Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo maanaaji Kur'aana e haala Telugu - Abdurahim ɓii Muhammed

Tonngoode hello ngoo:close

external-link copy
265 : 2

وَمَثَلُ الَّذِیْنَ یُنْفِقُوْنَ اَمْوَالَهُمُ ابْتِغَآءَ مَرْضَاتِ اللّٰهِ وَتَثْبِیْتًا مِّنْ اَنْفُسِهِمْ كَمَثَلِ جَنَّةٍ بِرَبْوَةٍ اَصَابَهَا وَابِلٌ فَاٰتَتْ اُكُلَهَا ضِعْفَیْنِ ۚ— فَاِنْ لَّمْ یُصِبْهَا وَابِلٌ فَطَلٌّ ؕ— وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ بَصِیْرٌ ۟

మరియు అల్లాహ్ ప్రీతి పొందే ఉద్దేశంతో మరియు ఆత్మ స్థిరత్వంతో ధనాన్ని ఖర్చు చేసేవారి పోలిక: మెట్టభూమిపై నున్న ఒక తోట వలె ఉంటుంది. దానిపై భారీ వర్షం కురిసినపుడు అది రెండింతల ఫలము నిస్తుంది. భారీ వర్షం కాక చినుకులు (కురిసినా దానికి చాలు). మరియు అల్లాహ్, మీరు చేసేదంతా చూస్తున్నాడు. info
التفاسير:

external-link copy
266 : 2

اَیَوَدُّ اَحَدُكُمْ اَنْ تَكُوْنَ لَهٗ جَنَّةٌ مِّنْ نَّخِیْلٍ وَّاَعْنَابٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ۙ— لَهٗ فِیْهَا مِنْ كُلِّ الثَّمَرٰتِ ۙ— وَاَصَابَهُ الْكِبَرُ وَلَهٗ ذُرِّیَّةٌ ضُعَفَآءُ ۖۚ— فَاَصَابَهَاۤ اِعْصَارٌ فِیْهِ نَارٌ فَاحْتَرَقَتْ ؕ— كَذٰلِكَ یُبَیِّنُ اللّٰهُ لَكُمُ الْاٰیٰتِ لَعَلَّكُمْ تَتَفَكَّرُوْنَ ۟۠

ఏమీ? మీలో ఎవరికైనా ఖర్జురపు మరియు ద్రాక్ష వనాలుండి, వాటి క్రింది నుండి సెలయేళ్ళు ప్రవహిస్తూ, సర్వవిధాల ఫలాలు లభిస్తూ వుండి, అతనికి ముసలితనం వచ్చి, బలహీనులైన పిల్లలున్న సంకట సమయంలో, ఆ తోట మంటలు గల సుడిగాలి వీచి కాలిపోటం, ఎవరికైనా సమ్మతమేనా? మీరు ఆలోచించటానికి, ఈ విధంగా అల్లాహ్ తన సూచనలను (ఆయత్ లను) మీకు విశదీకరిస్తున్నాడు. [1] info

[1] ఇబ్నె - 'అబ్బాస్ మరియు 'ఉమర్ (ర'ది.'అన్హుమ్) ల కథనం: "ఇది ఆ వ్యక్తి ఉదాహరణ, ఎవడైతే తన జీవితమంతా మంచికార్యాలు చేసి చివరి రోజులలో షై'తాన్ వలలో చిక్కుకొని అల్లాహ్ (సు.తా.)కు అవిధేయుడై పోతాడో! అలాంటి వాడు చేసిన పుణ్యకార్యాలన్నీ వ్యర్థమై పోతాయి." ('స. 'బుఖారీ, కితాబ్ అల్ తఫ్సీర్).

التفاسير:

external-link copy
267 : 2

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اَنْفِقُوْا مِنْ طَیِّبٰتِ مَا كَسَبْتُمْ وَمِمَّاۤ اَخْرَجْنَا لَكُمْ مِّنَ الْاَرْضِ ۪— وَلَا تَیَمَّمُوا الْخَبِیْثَ مِنْهُ تُنْفِقُوْنَ وَلَسْتُمْ بِاٰخِذِیْهِ اِلَّاۤ اَنْ تُغْمِضُوْا فِیْهِ ؕ— وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ غَنِیٌّ حَمِیْدٌ ۟

ఓ విశ్వాసులారా! మీరు సంపాదించిన దాని నుండి మరియు మేము మీ కొరకు భూమి నుండి ఉత్పత్తి చేసిన వాటి నుండి, మేలైన వాటినే (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టండి. ఏ వస్తువులనైతే మీరు కండ్లు మూసుకునే గానీ తీసుకోరో, అలాంటి చెడ్డ వస్తువులను (ఇతరులపై) ఖర్చు చేయటానికి ఉద్దేశించకండి. మరియు అల్లాహ్ స్వయం సమృద్ధుడు, ప్రశంసనీయుడని [1] తెలుసుకోండి. info

[1] 'హమీదున్ (అల్-'హమీదు): చూడండి, 14:1 Praiseworthy, He who is Praised, in every case. ప్రశంసనీయుడు, ప్రశంసార్హుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.

التفاسير:

external-link copy
268 : 2

اَلشَّیْطٰنُ یَعِدُكُمُ الْفَقْرَ وَیَاْمُرُكُمْ بِالْفَحْشَآءِ ۚ— وَاللّٰهُ یَعِدُكُمْ مَّغْفِرَةً مِّنْهُ وَفَضْلًا ؕ— وَاللّٰهُ وَاسِعٌ عَلِیْمٌ ۟

షైతాన్ దారిద్ర్య ప్రమాదం చూపి (భయపెట్టి), మిమ్మల్ని నీచకార్యాలు చేయటానికి ప్రేరేపిస్తుంటాడు. కాని అల్లాహ్ తన వైపు నుండి మిమ్మల్ని క్షమిస్తానని, అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరియు అల్లాహ్ సర్వవ్యాప్తి, [1] సర్వజ్ఞుడు. info

[1] వాసి'ఉన్: సర్వవ్యాప్తి, సర్వోపగతుడు, సర్వం తెలిసినవాడు, అపారుడు, ఉదారుడు. విస్తారుడు. చూడండి, 2:115.

التفاسير:

external-link copy
269 : 2

یُّؤْتِی الْحِكْمَةَ مَنْ یَّشَآءُ ۚ— وَمَنْ یُّؤْتَ الْحِكْمَةَ فَقَدْ اُوْتِیَ خَیْرًا كَثِیْرًا ؕ— وَمَا یَذَّكَّرُ اِلَّاۤ اُولُوا الْاَلْبَابِ ۟

ఆయన తాను కోరిన వారికి వివేకాన్ని ప్రసాదిస్తాడు[1]. మరియు వివేకం పొందిన వాడు, వాస్తవంగా సర్వసంపదలను పొందిన వాడే! కాని బుద్ధిమంతులు తప్ప వేరేవారు దీనిని గ్రహించలేరు. info

[1] 'హిక్మతున్: అంటే, వివేకం, తెలివి, జ్ఞానం, సూక్ష్మబుద్ధి, నేర్పు, ప్రపంచజ్ఞానం మొదలైనవి అని అర్థం. ఇక్కడ ఖుర్ఆన్ ను మరియు దైవప్రవక్త ('స'అస) సంప్రదాయాలను అర్థం చేసుకొని, వాటి ప్రకారం నడచుకోవటం అని అర్థం. ఇద్దరు వ్యక్తులతో ఈర్ష్య పడవచ్చు. 1) అల్లాహ్ (సు.తా.) ధనం ప్రసాదించగా, అతడు దానిని అల్లాహుతా'ఆలా మార్గంలో ఖర్చు చేసేవాడు. 2) అల్లాహ్ (సు.తా.) వివేకం ప్రసాదించగా, అతడు దానితో న్యాయమైన తీర్పు చేసేవాడు మరియు ఇతరులకు దానిని బోధించేవాడు, ('స. బు'ఖారీ, కితాబ్ అల్ 'ఇల్మ్ వల్ 'హిక్మహ్).

التفاسير: