Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation - Abdurrahim ibn Muhammad

అల్-బఖరహ్

external-link copy
1 : 2

الٓمّٓ ۟ۚ

అలిఫ్-లామ్-మీమ్[1] info

[1] సూరహ్ (అధ్యాయం) ప్రారంభంలో ప్రస్తావించబడిన ఈ విడి విడి అక్షరాలు ఖున్ఆన్ యొక్క అద్భుత స్వభావాన్ని సూచిస్తున్నాయి. ఇది బహుదైవారాధకుల ముందు పెట్టబడిన ఒక గొప్ప సవాలు, మరియు అరబ్బుల భాషలో ఈ అక్షరాలు ఉన్నప్పటికీ వారు ఈ విడి విడి అక్షరాలు ఇలా ప్రసావించబడటాన్ని వ్యతిరేకించ లేకపోయారు. అరబ్బులు ఆనాటి ప్రజలలో అత్యంత వాగ్ధాటి కలిగి ఉన్నప్పటికీ, వారు వీటికి సమానమైన దానిని తీసుకు రాలేకపోయారు. ఇది ఖుర్ఆన్ అల్లాహ్ నుండి అవతరించబడిన ఒక దివ్యావతరణ అని నిరూపిస్తున్నది.

التفاسير:

external-link copy
2 : 2

ذٰلِكَ الْكِتٰبُ لَا رَیْبَ ۖۚۛ— فِیْهِ ۚۛ— هُدًی لِّلْمُتَّقِیْنَ ۟ۙ

ఇది (ఈ ఖుర్ఆన్) ఒక దివ్య గ్రంథం; ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. దైవభీతి[1] గలవారికి ఇది మార్గదర్శకత్వము. info

[1] అల్-ముత్తఖీను: దైవభీతి గలవారు, అంటే అల్లాహ్ (సు.తా.) యందు భయభక్తులు కలిగి ఆయన (సు.తా.) ఆదేశాలను అనుసరించేవారు.

التفاسير:

external-link copy
3 : 2

الَّذِیْنَ یُؤْمِنُوْنَ بِالْغَیْبِ وَیُقِیْمُوْنَ الصَّلٰوةَ وَمِمَّا رَزَقْنٰهُمْ یُنْفِقُوْنَ ۟ۙ

(వారికి) ఎవరైతే అగోచర యథార్థాన్ని[1] విశ్వసిస్తారో, నమాజ్ను స్థాపిస్తారో[2] మరియు మేము ప్రసాదించిన జీవనోపాధి నుండి (మా మార్గంలో) ఖర్చు చేస్తారో[3]; info

[1] 'గైబున్: అగోచర యథార్థం, అంటే మానవ ఇంద్రియాలకు మరియు జ్ఞానానికి గోప్యంగా ఉన్న సత్యాలు. అంటే అల్లాహ్ (సు.తా.) ను దైవదూత ('అ.స.)లను, పునరుత్థానదినాన్ని, స్వర్గనరకాలను మొదలైన వాటిని విశ్వసించటం. [2] నమాజ్' స్థాపించడం అంటే, ప్రతిదినము ఐదుసార్లు నిర్ణీత సమయాలలో అల్లాహ్ (సు.తా.), దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) కు నేర్పిన విధంగా నమాజ్' చేయడం. ('స'హీ'హ్ బు'ఖారీ, పు-1, 'హదీస్' నం. 702, 703, 704, 723, 786, 787). [3] ''జకాతున్: అంటే, ఒక సంవత్సరం వరకు జమ ఉన్న, ధన సంపత్తుల నుండి ప్రతి సంవత్సరం, ఒక ప్రత్యేక శాతం విధిగా ఇవ్వవలసిన దానం. ఇది ఇస్లాం ధర్మంలోని ఐదు విధులలో ఒకటి. 'జకాత్, ముస్లిం సమాజపు ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచటానికి, సమాజంలో ఎవ్వడు కూడా నిరాధారంగా లేకుండా ఉండటానికి నియమించబడిన, ఒక ఉత్తమమైన ధార్మిక మరియు సాంఘిక నియమం, ('స'హీ'హ్ బు'ఖారీ, పు. 2, అధ్యాయం-24).

التفاسير:

external-link copy
4 : 2

وَالَّذِیْنَ یُؤْمِنُوْنَ بِمَاۤ اُنْزِلَ اِلَیْكَ وَمَاۤ اُنْزِلَ مِنْ قَبْلِكَ ۚ— وَبِالْاٰخِرَةِ هُمْ یُوْقِنُوْنَ ۟ؕ

మరియు ఎవరైతే (ఓ ముహమ్మద్!) నీపై అవతరింప జేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ ను)[1] మరియు నీకు పూర్వం అవతరింప జేయబడిన వాటినీ (దివ్య గ్రంథాలను) విశ్వసిస్తారో మరియు పరలోక జీవితాన్ని దృఢంగా నమ్ముతారో! info

[1] 'అబ్దుల్లాహ్ ఇబ్నె-'ఉమర్ (ర'ది.'అ.) కథనం, మహాప్రవక్త )'స'అస) ప్రవచనం: "ఇస్లాం ఈ ఐదు ప్రధాన సిద్ధాంతాలపై ఆధారపడి ఉంది. అవి: '1. అల్లాహ్ (సు.తా.) తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు మరియు ము'హమ్మద్ ('స'అస), అల్లాహుతా'ఆలా యొక్క ప్రవక్త అనే దృఢవిశ్వాసం ప్రకటించటం, 2. రోజుకు ఐదుసార్లు విధిగా నమాజ్' చేయటం, 3. విధిదానం ('జకాత్) చెల్లించటం, 4. రమ'దాన్ నెలలో ఉపవాసముండటం, 5. శారీరక మరియు ఆర్థిక స్తోమత ఉంటే జీవితంలో ఒకసారి 'హజ్ చేయటం.' '' ('స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం-1, 'హదీస్' నెం.7).

التفاسير:

external-link copy
5 : 2

اُولٰٓىِٕكَ عَلٰی هُدًی مِّنْ رَّبِّهِمْ ۗ— وَاُولٰٓىِٕكَ هُمُ الْمُفْلِحُوْنَ ۟

అలాంటి వారే తమ ప్రభువు (చూపిన) సన్మార్గంలో ఉన్నవారు మరియు అలాంటి వారే సాఫల్యం పొందేవారు info
التفاسير: