पवित्र कुरअानको अर्थको अनुवाद - तेलगु अनुवाद : अब्दुर्रहीम बिन्हम् ।

رقم الصفحة:close

external-link copy
27 : 4

وَاللّٰهُ یُرِیْدُ اَنْ یَّتُوْبَ عَلَیْكُمْ ۫— وَیُرِیْدُ الَّذِیْنَ یَتَّبِعُوْنَ الشَّهَوٰتِ اَنْ تَمِیْلُوْا مَیْلًا عَظِیْمًا ۟

మరియు అల్లాహ్ మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించ గోరుతున్నాడు. కాని తమ మనోవాంఛలను అనుసరిస్తున్న వారు, మీరు (సన్మార్గం నుండి) చాలా దూరంగా వైదొలగాలని కోరుతున్నారు. info
التفاسير:

external-link copy
28 : 4

یُرِیْدُ اللّٰهُ اَنْ یُّخَفِّفَ عَنْكُمْ ۚ— وَخُلِقَ الْاِنْسَانُ ضَعِیْفًا ۟

అల్లాహ్ మీ భారాన్ని తగ్గించగోరుతున్నాడు. మరియు (ఎందుకంటే) మానవుడు బలహీనుడిగా సృష్టించబడ్డాడు. info
التفاسير:

external-link copy
29 : 4

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَاْكُلُوْۤا اَمْوَالَكُمْ بَیْنَكُمْ بِالْبَاطِلِ اِلَّاۤ اَنْ تَكُوْنَ تِجَارَةً عَنْ تَرَاضٍ مِّنْكُمْ ۫— وَلَا تَقْتُلُوْۤا اَنْفُسَكُمْ ؕ— اِنَّ اللّٰهَ كَانَ بِكُمْ رَحِیْمًا ۟

ఓ విశ్వాసులారా! మీరు ఒకరి సొమ్ము నొకరు అన్యాయంగా తినకండి, పరస్పర అంగీకారంతో చేసే వ్యాపారం వల్ల వచ్చేది (లాభం) తప్ప[1]. మరియు మీరు ఒకరి నొకరు చంపుకోకండి[2]. నిశ్చయంగా, అల్లాహ్ మీ యెడల అపార కరుణాప్రదాత. info

[1] నిషిద్ధ ('హరాం) వస్తువుల వ్యాపారం కూడా నిషిద్ధమే. [2] ఇందులో ఆత్మహత్య కూడా ఉంది. అది మహాపాపం.

التفاسير:

external-link copy
30 : 4

وَمَنْ یَّفْعَلْ ذٰلِكَ عُدْوَانًا وَّظُلْمًا فَسَوْفَ نُصْلِیْهِ نَارًا ؕ— وَكَانَ ذٰلِكَ عَلَی اللّٰهِ یَسِیْرًا ۟

మరియు ఎవడు ద్వేషంతో మరియు దుర్మార్గంతో అలా చేస్తాడో, వానిని మేము నరకాగ్నిలో పడవేస్తాము. మరియు అది అల్లాహ్ కు ఎంతో సులభం. info
التفاسير:

external-link copy
31 : 4

اِنْ تَجْتَنِبُوْا كَبَآىِٕرَ مَا تُنْهَوْنَ عَنْهُ نُكَفِّرْ عَنْكُمْ سَیِّاٰتِكُمْ وَنُدْخِلْكُمْ مُّدْخَلًا كَرِیْمًا ۟

ఒకవేళ మీకు నిషేధించబడి నటువంటి మహాపాపాలకు మీరు దూరంగా ఉంటే, మేము మీ చిన్నచిన్న దోషాలను మన్నించి, మిమ్మల్ని గౌరవస్థానాల్లోకి ప్రవేశింపజేస్తాము[1]. info

[1] అబూ హరైరా (ర'ది.'అ.) కథనం, దైవప్రవక్త ('స'అస) అన్నారు : "ఏడు మహా పాపాల నుండి దూరంగా ఉండండి. అవి : 1) ఆరాధనలో అల్లాహ్ (సు.తా.)కు సాటి కల్పించటం, 2) మంత్రజాలం పాటించటం, 3) ఎవరినైనా హత్య చేయటం (న్యాయానికి తప్ప), 4) వడ్డీ తినటం 5) అనాథుల ఆస్తిని కబళించటం, 6) యుద్ధరంగం నుండి వెన్ను చూపి పారిపోవటం మరియు 7) పతివ్రత స్త్రీలపై అపనింద మోపటం." ('స.బు'ఖారీ, పుస్తకం - 8, 'హదీస్' నం. 840).

التفاسير:

external-link copy
32 : 4

وَلَا تَتَمَنَّوْا مَا فَضَّلَ اللّٰهُ بِهٖ بَعْضَكُمْ عَلٰی بَعْضٍ ؕ— لِلرِّجَالِ نَصِیْبٌ مِّمَّا اكْتَسَبُوْا ؕ— وَلِلنِّسَآءِ نَصِیْبٌ مِّمَّا اكْتَسَبْنَ ؕ— وَسْـَٔلُوا اللّٰهَ مِنْ فَضْلِهٖ ؕ— اِنَّ اللّٰهَ كَانَ بِكُلِّ شَیْءٍ عَلِیْمًا ۟

మరియు అల్లాహ్ మీలో కొందరికి మరికొందరిపై ఇచ్చిన ఘనతను మీరు ఆశించకండి. పురుషులకు తాము సంపాదించిన దానికి తగినట్లుగా ఫలితం ఉంటుంది. మరియు స్త్రీలకు తాము సంపాదించిన దానికి తగినట్లుగా ఫలితం ఉంటుంది. మరియు అల్లాహ్ అనుగ్రహం కొరకు ప్రార్థిస్తూ ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ కు ప్రతిదాని పరిజ్ఞానం ఉంది. info
التفاسير:

external-link copy
33 : 4

وَلِكُلٍّ جَعَلْنَا مَوَالِیَ مِمَّا تَرَكَ الْوَالِدٰنِ وَالْاَقْرَبُوْنَ ؕ— وَالَّذِیْنَ عَقَدَتْ اَیْمَانُكُمْ فَاٰتُوْهُمْ نَصِیْبَهُمْ ؕ— اِنَّ اللّٰهَ كَانَ عَلٰی كُلِّ شَیْءٍ شَهِیْدًا ۟۠

మరియు తల్లిదండ్రులు మరియు దగ్గరి బంధువులు, వదలి పోయిన ప్రతి వ్యక్తి (ఆస్తి)కి మేము వారసులను నియమించి ఉన్నాము. మరియు మీరు ఎవరితో ప్రమాణ పూర్వక ఒప్పందాలను చేసుకొని ఉన్నారో! వారి భాగాన్ని వారికి ఇచ్చి వేయండి. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదానికి సాక్షిగా ఉంటాడు[1]. info

[1] చూడండి, 'స.బు'ఖారీ పుస్తకం - 3, 'హదీస్' నం. 489.

التفاسير: