Traducción de los significados del Sagrado Corán - Traducción Telugu- Abder-Rahim ibn Muhammad

Número de página:close

external-link copy
29 : 28

فَلَمَّا قَضٰی مُوْسَی الْاَجَلَ وَسَارَ بِاَهْلِهٖۤ اٰنَسَ مِنْ جَانِبِ الطُّوْرِ نَارًا ۚ— قَالَ لِاَهْلِهِ امْكُثُوْۤا اِنِّیْۤ اٰنَسْتُ نَارًا لَّعَلِّیْۤ اٰتِیْكُمْ مِّنْهَا بِخَبَرٍ اَوْ جَذْوَةٍ مِّنَ النَّارِ لَعَلَّكُمْ تَصْطَلُوْنَ ۟

ఆ తరువాత మూసా తన గడువు[1] పూర్తి చేసి, తన కుటుంబం వారిని తీసుకొని పోతుండగా, తూర్ పర్వతపు దిక్కులో ఒక మంటను చూశాడు. (అప్పుడు) తన ఇంటి వారితో అన్నాడు: "ఆగండి! నేను ఒక మంటను చూశాను, బహుశా! నేను అక్కడి నుండి ఏదైనా మంచి వార్తను తీసుకొని రావచ్చు, లేదా ఒక అగ్ని కొరవినైనా! అప్పుడు మీరు దానితో చలి కాచుకోవచ్చు." info

[1] ఇబ్నె 'అబ్బాస్ (ర'ది.'అ.) కథనం ప్రకారం అతను ఈ గడువు పది సంవత్సరాలు పూర్తి చేశారు. ఎందుకంటే మూసా ('అ.స.) వృద్ధుడైన తన భార్య తండ్రికి సహాయపడగోరారు. చూడండి, 27:7-8.

التفاسير:

external-link copy
30 : 28

فَلَمَّاۤ اَتٰىهَا نُوْدِیَ مِنْ شَاطِئِ الْوَادِ الْاَیْمَنِ فِی الْبُقْعَةِ الْمُبٰرَكَةِ مِنَ الشَّجَرَةِ اَنْ یّٰمُوْسٰۤی اِنِّیْۤ اَنَا اللّٰهُ رَبُّ الْعٰلَمِیْنَ ۟ۙ

కాని అతను దాని (అగ్ని) వద్దకు చేరుకున్నప్పుడు,[1] ఆ లోయ కుడివైపు ఉన్న ఒక శుభవంతమైన స్థలములో ఉన్న ఒక చెట్టు నుండి: "ఓ మూసా! నిశ్చయంగా, నేనే అల్లాహ్ ను! సర్వలోకాల ప్రభువును." అనే మాటలు వినిపించాయి. info

[1] ఆ మంట వాస్తవానికి అల్లాహ్ (సు.తా.) దివ్యజ్యోతి. చూడండి, 19:52, 20:80.

التفاسير:

external-link copy
31 : 28

وَاَنْ اَلْقِ عَصَاكَ ؕ— فَلَمَّا رَاٰهَا تَهْتَزُّ كَاَنَّهَا جَآنٌّ وَّلّٰی مُدْبِرًا وَّلَمْ یُعَقِّبْ ؕ— یٰمُوْسٰۤی اَقْبِلْ وَلَا تَخَفْ ۫— اِنَّكَ مِنَ الْاٰمِنِیْنَ ۟

(ఇంకా ఇలా వినిపించింది): "నీ చేతి కర్రను పడవేయి!" అతను (మూసా) దానిని పామువలే కదలటం చూసి వెనక్కి మరలి పరుగెత్తాడు, తిరిగి కూడా చూడలేదు. (తరువాత ఇలా సెలవీయబడింది): "ఓ మూసా, ముందుకు రా, భయపడకు! నిశ్చయంగా, నీవు సురక్షితంగా ఉన్నావు! info
التفاسير:

external-link copy
32 : 28

اُسْلُكْ یَدَكَ فِیْ جَیْبِكَ تَخْرُجْ بَیْضَآءَ مِنْ غَیْرِ سُوْٓءٍ ؗ— وَّاضْمُمْ اِلَیْكَ جَنَاحَكَ مِنَ الرَّهْبِ فَذٰنِكَ بُرْهَانٰنِ مِنْ رَّبِّكَ اِلٰی فِرْعَوْنَ وَمَلَاۡىِٕهٖ ؕ— اِنَّهُمْ كَانُوْا قَوْمًا فٰسِقِیْنَ ۟

నీ చేతిని నీ చంకలోకి దూర్చుకో, అది ఎలాంటి లోపం లేకుండా ప్రకాశిస్తూ బయటికి వస్తుంది[1]. నీవు భయపడకుండా ఉండటానికి నీ చేతిని నీ ప్రక్కకు అదుముకో! ఈ రెండు, నీవు ఫిర్ఔన్ మరియు అతని నాయకులకు (చూపటానికి) నీ ప్రభువు ప్రసాదించిన నిదర్శనాలు (ఆయాత్). నిశ్చయంగా వారు చాలా దుష్టులయి పోయారు!" info

[1] చూడండి, 7:108.

التفاسير:

external-link copy
33 : 28

قَالَ رَبِّ اِنِّیْ قَتَلْتُ مِنْهُمْ نَفْسًا فَاَخَافُ اَنْ یَّقْتُلُوْنِ ۟

(మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! నేను వారి మనిషిని ఒకనిని చంపాను. కావున వారు నన్ను చంపుతారేమోనని భయపడుతున్నాను. info
التفاسير:

external-link copy
34 : 28

وَاَخِیْ هٰرُوْنُ هُوَ اَفْصَحُ مِنِّیْ لِسَانًا فَاَرْسِلْهُ مَعِیَ رِدْاً یُّصَدِّقُنِیْۤ ؗ— اِنِّیْۤ اَخَافُ اَنْ یُّكَذِّبُوْنِ ۟

మరియు నా సోదరుడు హారూన్ మాట్లాడటంలో నా కంటే మంచి వాగ్ధాటి గలవాడు.[1] నన్ను సమర్థించటానికి అతనిని నాకు సహాయకునిగా నాతో పాటు పంపు. వాస్తవానికి వారు నన్ను అసత్యవాదివని తిరస్కరిస్తారేమోనని నేను భయపడుతున్నాను!" info

[1] చూడండి, 20:27-28 మరియు 26:12-13

التفاسير:

external-link copy
35 : 28

قَالَ سَنَشُدُّ عَضُدَكَ بِاَخِیْكَ وَنَجْعَلُ لَكُمَا سُلْطٰنًا فَلَا یَصِلُوْنَ اِلَیْكُمَا ۚۛ— بِاٰیٰتِنَا ۚۛ— اَنْتُمَا وَمَنِ اتَّبَعَكُمَا الْغٰلِبُوْنَ ۟

ఆయన (అల్లాహ్) అన్నాడు: "మేము నీ సోదరుని ద్వారా నీ చేతులను బలపరుస్తాము. మరియు మేము మీ ఇద్దరికీ విశేష శక్తి నొసంగుతాము. వారు మీ ఇద్దరికి ఏ మాత్రం హాని చేయలేరు. మా సూచనల ద్వారా మీరిద్దరూ మరియు మిమ్మల్ని అనుసరించే వారు గెలుపొందుతారు."[1] info

[1] ఆ వాక్యం ఖుర్ఆన్ లో ఎన్నోసార్లు వచ్చింది. చూడండి, 5:67, 33:39, 51:21, 40:51-52..

التفاسير: