[1] నిషిద్ధ ('హరాం) వస్తువుల వ్యాపారం కూడా నిషిద్ధమే. [2] ఇందులో ఆత్మహత్య కూడా ఉంది. అది మహాపాపం.
[1] అబూ హరైరా (ర'ది.'అ.) కథనం, దైవప్రవక్త ('స'అస) అన్నారు : "ఏడు మహా పాపాల నుండి దూరంగా ఉండండి. అవి : 1) ఆరాధనలో అల్లాహ్ (సు.తా.)కు సాటి కల్పించటం, 2) మంత్రజాలం పాటించటం, 3) ఎవరినైనా హత్య చేయటం (న్యాయానికి తప్ప), 4) వడ్డీ తినటం 5) అనాథుల ఆస్తిని కబళించటం, 6) యుద్ధరంగం నుండి వెన్ను చూపి పారిపోవటం మరియు 7) పతివ్రత స్త్రీలపై అపనింద మోపటం." ('స.బు'ఖారీ, పుస్తకం - 8, 'హదీస్' నం. 840).
[1] చూడండి, 'స.బు'ఖారీ పుస్తకం - 3, 'హదీస్' నం. 489.