Traducción de los significados del Sagrado Corán - Traducción Telugu- Abder-Rahim ibn Muhammad

Número de página:close

external-link copy
14 : 28

وَلَمَّا بَلَغَ اَشُدَّهٗ وَاسْتَوٰۤی اٰتَیْنٰهُ حُكْمًا وَّعِلْمًا ؕ— وَكَذٰلِكَ نَجْزِی الْمُحْسِنِیْنَ ۟

మరియు అతను (మూసా) యుక్తవయస్సుకు చేరి పరిపూర్ణుడు అయినప్పుడు, మేము అతనికి వివేకాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించాము. మరియు ఈ విధంగా, మేము సజ్జనులకు ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాము.[1] info

[1] చూడండి, 12:22.

التفاسير:

external-link copy
15 : 28

وَدَخَلَ الْمَدِیْنَةَ عَلٰی حِیْنِ غَفْلَةٍ مِّنْ اَهْلِهَا فَوَجَدَ فِیْهَا رَجُلَیْنِ یَقْتَتِلٰنِ ؗ— هٰذَا مِنْ شِیْعَتِهٖ وَهٰذَا مِنْ عَدُوِّهٖ ۚ— فَاسْتَغَاثَهُ الَّذِیْ مِنْ شِیْعَتِهٖ عَلَی الَّذِیْ مِنْ عَدُوِّهٖ ۙ— فَوَكَزَهٗ مُوْسٰی فَقَضٰی عَلَیْهِ ؗ— قَالَ هٰذَا مِنْ عَمَلِ الشَّیْطٰنِ ؕ— اِنَّهٗ عَدُوٌّ مُّضِلٌّ مُّبِیْنٌ ۟

మరియు (ఒకరోజు) నగరవాసులు ఏమరుపాటులో ఉన్నప్పుడు, అతను నగరంలోకి ప్రవేశించాడు, అతను ఇక్కడ ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకోవడం చూశాడు, వారిలో ఒకడు అతని జాతికి చెందినవాడు, మరొకడు విరోధి జాతికి చెందినవాడు. అతని జాతికి చెందిన వాడు, విరోధి జాతివానికి వ్యతిరేకంగా సహాయపడమని అతనిని (మూసాను) అర్థించాడు. మూసా అతడిని ఒక గుద్దుగుద్దాడు. అది అతడిని అంతమొందించింది. (అప్పుడు) అతను (మూసా) అన్నాడు: "ఇది షైతాన్ పనే! నిశ్చయంగా, అతడు శత్రువు మరియు స్పష్టంగా దారి తప్పించేవాడు."[1] info

[1] దైవప్రవక్త ప్రవచనం: 'తెగలకొరకు, తెగల పేరట కృషిచేసేవాడూ మరియు తెగల కొరకు పోరాడే వాడూ మరియు తెగల కొరకు మరణించేవాడూ మాలోనివాడుకాడు!' (అబూ దావూద్ - 'జుబైర్ ఇబ్నె మత్'ఇమ్ - కథనం ఆధారంగా) దీని భావం అడుగగా అతను ('స'అస) అన్నారు: 'అన్యాయ విషయంలో తమ వారికి సహాయపడటం.'

التفاسير:

external-link copy
16 : 28

قَالَ رَبِّ اِنِّیْ ظَلَمْتُ نَفْسِیْ فَاغْفِرْ لِیْ فَغَفَرَ لَهٗ ؕ— اِنَّهٗ هُوَ الْغَفُوْرُ الرَّحِیْمُ ۟

(మూసా) ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నాకు నేను అన్యాయం చేసుకున్నాను. కావున నన్ను క్షమించు!" (అల్లాహ్) అతనిని క్షమించాడు. నిశ్చయంగా, ఆయన క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత[1]. info

[1] ఉద్ధేశ్యపూర్వకంగా చంపకున్నా, ఒక మానవుని హత్య జరిగింది. దానికి మూసా ('అ.స.) పశ్చాత్తాపపడి క్షమాపణ వేడుకుంటే, అల్లాహ్ (సు.తా.) అతనిని క్షమించాడు.

التفاسير:

external-link copy
17 : 28

قَالَ رَبِّ بِمَاۤ اَنْعَمْتَ عَلَیَّ فَلَنْ اَكُوْنَ ظَهِیْرًا لِّلْمُجْرِمِیْنَ ۟

(మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! నీవు నాకు మహోపకారం చేశావు. కావున నేను ఇక ఎన్నటికీ నేరస్తులకు సహాయపడను!" info
التفاسير:

external-link copy
18 : 28

فَاَصْبَحَ فِی الْمَدِیْنَةِ خَآىِٕفًا یَّتَرَقَّبُ فَاِذَا الَّذِی اسْتَنْصَرَهٗ بِالْاَمْسِ یَسْتَصْرِخُهٗ ؕ— قَالَ لَهٗ مُوْسٰۤی اِنَّكَ لَغَوِیٌّ مُّبِیْنٌ ۟

మరుసటి రోజు ఉదయం అతను (మూసా) భయపడుతూ అతని జాగ్రత్తగా (ఇటూ అటూ చూస్తూ) నగరంలోకి వెళ్ళాడు. అప్పుడు అకస్మాత్తుగా అంతకు ముందు రోజు, అతనిని సహాయానికి పిలిచినవాడే, మళ్ళీ సహాయానికై అరవసాగాడు. మూసా వానితో అన్నాడు: "నిశ్చయంగా, నీవు స్పష్టమైన తప్పు దారికి లాగేవాడవు!"[1] info

[1] ఇబ్నె 'అబ్బాస్ మరియు ముఖాతిల్ (ర'ది.'అన్హుమ్) ల కథనం ప్రకారం ఆ ఇస్రాయీ'ల్ వంశీయుడు సత్యతిరస్కారి.

التفاسير:

external-link copy
19 : 28

فَلَمَّاۤ اَنْ اَرَادَ اَنْ یَّبْطِشَ بِالَّذِیْ هُوَ عَدُوٌّ لَّهُمَا ۙ— قَالَ یٰمُوْسٰۤی اَتُرِیْدُ اَنْ تَقْتُلَنِیْ كَمَا قَتَلْتَ نَفْسًا بِالْاَمْسِ ۗ— اِنْ تُرِیْدُ اِلَّاۤ اَنْ تَكُوْنَ جَبَّارًا فِی الْاَرْضِ وَمَا تُرِیْدُ اَنْ تَكُوْنَ مِنَ الْمُصْلِحِیْنَ ۟

ఆ తరువాత అతను తమ ఇద్దరికీ విరోధి అయిన వాడిని గట్టిగా పట్టుకోబోగా, అతడు అరిచాడు: "ఓ మూసా! ఏమీ? నీవు నిన్న ఒక వ్యక్తిని చంపినట్లు నన్ను కూడా చంపదలచుకున్నావా? నీవు ఈ దేశంలో క్రూరునిగా మారి ఉండదలుచుకున్నావా? సద్వర్తనునిగా ఉండదలుచుకోలేదా?" info
التفاسير:

external-link copy
20 : 28

وَجَآءَ رَجُلٌ مِّنْ اَقْصَا الْمَدِیْنَةِ یَسْعٰی ؗ— قَالَ یٰمُوْسٰۤی اِنَّ الْمَلَاَ یَاْتَمِرُوْنَ بِكَ لِیَقْتُلُوْكَ فَاخْرُجْ اِنِّیْ لَكَ مِنَ النّٰصِحِیْنَ ۟

మరియు ఒక వ్యక్తి నగరపు ఒక వైపు నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు: ఓ మూసా! నాయకులందరూ కలిసి నిన్ను హత్య చేయాలని సంప్రదింపులు చేస్తున్నారు. కావున నీవు వెళ్ళిపో, నేను నిశ్చయంగా, నీ శ్రేయోభిలాషిని!" info
التفاسير:

external-link copy
21 : 28

فَخَرَجَ مِنْهَا خَآىِٕفًا یَّتَرَقَّبُ ؗ— قَالَ رَبِّ نَجِّنِیْ مِنَ الْقَوْمِ الظّٰلِمِیْنَ ۟۠

అప్పుడతను భయపడుతూ, అతి జాగ్రత్తగా అక్కడి నుండి బయలు దేరాడు. అతను ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నన్ను దుర్మార్గుల నుండి కాపాడు!" info
التفاسير: