Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo maanaaji Kur'aana e haala Telugu - Abdurahim ɓii Muhammed

Tonngoode hello ngoo:close

external-link copy
270 : 2

وَمَاۤ اَنْفَقْتُمْ مِّنْ نَّفَقَةٍ اَوْ نَذَرْتُمْ مِّنْ نَّذْرٍ فَاِنَّ اللّٰهَ یَعْلَمُهٗ ؕ— وَمَا لِلظّٰلِمِیْنَ مِنْ اَنْصَارٍ ۟

మరియు మీరు (ఇతరులపై) ఏమి ఖర్చుచేసినా, లేక ఏ మొక్కుబడి చేసుకున్నా, నిశ్చయంగా అల్లాహ్ కు అంతా తెలుస్తుంది[1]. మరియు దుర్మార్గులకు సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు. info

[1] ఏదైనా మంచి పనికి పూనుకొని అది పూర్తి అయితే నేను అల్లాహ్ (సు.తా.) మార్గంలో ఇంత ఖర్చు చేస్తాను, లేక సత్కార్యం చేస్తాను, అని మొక్కుబడి చేసుకుంటే! దానిని పూర్తి చేయాలి. అల్లాహ్ (సు.తా.) పేరట చేసే మొక్కుబడి కూడా, నమా'జ్ మరియు ఉపవాసం మాదిరిగా అల్లాహ్ (సు.తా.) ఆరాధనయే. కాబట్టి అల్లాహ్ (సు.తా.) తప్ప ఇతరుల పేరట మొక్కుబడి చేయటం షిర్క్ అంటే అల్లాహ్ (సు.తా.) క్షమించని మహాపాపం.

التفاسير:

external-link copy
271 : 2

اِنْ تُبْدُوا الصَّدَقٰتِ فَنِعِمَّا هِیَ ۚ— وَاِنْ تُخْفُوْهَا وَتُؤْتُوْهَا الْفُقَرَآءَ فَهُوَ خَیْرٌ لَّكُمْ ؕ— وَیُكَفِّرُ عَنْكُمْ مِّنْ سَیِّاٰتِكُمْ ؕ— وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِیْرٌ ۟

మీరు బహిరంగంగా దానాలు చేయటం మంచిదే! కాని, గుప్తంగా నిరుపేదలకు ఇస్తే! అది మీకు అంతకంటే మేలైనది. మరియు ఆయన మీ ఎన్నో పాపాలను (దీనివల్ల) రద్దు చేస్తాడు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు. info
التفاسير:

external-link copy
272 : 2

لَیْسَ عَلَیْكَ هُدٰىهُمْ وَلٰكِنَّ اللّٰهَ یَهْدِیْ مَنْ یَّشَآءُ ؕ— وَمَا تُنْفِقُوْا مِنْ خَیْرٍ فَلِاَنْفُسِكُمْ ؕ— وَمَا تُنْفِقُوْنَ اِلَّا ابْتِغَآءَ وَجْهِ اللّٰهِ ؕ— وَمَا تُنْفِقُوْا مِنْ خَیْرٍ یُّوَفَّ اِلَیْكُمْ وَاَنْتُمْ لَا تُظْلَمُوْنَ ۟

(ఓ ప్రవక్తా!) వారిని సన్మార్గాన్ని అవలంబించేటట్లు చేయటం నీ బాధ్యత కాదు. కాని, అల్లాహ్ తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు. మరియు మీరు మంచిమార్గంలో ఖర్చుచేసేది మా (మేలు) కొరకే. మీరు ఖర్చు చేసేది అల్లాహ్ ప్రీతిని పొందటానికే అయి ఉండాలి. మీరు మంచి మార్గంలో ఏమి ఖర్చు చేసినా, దాని ఫలితం మీకు పూర్తిగా లభిస్తుంది మరియు మీకు ఎలాంటి అన్యాయం జరుగదు. info
التفاسير:

external-link copy
273 : 2

لِلْفُقَرَآءِ الَّذِیْنَ اُحْصِرُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ لَا یَسْتَطِیْعُوْنَ ضَرْبًا فِی الْاَرْضِ ؗ— یَحْسَبُهُمُ الْجَاهِلُ اَغْنِیَآءَ مِنَ التَّعَفُّفِ ۚ— تَعْرِفُهُمْ بِسِیْمٰىهُمْ ۚ— لَا یَسْـَٔلُوْنَ النَّاسَ اِلْحَافًا ؕ— وَمَا تُنْفِقُوْا مِنْ خَیْرٍ فَاِنَّ اللّٰهَ بِهٖ عَلِیْمٌ ۟۠

అల్లాహ్ మార్గంలో నిమగ్నులైన కారణంగా (తమ జీవనోపాధి కొరకు) భూమిలో తిరిగే అవకాశం లేక లేమికి గురి అయ్యే పేదవారు (ధనసహాయానికి అర్హులు). ఎరుగని మనిషి వారి అడగక పోవటాన్ని చూసి, వారు ధనవంతులని భావించవచ్చు! (కాని) వారి ముఖ చిహ్నాలు చూసి నీవు వారిని గుర్తించగలవు. వారు ప్రజలను పట్టుబట్టి అడిగేవారు కారు. మరియు మీరు మంచి కొరకు ఏమి ఖర్చుచేసినా అది అల్లాహ్ కు తప్పక తెలుస్తుంది. info
التفاسير:

external-link copy
274 : 2

اَلَّذِیْنَ یُنْفِقُوْنَ اَمْوَالَهُمْ بِالَّیْلِ وَالنَّهَارِ سِرًّا وَّعَلَانِیَةً فَلَهُمْ اَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْ ۚ— وَلَا خَوْفٌ عَلَیْهِمْ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟ؔ

ఎవరైతే తమ సంపదను (అల్లాహ్ మార్గంలో) రేయింబవళ్ళు బహిరంగంగానూ మరియు రహస్యంగానూ ఖర్చు చేస్తారో, వారు తమ ప్రతిఫలాన్ని తమ ప్రభువు వద్ద పొందుతారు. మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా![1] info

[1] చూడండి, 'స. బు'ఖారీ, పుస్తకం - 2, 'హదీస్' నం. 504.

التفاسير: