[1] మృతుని కొడుకు(లు) చనిపోయిన పక్షంలో, కొడుకు(ల) - సంతానం (మనుమళ్ళు, మనుమరాళ్ళు) వారసులుగా పరిగణించబడాలి. (ఇజ్మా'అ, ఇబ్నె-కసీ'ర్ మరియు ఫత్హ'అల్ ఖదీర్). [2] మొదట అప్పులు తీర్చి, తరువాత వీలునామాపై అమలు పరచాలి. ఆ తరువాత మిగిలిన ఆస్తిని వారసులలో పంచాలి. వీలునామా మూడవ వంతు కంటే ఎక్కువ ఆస్తికి చేయగూడదు. ('స. బు'ఖారీ మరియు 'స. ముస్లిం). [3] భార్య ఒక్కతే ఉన్నా! లేక ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నా, సంతానం ఉంటే, వారంతా కలిసి ఎనిమదవ భాగానికి భాగస్వాములు. సంతానం లేకుంటే నాలుగవ భాగానికి. ఈ ఎనిమిదో భాగాన్ని లేక నాలుగవ భాగాన్ని భార్యలందరికీ సమానంగా పంచాలి. (ఇజ్మా'అ, ఫత్హ' అల్ ఖదీర్). [4] ఇక్కడ ఇజ్మా'అ (ధర్మవేత్తల ఏకాభిప్రాయం) ఏమిటంటే, ఈ పంపకం కేవలం అర్ధ సోదర సోదరీమణులు అంటే, కేవలం తల్లి తరఫున నుండి మృతునికి బంధువులైన అర్థ సోదరసోదరీమణులకు - అంటే, ఒకే తల్లి వేర్వేరు తండ్రులున్న వారికి - వర్తిస్తుంది. ఇక సొంత సోదర సోదరీమణులు మరియు సవతి సోదర సోదరీమణులకు వర్తించే ఆజ్ఞ ఇదే సూరహ్ లో చివరి ఆయత్ 4:176లో ఉంది. అంటే అక్కడ సోదరుని భాగం ఇద్దరు సోదరీమణుల భాగానికి సమానంగా ఉండాలి. తండ్రి బ్రతికి ఉంటే మృతుని సోదర సోదరీలు అతని ఆస్తికి హక్కుదారులు కారు. మరో విశేషం ఏమిటంటే, అర్ధ సోదర సోదరీమణులు నస్ల్ కారు (అంటే ఒకే తల్లి, కానీ వేర్వేరు తండ్రులున్నవారు). కాబట్టి వారికి ఆడమగ అందరికీ సమాన భాగం ఇవ్వబడుతోంది. వివరాలకు ధర్మవేత్తలను సంప్రదించండి. [5] ఒకవేళ మృతుడు తన భార్యకు మహ్ర్ చెల్లించకుండానే మరణిస్తే, ఆ మహ్ర్ కూడా అప్పుగా భావించి చెల్లించాలి. భార్య, ఆస్తి హక్కు ఈ మహ్ర్, చెల్లించిన తర్వాతనే ఉంటుంది.