[1] అంటే జు'ల్-'హజ్ యొక్క మొదటి పదిరాత్రులని చాలా మంది వ్యాఖ్యాతల అభిప్రాయం. వీటి ఘనత 'హదీస్' లలో ఉంది. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "జు'ల్-'హజ్జ్ మొదటి పది రోజులలో చేసే సత్కార్యాలు అల్లాహ్ (సు.తా.)కు ఎంతో ఇష్టమైనవి - జిహాద్ కంటే కూడా - మానవుడు అమరగతి నొందిన జిహాద్ తప్ప! ('స'హీ'హ్ బు'ఖారీ).
[1] అల్లాహ్ (సు.తా.) ధనధాన్యాలు, సౌభాగ్యాలు, ఇచ్చినా పరీక్షించటానికే! మరియు పేదరికానికి గురిచేసినా, అదీ పరీక్షించటానికే!
[1] చూఅల్లాహ్ (సు.తా.) తన సద్వర్తనులైన దాసులకు భోగభాగ్యాలు, ధనధాన్యాలు ప్రసాదించవచ్చు! లేక పేదరికానికీ గురిచేసి పరీక్షించవచ్చు. అదే విధంగా సత్యతిరస్కారులకు కూడా ఐశ్వర్యాలివ్వవచ్చు లేక పేదరికంతో పరీక్షించవచ్చు! సద్వర్తనులైన విశ్వాసులు ఐశ్వర్యవంతులుగా ఉంటే అల్లాహ్ (సు.తా.)కు కృతజ్ఞులుగా ఉంటారు. పేదరికానికి గురి అయితే సహనం వహిస్తారు.
[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "అనాథులతో మంచిగా వ్యవహరించే వారు స్వర్గంలో నాతో పాటు - రెండు వ్రేళ్ళు తోడుగా ఉన్నట్లు - ఉంటారు." (అబూ-దావూద్) కావున అనాథలను పోషించడం, వారితో మంచిగా వ్యవహరించడం ఎంతో పుణ్యకార్యం.