Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo maanaaji Kur'aana e haala Telugu - Abdurahim ɓii Muhammed

external-link copy
266 : 2

اَیَوَدُّ اَحَدُكُمْ اَنْ تَكُوْنَ لَهٗ جَنَّةٌ مِّنْ نَّخِیْلٍ وَّاَعْنَابٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ۙ— لَهٗ فِیْهَا مِنْ كُلِّ الثَّمَرٰتِ ۙ— وَاَصَابَهُ الْكِبَرُ وَلَهٗ ذُرِّیَّةٌ ضُعَفَآءُ ۖۚ— فَاَصَابَهَاۤ اِعْصَارٌ فِیْهِ نَارٌ فَاحْتَرَقَتْ ؕ— كَذٰلِكَ یُبَیِّنُ اللّٰهُ لَكُمُ الْاٰیٰتِ لَعَلَّكُمْ تَتَفَكَّرُوْنَ ۟۠

ఏమీ? మీలో ఎవరికైనా ఖర్జురపు మరియు ద్రాక్ష వనాలుండి, వాటి క్రింది నుండి సెలయేళ్ళు ప్రవహిస్తూ, సర్వవిధాల ఫలాలు లభిస్తూ వుండి, అతనికి ముసలితనం వచ్చి, బలహీనులైన పిల్లలున్న సంకట సమయంలో, ఆ తోట మంటలు గల సుడిగాలి వీచి కాలిపోటం, ఎవరికైనా సమ్మతమేనా? మీరు ఆలోచించటానికి, ఈ విధంగా అల్లాహ్ తన సూచనలను (ఆయత్ లను) మీకు విశదీకరిస్తున్నాడు. [1] info

[1] ఇబ్నె - 'అబ్బాస్ మరియు 'ఉమర్ (ర'ది.'అన్హుమ్) ల కథనం: "ఇది ఆ వ్యక్తి ఉదాహరణ, ఎవడైతే తన జీవితమంతా మంచికార్యాలు చేసి చివరి రోజులలో షై'తాన్ వలలో చిక్కుకొని అల్లాహ్ (సు.తా.)కు అవిధేయుడై పోతాడో! అలాంటి వాడు చేసిన పుణ్యకార్యాలన్నీ వ్యర్థమై పోతాయి." ('స. 'బుఖారీ, కితాబ్ అల్ తఫ్సీర్).

التفاسير: