पवित्र कुरअानको अर्थको अनुवाद - तेलगु अनुवाद : अब्दुर्रहीम बिन्हम् ।

అల్-ఫజ్ర్

external-link copy
1 : 89

وَالْفَجْرِ ۟ۙ

ప్రాంతః కాలం సాక్షిగా![1] info

[1] అంటే ప్రతి ఉదయం ఒక ప్రత్యేక ఉదయం కాదు.

التفاسير:

external-link copy
2 : 89

وَلَیَالٍ عَشْرٍ ۟ۙ

పది రాత్రుల సాక్షిగా![1] info

[1] అంటే జు'ల్-'హజ్ యొక్క మొదటి పదిరాత్రులని చాలా మంది వ్యాఖ్యాతల అభిప్రాయం. వీటి ఘనత 'హదీస్' లలో ఉంది. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "జు'ల్-'హజ్జ్ మొదటి పది రోజులలో చేసే సత్కార్యాలు అల్లాహ్ (సు.తా.)కు ఎంతో ఇష్టమైనవి - జిహాద్ కంటే కూడా - మానవుడు అమరగతి నొందిన జిహాద్ తప్ప! ('స'హీ'హ్ బు'ఖారీ).

التفاسير:

external-link copy
3 : 89

وَّالشَّفْعِ وَالْوَتْرِ ۟ۙ

సరి బేసీల సాక్షిగా! info
التفاسير:

external-link copy
4 : 89

وَالَّیْلِ اِذَا یَسْرِ ۟ۚ

గడచిపోయే రాత్రి సాక్షిగా! info
التفاسير:

external-link copy
5 : 89

هَلْ فِیْ ذٰلِكَ قَسَمٌ لِّذِیْ حِجْرٍ ۟ؕ

వీటిలో బుద్ధిగల వాని కొరకు ఏ ప్రమాణమూ లేదా ఏమిటి?[1] info

[1] అంటే వీటన్నిటి ప్రమాణం చేయటం, అల్లాహ్ (సు.తా.)ను విశ్వసించటానికి చాలదా! 'హిజ్ రున్: ఆపటం, కాదనటం, బుద్ధి కూడా మానవుడిని చెడు కర్మల నుండి ఆపుతుంది.

التفاسير:

external-link copy
6 : 89

اَلَمْ تَرَ كَیْفَ فَعَلَ رَبُّكَ بِعَادٍ ۟

నీ ప్రభువు ఆద్ (జాతి) వారి పట్ల ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా?[1] info

[1] వారి ప్రవక్త హూద్ ('అ.స.) చూడండి, 69:7-10 మరియు 7:65-72.

التفاسير:

external-link copy
7 : 89

اِرَمَ ذَاتِ الْعِمَادِ ۟

ఎత్తైన స్థంభాల (భవనాలు గల) ఇరమ్ ప్రజల పట్ల?[1] info

[1] ఇరము: ఒక తెగ పేరు. దాని పూర్వోత్తరాలు ఇలా ఉన్నాయి: 'ఆద్ బిన్-'ఔస్ బిన్-ఇరమ బిన్ -సామ్ బిన్-నూ'హ్. (ఫత్హ్ అల్-ఖదీర్) వీరిని 'ఆద్ఊలా, అని కూడా అంటారు.వీరిని ఎత్తైన స్తంభాల (భవనాల) వారని కూడా అంటారు.

التفاسير:

external-link copy
8 : 89

الَّتِیْ لَمْ یُخْلَقْ مِثْلُهَا فِی الْبِلَادِ ۟

వారిలాంటి జాతి భూమిలో ఎన్నడూ సృష్టించబడలేదు.[1] info

[1] 'ఆద్ జాతివారికి తమ బలసామర్థ్యాల మీద ఎంతో గర్వం ఉండేది. చూడండి, 41:15.

التفاسير:

external-link copy
9 : 89

وَثَمُوْدَ الَّذِیْنَ جَابُوا الصَّخْرَ بِالْوَادِ ۟

మరియు లోయలలోని కొండరాళ్ళలో (భవనాలను) తొలిచిన సమూద్ జాతి పట్ల?[1] info

[1] వీరి ప్రవక్త 'సాలిహ్' ('అ.స.). చూడండి, 26:149.

التفاسير:

external-link copy
10 : 89

وَفِرْعَوْنَ ذِی الْاَوْتَادِ ۟

మరియు మేకులవాడైన ఫిర్ఔన్ పట్ల?[1] info

[1] అంటే పెద్ద సైన్యం గలవాడు, లేక ప్రజలను మేకులతో నాటి శిక్షించేవాడు. (ఫత్హ్ అల్-ఖదీర్)

التفاسير:

external-link copy
11 : 89

الَّذِیْنَ طَغَوْا فِی الْبِلَادِ ۟

వారంతా ఆయా దేశాలలో తలబిరుసుతనంతో ప్రవర్తించారు; info
التفاسير:

external-link copy
12 : 89

فَاَكْثَرُوْا فِیْهَا الْفَسَادَ ۟

మరియు వాటిలో దౌర్జన్యాన్ని రేకెత్తించారు. info
التفاسير:

external-link copy
13 : 89

فَصَبَّ عَلَیْهِمْ رَبُّكَ سَوْطَ عَذَابٍ ۟ۚۙ

కాబట్టి నీ ప్రభువు వారిపైకి అనేక రకాల బాధాకరమైన శిక్షలను పంపాడు. info
التفاسير:

external-link copy
14 : 89

اِنَّ رَبَّكَ لَبِالْمِرْصَادِ ۟ؕ

వాస్తవానికి, నీ ప్రభువు మాటు వేసి ఉన్నాడు (అంతా కనిపెడ్తూ ఉంటాడు)! info
التفاسير:

external-link copy
15 : 89

فَاَمَّا الْاِنْسَانُ اِذَا مَا ابْتَلٰىهُ رَبُّهٗ فَاَكْرَمَهٗ وَنَعَّمَهٗ ۙ۬— فَیَقُوْلُ رَبِّیْۤ اَكْرَمَنِ ۟ؕ

అయితే మానవుడు ఎలాంటి వాడంటే: అతని ప్రభువు అతన్ని పరీక్షించటానికి, అతనికి గౌరవ ప్రతిష్టల నిచ్చి అనుగ్రహించి నప్పుడు: "నా ప్రభువు నన్ను గౌరవించాడు." అని అంటాడు;[1] info

[1] అల్లాహ్ (సు.తా.) ధనధాన్యాలు, సౌభాగ్యాలు, ఇచ్చినా పరీక్షించటానికే! మరియు పేదరికానికి గురిచేసినా, అదీ పరీక్షించటానికే!

التفاسير:

external-link copy
16 : 89

وَاَمَّاۤ اِذَا مَا ابْتَلٰىهُ فَقَدَرَ عَلَیْهِ رِزْقَهٗ ۙ۬— فَیَقُوْلُ رَبِّیْۤ اَهَانَنِ ۟ۚ

కాని, అతన్ని పరీక్షించటానికి, అతని ఉపాధిని తగ్గించినప్పుడు: "నా ప్రభువు నన్ను అవమానించాడు." అని అంటాడు.[1] info

[1] చూఅల్లాహ్ (సు.తా.) తన సద్వర్తనులైన దాసులకు భోగభాగ్యాలు, ధనధాన్యాలు ప్రసాదించవచ్చు! లేక పేదరికానికీ గురిచేసి పరీక్షించవచ్చు. అదే విధంగా సత్యతిరస్కారులకు కూడా ఐశ్వర్యాలివ్వవచ్చు లేక పేదరికంతో పరీక్షించవచ్చు! సద్వర్తనులైన విశ్వాసులు ఐశ్వర్యవంతులుగా ఉంటే అల్లాహ్ (సు.తా.)కు కృతజ్ఞులుగా ఉంటారు. పేదరికానికి గురి అయితే సహనం వహిస్తారు.

التفاسير:

external-link copy
17 : 89

كَلَّا بَلْ لَّا تُكْرِمُوْنَ الْیَتِیْمَ ۟ۙ

అలా కాదు, వాస్తవానికి మీరు అనాథులను ఆదరించరు;[1] info

[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "అనాథులతో మంచిగా వ్యవహరించే వారు స్వర్గంలో నాతో పాటు - రెండు వ్రేళ్ళు తోడుగా ఉన్నట్లు - ఉంటారు." (అబూ-దావూద్) కావున అనాథలను పోషించడం, వారితో మంచిగా వ్యవహరించడం ఎంతో పుణ్యకార్యం.

التفاسير:

external-link copy
18 : 89

وَلَا تَحٰٓضُّوْنَ عَلٰی طَعَامِ الْمِسْكِیْنِ ۟ۙ

మరియు మీరు పేదలకు అన్నం పెట్టే విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోరు;[1] info

[1] చూడండి, 107:3.

التفاسير:

external-link copy
19 : 89

وَتَاْكُلُوْنَ التُّرَاثَ اَكْلًا لَّمًّا ۟ۙ

మరియు వారసత్వపు ఆస్తిని పేరాశతో అంతా మీరే తినేస్తారు. info
التفاسير:

external-link copy
20 : 89

وَّتُحِبُّوْنَ الْمَالَ حُبًّا جَمًّا ۟ؕ

మరియు మీరు ధనవ్యామోహంలో దారుణంగా చిక్కుకు పోయారు![1] info

[1] జమ్మన్: కసీ'రన్, చాలా.

التفاسير:

external-link copy
21 : 89

كَلَّاۤ اِذَا دُكَّتِ الْاَرْضُ دَكًّا دَكًّا ۟ۙ

అలా కాదు, భూమి, దంచి పిండిపిండిగా చేయబడినపుడు; info
التفاسير:

external-link copy
22 : 89

وَّجَآءَ رَبُّكَ وَالْمَلَكُ صَفًّا صَفًّا ۟ۚ

మరియు నీ ప్రభువు (స్వయంగా) వస్తాడు మరియు దేవదూతలు వరుసలలో వస్తారు.[1] info

[1] ఏడు ఆకాశాల దైవదూతలు ఏడు వరుసలలో నిలబడతారు.

التفاسير:

external-link copy
23 : 89

وَجِایْٓءَ یَوْمَىِٕذٍ بِجَهَنَّمَ ۙ۬— یَوْمَىِٕذٍ یَّتَذَكَّرُ الْاِنْسَانُ وَاَنّٰی لَهُ الذِّكْرٰی ۟ؕ

ఆ రోజు నరకం (ముందుకు) తీసుకు రాబడుతుంది. ఆ రోజు మానవుడు (తన కర్మలన్నీ) జ్ఞప్తికి తెచ్చుకుంటాడు; కాని ఆ రోజు జ్ఞప్తికి తెచ్చుకోవడం వల్ల అతనికి కలిగే ప్రయోజనమేమిటీ? info
التفاسير:

external-link copy
24 : 89

یَقُوْلُ یٰلَیْتَنِیْ قَدَّمْتُ لِحَیَاتِیْ ۟ۚ

అతడు: "అయ్యో! నా పాడుగానూ! నా ఈ జీవితం కొరకు నేను (సత్కార్యాలు) చేసి పంపు కొని ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు. info
التفاسير:

external-link copy
25 : 89

فَیَوْمَىِٕذٍ لَّا یُعَذِّبُ عَذَابَهٗۤ اَحَدٌ ۟ۙ

అయితే, ఆ రోజు, ఆయన (అల్లాహ్) శిక్షించినట్లు, మరెవ్వడూ శిక్షించలేడు! info
التفاسير:

external-link copy
26 : 89

وَّلَا یُوْثِقُ وَثَاقَهٗۤ اَحَدٌ ۟ؕ

మరియు ఆయన (అల్లాహ్) బంధించినట్లు, మరెవ్వడూ బంధించలేడు.[1] info

[1] చూడండి, 73:12-13.

التفاسير:

external-link copy
27 : 89

یٰۤاَیَّتُهَا النَّفْسُ الْمُطْمَىِٕنَّةُ ۟ۗۙ

(సన్మార్గునితో ఇలా అనబడుతుంది): "ఓ తృప్తి పొందిన ఆత్మా! info
التفاسير:

external-link copy
28 : 89

ارْجِعِیْۤ اِلٰی رَبِّكِ رَاضِیَةً مَّرْضِیَّةً ۟ۚ

నీ ప్రభువు సన్నిధికి మరలి రా! (నీకు లభించే సత్ఫలితానికి) ఆనందిస్తూ మరియు (నీ ప్రభువునకు) ప్రియమైనదానివై! info
التفاسير:

external-link copy
29 : 89

فَادْخُلِیْ فِیْ عِبٰدِیْ ۟ۙ

నీవు (పుణ్యాత్ములైన) నా దాసులలో చేరిపో! info
التفاسير:

external-link copy
30 : 89

وَادْخُلِیْ جَنَّتِیْ ۟۠

మరియు నీవు నా స్వర్గంలో ప్రవేశించు!" info
التفاسير: