వంలో వదలి పెడతాడే కానీ, ఎవ్వడిని కూడా బలవంతంగా తప్పు దారిలో వేయడని దీని అర్థం.