Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation - Abdurrahim ibn Muhammad

Page Number:close

external-link copy
17 : 2

مَثَلُهُمْ كَمَثَلِ الَّذِی اسْتَوْقَدَ نَارًا ۚ— فَلَمَّاۤ اَضَآءَتْ مَا حَوْلَهٗ ذَهَبَ اللّٰهُ بِنُوْرِهِمْ وَتَرَكَهُمْ فِیْ ظُلُمٰتٍ لَّا یُبْصِرُوْنَ ۟

వారి ఉపమానం[1] ఇలా ఉంది:[2] ఒక అగ్నిని వెలిగించగా, అది పరిసరాలను ప్రకాశింపజేసిన తర్వాత అల్లాహ్ వారి వెలుగును తీసుకుని వారిని అంధకారంలో విడిచి పెట్టడం వల్ల, వారు ఏమీ చూడలేక పోతారు. info

[1] మస'లున్: అంటే ఉపమానం, పోలిక, సాదృశ్యం, దృష్టాంతం అనే అర్థాలున్నాలు. [2] 'అబ్దుల్లాహ్ బిన్-మస్'ఊద్ (ర'ది. 'అ.) కథనం (ఫ'త్హ్ అల్-ఖదీర్): మహాప్రవక్త ('స'అస), మదీనాకు వచ్చిన తరువాత విశ్వసించిన వారిలో కొందరు కాపట్యానికి లోనవుతారు. అంటే వారు ఇస్లాం వెలుగును పొందిన తరువాత దానిని విడిచి మరల అంధకారంలో చిక్కుకు పోతారు. ఆ విషయం ఈ విధంగా బోధించబడింది. ఒక వ్యక్తి రాత్రిలో ఎడారిలో మంట వెలిగించి కాపుకుంటాడు. అది వారి పరిసరాలను వెలిగిస్తుంది. కాని ఆ అగ్ని ఆరి పోగానే వారు మళ్ళీ అంధకారంలో చిక్కు కుంటారు. ఏమీ చూడ లేక పోతారు. అదే విధంగా బాహ్యంగా మాత్రమే ఇస్లాం స్వీకరించిన వారి హృదయాలు అంధకారంలో ఉండి పోతాయి. వారు ఇస్లాం వెలుగును పొందిన తరువాత కూడా అంధకారంలోనే ఉండి పోతారు.

التفاسير:

external-link copy
18 : 2

صُمٌّۢ بُكْمٌ عُمْیٌ فَهُمْ لَا یَرْجِعُوْنَ ۟ۙ

(వారు) చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు, ఇక వారు (ఋజుమార్గానికి) మరలిరాలేరు. info
التفاسير:

external-link copy
19 : 2

اَوْ كَصَیِّبٍ مِّنَ السَّمَآءِ فِیْهِ ظُلُمٰتٌ وَّرَعْدٌ وَّبَرْقٌ ۚ— یَجْعَلُوْنَ اَصَابِعَهُمْ فِیْۤ اٰذَانِهِمْ مِّنَ الصَّوَاعِقِ حَذَرَ الْمَوْتِ ؕ— وَاللّٰهُ مُحِیْطٌ بِالْكٰفِرِیْنَ ۟

లేక (మరొక ఉపమానం): ఆకాశం నుండి ఘోరంగా వర్షం కురుస్తున్నది; చిమ్మ చీకట్లలో ఉరుములు, మెరుపులు మెరుస్తున్నాయి. ఆ ఉరుముల భీకర ధ్వని విని, మృత్యుభయం చేత వారు తమ వ్రేళ్ళను చెవులలో దూర్చుకుంటున్నారు. మరియు అల్లాహ్ సత్య తిరస్కారులను అన్ని వైపుల నుండి ఆవరించి ఉన్నాడు.[1] info

[1] ముహీతున్: One Who Econpasseth, Encloseth, Surroundeth. సర్వాన్ని పరివేష్టించి ఆవరించి, చుట్టుముట్టి ఉన్నవాడు, ఆయన జ్ఞానపరిరిధికీ శక్థికీ వెలుపల ఏదీ లేదు. చూడండి, 85:20.

التفاسير:

external-link copy
20 : 2

یَكَادُ الْبَرْقُ یَخْطَفُ اَبْصَارَهُمْ ؕ— كُلَّمَاۤ اَضَآءَ لَهُمْ مَّشَوْا فِیْهِ ۙۗ— وَاِذَاۤ اَظْلَمَ عَلَیْهِمْ قَامُوْا ؕ— وَلَوْ شَآءَ اللّٰهُ لَذَهَبَ بِسَمْعِهِمْ وَاَبْصَارِهِمْ ؕ— اِنَّ اللّٰهَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟۠

ఆ మెరుపు వారి దృష్టిని ఇంచు మించు ఎగుర వేసుకు పోయినట్లుంటుంది. ప్రతిసారి అది మెరిసినప్పుడు, వారు ముందుకు నడుస్తారు మరియు వారిపై చీకటి క్రమ్ము కొనగానే వారు ఆగిపోతారు. మరియు అల్లాహ్ కోరితే వారి వినికిడినీ మరియు వారి చూపునూ తొలగించే వాడు.[1] నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.[2] info

[1] అల్లాహుతా 'ఆలా తలుచుకుంటే ఎప్పుడైనా తాను ప్రసాదించే అనుగ్రహాలను ఆపుకోవచ్చు! కావున మానవులు ఎల్లప్పుడు అల్లాహుతా 'ఆలా యందే భయభక్తులు కలిగి వుండి, ఆయన శిక్షకూ, ప్రతీకారానికీ భయపడుతూ ఉండాలి. [2] అలా కుల్లి ,షయ్ఇ'న్ ఖదీర్: ఈ వాక్యాన్ని కొందరు: "అన్నింటిపై అధికారం (ఆధిపత్యం) గలవాడు." అని కూడా అనువదించారు.

التفاسير:

external-link copy
21 : 2

یٰۤاَیُّهَا النَّاسُ اعْبُدُوْا رَبَّكُمُ الَّذِیْ خَلَقَكُمْ وَالَّذِیْنَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُوْنَ ۟ۙ

ఓ మానవులారా! మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువు (అల్లాహ్) నే ఆరాధించండి, తద్వారా మీరు భక్తిపరులు కావచ్చు![1] info

[1] ల'అల్లకుమ్ తత్తఖూన్: దీనికి ము'హమ్మద్ జూనాగఢి గారు ఇలా తాత్పర్యమిచ్చారు: "తద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు."

التفاسير:

external-link copy
22 : 2

الَّذِیْ جَعَلَ لَكُمُ الْاَرْضَ فِرَاشًا وَّالسَّمَآءَ بِنَآءً ۪— وَّاَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَاَخْرَجَ بِهٖ مِنَ الثَّمَرٰتِ رِزْقًا لَّكُمْ ۚ— فَلَا تَجْعَلُوْا لِلّٰهِ اَنْدَادًا وَّاَنْتُمْ تَعْلَمُوْنَ ۟

ఆయన (అల్లాహ్) యే మీ కొరకు భూమిని పరుపుగాను మరియు ఆకాశాన్ని కప్పుగాను చేశాడు. మరియు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా మీకు జీవనోపాధిగా ఫలాలను (పంటలను) ఉత్పత్తి చేశాడు! కావున ఇది తెలుసుకొని కూడా, మీరు ఇతరులను అల్లాహ్ కు సాటిగా నిలబెట్టకండి.[1] info

[1] మిమ్మల్ని మరియు సర్వసృష్టిని సృష్టించినవాడు అల్లాహ్ (సు.తా.) యే! మీకు జీవనోపాధిని సమకూర్చేవాడు కూడా ఆయనయే. అలాంటప్పుడు ఆయనను వదలి మీరు ఇతరులను ఎందుకు ఆరాధిస్తున్నారు? ఇతరులను ఆయనకు భాగస్వాములుగా ఎందుకు నిలబెడుతున్నారు? మీరు ఆయన శిక్ష నుండి తప్పించు కోవాలనుకుంటే! కేవలం ఆయననే ఆరాధించండి, ('స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం-6, 'హ. నం. 4)

التفاسير:

external-link copy
23 : 2

وَاِنْ كُنْتُمْ فِیْ رَیْبٍ مِّمَّا نَزَّلْنَا عَلٰی عَبْدِنَا فَاْتُوْا بِسُوْرَةٍ مِّنْ مِّثْلِهٖ ۪— وَادْعُوْا شُهَدَآءَكُمْ مِّنْ دُوْنِ اللّٰهِ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟

మరియు మేము మా దాసుని (ముహమ్మద్) పై అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) గురించి, మీకు సందేహముంటే; దాని వంటి ఒక్క సూరహ్ నైనా మీరు (రచించి) తీసుకురండి[1]. మరియు అల్లాహ్ తప్ప మీకు ఉన్న సహాయకులను అందరినీ పిలుచుకోండి; మీరు సత్యవంతులే అయితే (ఇది చేసి చూపండి). info

[1] ఈ విధమైన ఒక్క సూరహ్ నైనా రచించి తెమ్మనే ప్రశ్న రెండు చోట్లలో ఇక్కడ మరియు 10:38 లలో ఉంది. 11:13లో పది సూరాహ్ లు రచించి తెమ్మనీ మరియు 17:88, 52:34లలో ఇట్టి గ్రంథాన్ని రచించి తెమ్మనీ ఉంది. ఈ దివ్యఖుర్ఆన్ అల్లాహుతా 'ఆలా దగ్గరి నుండి అవతరింప జేయబడింది, కాబట్టి ఎవ్వరు కూడా ఇంత వరకు ఈ ఛాలెంజీని ఎదుర్కోలేక పోయారు.

التفاسير:

external-link copy
24 : 2

فَاِنْ لَّمْ تَفْعَلُوْا وَلَنْ تَفْعَلُوْا فَاتَّقُوا النَّارَ الَّتِیْ وَقُوْدُهَا النَّاسُ وَالْحِجَارَةُ ۖۚ— اُعِدَّتْ لِلْكٰفِرِیْنَ ۟

కానీ, ఒకవేళ మీరు అలా చేయలేక పోతే - నిశ్చయంగా, మీరు అలా చేయలేరు - మానవులు మరియు రాళ్ళు ఇంధనమయ్యే ఆ నరకాగ్నికి భయపడండి.[1] అది సత్యతిరస్కారుల కొరకే తయారు చేయబడింది. info

[1] ఇబ్నె 'అబ్బాస్ (ర'ది. 'అ.) కథనం: "మీరు మరియు మీరు ఆరాధించే రాళ్ళ దేవతలు నరకాగ్నికి ఇంధనం అవుతారు." చూడండి, 21:98.

التفاسير: